Home
How to

ఆధార్ PVC కార్డ్‌ని మొత్తం కుటుంబం కోసం పొందడం ఎలా?

భారతీయ పౌరులు తమ గుర్తింపును నిరూపించుకునే అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి ఆధార్ కార్డు. ఒక వ్యక్తి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ నుండి ప్రత్యేకమైన గుర్తింపు కార్డును పొందగలిగినప్పటికీ UIDAI ఇప్పుడు ఆధార్ PVC కార్డ్‌ని తీసుకువచ్చింది. అది కేవలం ఒక మొబైల్ నంబర్‌ని ఉపయోగించి మొత్తం కుటుంబం కోసం ఆర్డర్ చేయగలదు.

How to Get Aadhaar PVC Card For Whole Family?

"మీ యొక్క ఆధార్‌ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో సంబంధం లేకుండా అతేంటికేషన్ కోసం OTPని స్వీకరించడానికి మీరు ఏదైనా మొబైల్ నంబర్‌ని ఉపయోగించవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి మొత్తం కుటుంబం కోసం ఆన్‌లైన్‌లో ఆధార్ PVC కార్డ్‌లను ఆర్డర్ చేయవచ్చు" అని UIDAI అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది.

How to Get Aadhaar PVC Card For Whole Family?

ఆధార్ PVC కార్డ్‌ అనేది డిజిటల్ సంతకం చేయబడిన, సురక్షిత QR కోడ్ ఫోటోగ్రాఫ్ మరియు బహుళ సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన జనాభా వివరాలతో ఉంటుంది. అయితే దీనిని ఉచితంగా పొందడం కుదరదు. PVC కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే ఎవరైనా నామమాత్రపు మొత్తంగా రూ.50 చెల్లించాలి అని గుర్తుంచుకోండి. ఈ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో uidai.gov.in లేదా రెసిడెంట్.uidai.gov.in ద్వారా ఆధార్ నంబర్, వర్చువల్ ID లేదా ఎన్‌రోల్‌మెంట్ IDని ఉపయోగించి ఆర్డర్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ PVC కార్డ్‌ని ఎలా పొందాలి అని ఆలోచిస్తుంటే కనుక కింద ఉన్న సాధారణ గైడ్ ను అనుసరించి సులభంగా పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్ PVC కార్డ్‌ని పొందే విధానం

How to Get Aadhaar PVC Card For Whole Family?

** అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి లేదా https://uidai.gov.in అని టైప్ చేయండి.

** 'ఆర్డర్ ఆధార్ PVC కార్డ్' సర్వీసుపై నొక్కండి మరియు మీ 12 అంకెల ప్రత్యేక ఆధార్ నంబర్ (UID) లేదా 28 అంకెల ఎన్రోల్ మెంట్ ను నమోదు చేయండి.

** సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేసి ఆపై 'మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోతే, దయచేసి బాక్స్‌లో చెక్ చేయండి' అనే చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి.

** నమోదు కాని/ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత 'Send OTP'పై క్లిక్ చేయండి.

** 'నిబంధనలు మరియు షరతులు'కు వ్యతిరేకంగా గల చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి.

** OTP ధృవీకరణను పూర్తి చేయడానికి 'సమర్పించు' ఎంపికపై క్లిక్ చేయండి.

** తరువాత 'చెల్లించండి' ఎంపికపై క్లిక్ చేయండి. క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మరియు UPI వంటి పేమెంట్ ఎంపికలతో మీరు పేమెంట్ గేట్‌వే పేజీకి మళ్లించబడతారు.

** పేమెంట్ విజయవంతమైన తర్వాత డిజిటల్ సంతకంతో కూడిన రసీదు రూపొందించబడుతుంది. దీనిని PDF ఆకృతిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్ SMS ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ నంబర్‌ను కూడా పొందుతారు.

ఆధార్ కార్డులో ఫోటోను మార్చే విధానం

స్టెప్ 1: ఆధార్ వెబ్‌సైట్‌లో ముందుగా లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: ఆధార్ కార్డు ఫారమ్‌ను పూరించండి మరియు దానిపై ఆధార్ నంబర్ రాయండి.

స్టెప్ 3: మీ సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించండి.

స్టెప్ 4: మీ ఫారమ్‌ను అతనికి సమర్పించండి.

స్టెప్ 5: మీరు తప్పనిసరిగా ఓటరు ID కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన ఏదైనా గుర్తింపు పత్రాన్ని కలిగి ఉండాలి.

స్టెప్ 6: మీతో ఆధార్ కార్డును ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లండి.

స్టెప్ 7: నమోదు కేంద్రంలో ఉన్న ఉద్యోగి ఆధార్ కార్డుదారుడి అంటే మీ యొక్క ఫోటో మరియు బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకుంటారు.

స్టెప్ 8: దీని తరువాత మీరు మీ URN ని కలిగి ఉన్న రసీదు స్లిప్‌ను పొందుతారు.

స్టెప్ 9: ఆధార్ స్టేటస్ ని తనిఖీ చేయడానికి URN ని ఉపయోగించండి.

స్టెప్ 10: అప్‌డేట్ చేయడానికి మొత్తం సమాచారం బెంగళూరు కేంద్రానికి చేరుతుంది.

స్టెప్ 11: కొత్త ఆధార్ కార్డు రెండు వారాల్లో మీ రిజిస్టర్డ్ చిరునామాకు చేరుకుంటుంది.

స్టెప్ 12: ఫోటో మార్చడానికి రూ.25 మరియు GST రుసుము వసూలు చేయబడుతుంది.

ఆధార్ కార్డులోని ఫోటోను ఆన్‌లైన్‌లో మార్చలేము. ఈ ప్రక్రియ చిరునామా మార్పు కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Get Aadhaar PVC Card For Whole Family?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X