Just In
- 3 hrs ago
Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు
- 3 hrs ago
Qualcomm కంపెనీ కొత్తగా రెండు చిప్సెట్లను విడుదల చేసింది!! ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా...
- 5 hrs ago
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ లో టాబ్లెట్ల కొనుగోలుపై ఊహించని తగ్గింపు ఆఫర్లు....
- 21 hrs ago
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
Don't Miss
- News
రెచ్చగొడుతున్నావా? నన్ను చంపాలని కుట్ర: చంద్రబాబుపై భగ్గుమన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
- Finance
బాదుడు కంటిన్యూస్: వాటి రేట్లల్లో భారీగా పెరుగుదల
- Movies
Sarkaru Vaari paata day 9 Collections.. మహేష్ మూవీ ఇంకా నష్టాల్లోనే.. లాభాల్లోకి రావాలంటే?
- Sports
Indian Team for SA: కవలవరపెడుతున్న గాయాల బెడద.. టీ20 సిరీస్ నుంచి మరో స్టార్ పేసర్ ఔట్!
- Lifestyle
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65
- Automobiles
ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
5 నెలల ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందడం ఎలా?
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అనేది సర్వసాధారణం అయింది. అన్ని రకాల స్మార్ట్ఫోన్లలో ముఖ్యంగా ఐఫోనెను కొనుగోలు చేయాలనీ ప్రతి ఒక్కరు భవిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఐఫోన్ ను ఉపయోగించే వినియోగదారులకు షాజామ్ వినియోగం కొత్తేమీ కాదు. ఆపిల్ సంస్థ 2018లో షాజామ్ని కొనుగోలు చేసింది. అయితే రెండు సంవత్సరాల తర్వాత ఒరిజినల్ ప్లాట్‌ఫారమ్‌ను విడిగా సజీవంగా ఉంచుతూ iOS 14.2 ప్రారంభించడంతో కంపెనీ మ్యూజిక్ డిస్కవరీ ప్లాట్‌ఫారమ్‌ను స్థానిక iOS కార్యాచరణగా తీసుకువచ్చింది. దీన్ని ఐఫోన్లలో పొందుపరచడంతో పాటు యాపిల్ మ్యూజిక్‌ను క్రమం తప్పకుండా ప్రచారం చేయడానికి షాజామ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఆపిల్ ఉపయోగిస్తోంది.

దాదాపు ప్రతి హాలిడే సీజన్లో ఆపిల్ మరియు షాజామ్ కొత్త ఆఫర్లను ప్రవేశపెడతాయి. ఇందులో భాగంగా షాజామ్ ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ షాజామ్ మరోసారి వినియోగదారులకు ఉచిత Apple Music సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఆపిల్ మ్యూజిక్ కి కొత్తగా వచ్చిన వినియోగదారులు ఆపిల్ యొక్క మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ యొక్క ఐదు నెలల ఉచిత ట్రయల్‌ను ఉచితంగా పొందుతారు.

జియోఫోన్ 5G యొక్క ఫీచర్స్ వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి!!
యాపిల్ సంస్థ కూడా కొత్త మ్యూజిక్ యూజర్లకు మూడు నెలల ఉచిత ట్రయల్‌ను ఆఫర్ చేయడం గమనార్హం. ఇప్పటికే ఉన్న ఈ ఆఫర్‌కు అనుగుణంగా ఇప్పటికే మూడు నెలల ఉచిత ఆపిల్ మ్యూజిక్ ట్రయల్‌ని పొందిన వినియోగదారులు మరొక రెండు నెలల అదనపు సబ్స్క్రిప్షన్ సమయాన్ని కూడా ఉచితంగా పొందుతారు. మరోవైపు ఈ ఆఫర్‌ను ఇంకా పొందని కొత్త సబ్స్క్రైబర్లు ఐదు నెలల పాటు ఉచిత ట్రయల్‌ని పొందవచ్చు. యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రైబర్ల కోసం షాజమ్ ఈ ఆఫర్‌ను ఈ సంవత్సరం చాలా కాలంగా అమలు చేస్తోంది. మీరు ఇంకా ఈ ఆఫర్‌ను పొందకుండా ఉంటే కనుక ఇప్పుడు మీరు దీన్ని పొందడానికి కింద తెలిపే దశల వారీ గైడ్ ను అనుసరించండి.
Shazam ద్వారా ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే విధానం

యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను 5 నెలల చెల్లుబాటు కాలానికి ఉచితంగా పొందడానికి కింద తెలిపే 5 దశల గైడ్ ను అనుసరించడం ద్వారా సులభంగా పొందవచ్చు.
స్టెప్ 1: మొదటగా షాజమ్ వెబ్‌సైట్‌కి (https://www.shazam.com/applemusic) వెళ్లండి.
స్టెప్ 2: మీ ఫోన్ కెమెరా యాప్‌ని ఓపెన్ చేసి స్క్రీన్‌పై ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేయండి. ఇది మిమ్మల్ని మీ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ద్వారా Shazam వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది.
స్టెప్ 3: ఇప్పుడు FaceIDని ఉపయోగించి మీ గుర్తింపును ధృవీకరించండి. దాని కోసం మీరు పవర్ బటన్‌పై రెండుసార్లు నొక్కండి.
స్టెప్ 4: మీ గుర్తింపు ధృవీకరించబడిన తర్వాత మీరు ఇంతకు ముందు మూడు నెలల ఉచిత ఆపిల్ మ్యూజిక్ ట్రయల్‌ని పొందారా లేదా అని ఆపిల్ తనిఖీ చేస్తుంది. ఒకవేళ మీరు కలిగి ఉంటే కనుక మీరు రెండు నెలల ఉచిత ఆపిల్ మ్యూజిక్ సభ్యత్వాన్ని పొందుతారు. మీరు పొందకపోయి ఉంటే కనుక మీరు ఐదు నెలల ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999