Home
How to

BSNL యొక్క జనరల్ డూప్లికేట్ బిల్లును పొందడం ఎలా?

ప్రభుత్వ ఆద్వర్యంలోని టెల్కో బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ మరియు శాటిలైట్ ఫోన్ వంటి అనేక రకాల సేవలను అందిస్తుంది. ఈ సర్వీసులను రీఛార్జ్ చేసిన కస్టమర్లకు ప్రభుత్వ-టెల్కో డూప్లికేట్ బిల్లులను అందిస్తుంది. ఆపరేటర్లు వినియోగదారులను వారి బిల్లులను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి, ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి, సంబంధిత కనెక్షన్‌ల కోసం బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. మీ BSNL కనెక్షన్ యొక్క డూప్లికేట్ బిల్లును ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Get BSNLs General Duplicate Bill?

బిఎస్ఎన్ఎల్ జనరల్ డూప్లికేట్ బిల్లును పొందే విధానం

మీ యొక్క బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ యొక్క డూప్లికేట్ బిల్లును పొందడానికి కింద పేర్కొన్న సరళమైన దశలను అనుసరించండి.

*** BSNL యొక్క https://portal.bsnl.in/myportal/authorize.do పోర్టల్‌ను ఓపెన్ చేయండి. తదుపరి దశలో సైన్-ఇన్ చేయవలసి ఉంటుంది. మీ అకౌంటుకు సైన్-ఇన్ చేయడానికి మీరు మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ / ఇమెయిల్ ఐడిను నమోదు చేయవలసి ఉంటుంది. కానీ ఇది నమోదిత వినియోగదారులకు మాత్రమే.

How to Get BSNLs General Duplicate Bill?

*** నమోదు చేయని వినియోగదారుల కోసం మొదటిసారి సైన్-ఇన్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక వారు 'సైన్-అప్' ఎంపికపై క్లిక్ చేసి కొత్త అకౌంటును సృష్టించవలసి ఉంటుంది. వారి అకౌంట్ ధృవీకరించబడిన తర్వాత 'సైన్-ఇన్' పేజీకి తిరిగి వచ్చి మీ అకౌంటుతో సైన్-ఇన్ చేయవచ్చు.

*** మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు కావలసిన డూప్లికేట్ బిల్లు సర్వీసుపై క్లిక్ చేయండి. తరువాత మీ రిజిస్టర్డ్ ల్యాండ్‌లైన్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను మళ్లీ నమోదు చేయండి. అందులో కనిపించే దశలను అనుసరించినట్లయితే డూప్లికేట్ బిల్లు వెంటనే తెరవబడుతుంది.

How to Get BSNLs General Duplicate Bill?

*** మరొక పద్ధతిలో కూడా పొందవచ్చు. దీని కోసం 'సర్వీస్' ఎంపికను ఎంచుకుని 'మై బిల్లులు' పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీరు పొందాలనుకునే డూప్లికేట్ బిల్లును పొందడానికి నంబర్ పై క్లిక్ చేయాలి. మీరు నంబర్‌ను క్లిక్ చేసిన తర్వాత బిల్లులు మీ కోసం ఓపెన్ చేయబడతాయి. మీకు కావలసిన బిల్లును మీరు ఎంచుకోని మీ యొక్క డివైస్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్క్రీన్‌పై డౌన్‌లోడ్ ఎంపిక మీద క్లిక్ చేయడం ద్వారా దీన్ని పొందవచ్చు.

Best Mobiles in India

English summary
How to Get BSNL's General Duplicate Bill?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X