మీ ఫోన్‌లో Airtel VoLTE పొందటం ఎలా..?

మీ వద్ద ఎయిర్‌టెల్ 4జీ సిమ్ ఉందా..

|

భారతీ ఎయిర్‌టెల్ తన వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ (VoLTE) సర్వీసులను సోమవారం మార్కెట్లో ప్రారంభించింది. తొలత ఈ సేవలు ముంబైలో మాత్రమే అందుబాటలో ఉంటాయి. త్వరలోనే ఈ సర్వీసును మరిన్ని ప్రాంతాలకు ఎయిర్‌టెల్ విస్తరించనుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎయిర్‌టెల్ 4జీ వోల్ట్ సేవలు త్వరలోనే అందుబాటలోకి వచ్చే అవకాశముంది. ఎయిర్‌టెల్ యూజర్లు తమ ఫోన్‌లలో 4జీ VoLTE సర్వీసును ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవల్సిందే...

కొత్త వైరస్ ఇది, మీ ఫోన్ ద్వారానే మీ అకౌంట్లో డబ్బులు గోవిందాకొత్త వైరస్ ఇది, మీ ఫోన్ ద్వారానే మీ అకౌంట్లో డబ్బులు గోవిందా

www.airtel.in/volte పేజీలోకి వెళ్లటం ద్వారా

www.airtel.in/volte పేజీలోకి వెళ్లటం ద్వారా

మీ ఫోన్‌లో ఎయిర్‌టెల్ VoLTE సర్వీసును పొందాలనుకుంటున్నట్లయితే ముందుగా మీ ఫోన్ ఆ సర్వీసును సపోర్ట్ చేస్తుందో, లేదో చెక్ చేసుకోవల్సి ఉంటుంది. www.airtel.in/volte పేజీలోకి వెళ్లటం ద్వారా పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి.

ఎయిర్‌టెల్ VoLTE సర్వీసును సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు..

ఎయిర్‌టెల్ VoLTE సర్వీసును సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు..

ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, సామ్‌సంగ్ గెలాక్సీ జే7, గెలాక్సీ ఏ8, గెలాక్సీ జే2 ప్రో, గెలాక్సీ జే2 2016, షియోమి ఎంఐ మాక్స్ ప్రైమ్, రెడ్‌మి నోట్ 4, ఎంఐ మాక్స్, ఎంఐ 5, జియోనీ ఏ1, ఒప్పో ఎఫ్3 ప్లస్.

ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌ తప్పనిసరి..
 

ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌ తప్పనిసరి..

ఎయిర్‌టెల్ VoLTE సర్వీసును మీ ఫోన్ సపోర్ట్ చేయాలంటే, ఖచ్చితంగా మీ డివైస్ ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌ను కలిగి ఉండాలి. ఇదే సమయంలో మీ ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ పై రన్ అవుతుండాలి.

ఆండ్రాయిడ్ యూజర్లు..

ఆండ్రాయిడ్ యూజర్లు..

ఆండ్రాయిడ్ యూజర్లు ఎయిర్‌టెల్ VoLTE సేవలను ఉపయోగించుకోవాలంటే ఫోన్ Settings > Mobile Network > Turn on VoLTE call

iOS యూజర్లు..

iOS యూజర్లు..

iOS యూజర్లు ఎయిర్‌టెల్ VoLTE సేవలను ఉపయోగించుకోవాలంటే ఫోన్ Settings>Mobile Data > Mobile Data Options > Enable 4G > Turn on Voice & Data

నెట్‌వర్క్ మోడ్‌ను మార్చుకోవాలి..

నెట్‌వర్క్ మోడ్‌ను మార్చుకోవాలి..

డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించుకుంటోన్న యూజర్లు తమ ఎయిర్‌టెల్ సిమ్‌కు సంబంధించిన నెట్‌వర్క్ మోడ్‌ను "4G/3G/2G (Auto)"లో ఉంచుకోవాలి. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలంటే ఫోన్ Settings > Sim networks > Preferred network type > 4G/3G/2G.

Best Mobiles in India

English summary
How to Get Airtel VoLTE. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X