Just In
Don't Miss
- News
అట్టారీ-వాఘా బోర్డర్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు... భారీగా హాజరైన ప్రజలు
- Sports
సచిన్ అత్యధిక పరుగుల రికార్డుని అతడు అధిగమిస్తాడు.. 200 టెస్టులు ఆడగలడు: బాయ్‌కాట్ జోస్యం
- Movies
అరియానా బర్త్ డే.. స్పెషల్ సెలెబ్రేషన్స్‌లో అవినాష్.. పిక్స్ వైరల్
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంటే ఏంటి..? దానిని ఎలా పొందవచ్చు..?
ఇంటర్నెట్ వైపు యూవత్ ప్రపంచం అడుగులు వేస్తోన్న నేపథ్యంలో డిజిటల్ సిగ్నేచర్‌లకు రోజురోజుకు ప్రాముఖ్యత పెరుగుతోంది. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఆన్‌లైన్ ఐడెంటిటీ అని అర్థం. ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్‌లో కీలక పాత్ర పోషిస్తోన్న డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ భవిష్యత్‌లో మరింత క్రియాశీలకం కాబోతోంది. వాస్తవానికి మనవద్ద ఉండే పాస్‌పోర్ట్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా పాన్‌కార్డ్‌లను ఆఫ్ లైన్ ఐడెంటిటీటా పరిగణిస్తారు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్‌ను తీసుకోవటం ద్వారా ఆన్‌లైన్ డాక్యుమెంట్‌లలో డిజిటల్‌గా సంతకం చేసే వీలుంటుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్స్ గురించి పూర్తి వివరాలను మీకందించటం జరుగుతుంది.
దిగ్గజాలను కలవరపెడుతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 9,ఆ ఫీచర్లు నిజమైతే..

డిజిటల్ సిగ్నేచర్, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ రెండూ ఒక్కటేనా..?
ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్‌తో పోలిస్తే డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి పూర్తి భిన్నంగా ఉంటాయి. డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి పూర్తిగా ఎన్‌క్రిప్ట్ కాబడి ఉంటాయి. వీటీలో మీ ఐడెంటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం పొందుపరచబడి ఉంటుంది. ఈ ఐడెంటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ వెబ్‌సైట్‌ల నుంచి సైతం మీ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవచ్చు.

డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ను ఎక్కడెక్కడ ఉపయోగించాలి..?
డిజిటల్ సిగ్నేచర్ సిర్టిఫికెట్‌లను అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించిన వెబ్‌సైట్‌లలో ఉపయోగించుకోవచ్చు.ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్, కంపెనీ ఈ-ఫైలింగ్, ఆన్‌లైన్ ఆక్షన్స్ వంటి లావాదేవీలకు ఈ సర్టిఫికెట్‌లను ఉపయోగించుకోవచ్చు. ఇదే సమయంలో పీడీఎఫ్ డాక్యుమెంట్‌లలో సంతకం చేసుకునేందుకు కూడా ఈ డిజిటల్ సర్టిఫికేట్‌లు ఉపయోగపడతాయి.మీ వద్ద డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మాటిమాటి మీ సంతకంతో కూడిన హార్డ్ కాపీలను అవతలి వ్యక్తులకు పంపవల్సిన అవసరం ఉండదు. పనులన్నీ ఆన్‌లైన్‌లో చకచకా జరిగిపోతాయి.

డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్, వాటిలో రకాలు..
క్లాస్ 1 సర్టిఫికేట్ : ఈ సర్టిఫికేట్‌లో వ్యక్తులకు సంబంధించి పేరు అలానే ఈ-మెయిల్ అడ్రస్‌లు వెరిఫై చేయబడతాయి. ఈ సర్టిఫికెట్‌ను కంపెనీలు ఉపయోగించటం కుదరదు.
క్లాస్ 2 సర్టిఫికెట్ : ఈ సర్టిఫికేట్ వ్యక్తికి సంబంధించి సమాచారాన్ని ముందుగానే వెరిఫై చేయబడిన ట్రస్డుడ్ డేటా బేస్ నుంచి వెరిఫై చేస్తుంది. ఈ సర్టిఫికేట్స్‌ను కంపెనీలు లేదా ట్రస్ట్‌లు ఉపయోగిస్తుంటాయి.
క్లాస్ 3 సర్టిఫికెట్ : ఈ సర్టిఫికెట్‌ను అత్యంత సురక్షితమైన డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌గా భారత్‌లో పరిగణించటం జరుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ ఆక్షన్స్ అలానే టెండర్స్‌లో పాల్గొనే వ్యక్తులకు ఈ సర్టిఫికెట్ ఎక్కువుగా ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ అథారిటీస్ ముందు తమ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునే వీలుంటుంది.

భారత్‌లో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్‌ను పొందటం ఎలా..?
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌లను కంట్రోలర్ ఆఫ్ సర్టిఫయ్యింగ్ అథారిటీస్ ఇష్యూ చేస్తోంది. సీసీఏ వెబ్ సైట్ లోకి వెళ్లటం ద్వారా లైసెన్సుడ్ సర్టిఫైంగ్ అథారిటీస్‌కు సంబంధించి పూర్తి జాబితాను తెలుసుకునే వీలుంటుంది. ఒక్కసారి తీసుకున్న డిజిటల్ సర్టిఫికేట్‌కు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సర్టిఫికెట్ క్లాస్‌ను బట్టి రూ.899 నుంచి రూ.5999 వరకు ఖర్చవుతుంది.

సాఫ్ట్ కాపీలను కంప్యూటర్‌లో లేదా యూఎస్బీ టోకెన్‌లలో భద్రపరుచుకోవచ్చు...
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్‌ను పొందాలనుకునే యూజర్లు తమ ఐడెండిటీ ప్రూఫ్ అలానే అడ్రస్ ప్రూఫ్‌లకు సంబంధించిన అటెస్టెడ్ కాపీలను ధృవీకరణ నిమిత్తం చూపించాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకున్న తరువాత 3 నుంచి 7 రోజుల్లోపు ఈ సర్టిఫికేట్‌ను మీకు మంజూరు చేయటం జరుగుతుంది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్‌లకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను కంప్యూటర్‌లో లేదా యూఎస్బీ టోకెన్‌లలో భద్రపరుచుకోవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190