సిగ్నల్స్ వీక్ టైంలో కాల్ మాట్లాడటం ఎలా..?
సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్ మాట్లాడటం చాలా కష్టమవుతూ ఉంటుంది. అదే చాలా ముఖ్యమైన కాల్ అయితే మనకు ఎక్కడ లేని విసుగు వస్తుంది. ఫోన్ నేల కేసి కొట్టాలనిపిస్తుంది. సిగ్నల్స్ వీక్ అని మనకు ఎటువంటి అలర్ట్స్ లేకుండానే ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి. మన ఫోన్ సిగ్నల్ వీక్ సమయంలో బాగా పనిచేయాలంటే ఏం చేయాలి. దీనిపై మీకు సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం. వాటిని ఫాలో అయితే చాలు. మీరు ఆటోమేటిగ్గా ఈ సమస్యను జయిస్తారు.
Read more: ల్యాప్‌టాప్‌కి వైఫై హాట్‌స్పాట్ కనెక్ట్ అవ్వడం ఎలా..?

3జీ నుండి 2జీకి
మీ ఫోన్ సిగ్నల్స్ బాగా వీక్ గా ఉన్న సమయంలో మీరు 3జీ నుంచి 2జీకి మీ ఫోన్ సెట్టింగ్ మార్చుకోండి. దీని వల్ల మీ వాయిస్ సిగ్నల్స్ కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంటుంది. 2జీ అనేది అన్ని చోట్ల పాతుకుపోయి ఉంటుంది. అయితే 3జీ మాత్రం కొన్ని చోట్ల మాత్రమే వస్తూ ఉంటుంది. దీని వల్ల సిగ్నల్స్ ప్రాబ్లం వస్తుంది.

గ్లాస్ ధంబ్లర్
ఇది కనెక్షన్ లేని ఏరియాలో మీ ఫోన్ సిగ్నల్స్ ని కొంచెం పెంచుతుంది. మీరు ధంబ్లర్ ని వాడటం వల్ల కొన్ని సిగ్నల్స్ ని గమనించవచ్చు. మీ ఫోన్ గ్లాస్ లో ఉంచడంవల్ల మీరు కొన్ని సిగ్నల్స్ రావడం గమనిస్తారు. కనీసం ఓ ఫోన్ మాట్లాడటానికి సరిపోయేంత సిగ్నల్ వస్తుంది. అయితేమీరు అక్కడ ఇయర్ ఫోన్స్ కాని లేకుంటే లౌడ్ స్పీకర్ కాని ఉపయోగించండి.

ఇన్‌స్టాల్ బూస్టర్స్
మీరు సిగ్నల్ బూస్టర్ పెట్టుకోవడం వల్ల సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో మీకు మరింతగా సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఫోన్ పట్టుకోవడంలో మార్పులు
మీరు మీ ఫోన్ పట్టుకుని మాట్లాడే సమయంలో సిగ్నల్స్ వచ్చే దగ్గర మీ ఫోన్ గట్టిగా పట్టుకుంటే సిగ్నల్స్ వీకయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా మీకు అనేక సమస్యలు తలెత్తవచ్చు.

వేరే నంబర్ కి కాల్ నంబర్స్
ఇక ఫైనల్ గా మీ ఫోన్ సిగ్నల్స్ సరిగా రావడం లేదంటే మీరు ఆ నంబర్ నుంచి వేరే నంబర్ కి మీ కాల్స్ పార్వర్డ్ చేసుకోవడం చాలా ఉత్తమం.మీ ఫోన్ కాల్స్ ల్యాండ్ లైన్ కి కూడా ఫార్వర్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.


Click it and Unblock the Notifications








