వాట్సప్‌లో డూప్లికేట్ కరెంట్ బిల్ పొందడం ఎలా ?

Delhi electricity distribution company (discom) BSES వినూత్నగాం ఆలోచన చేసింది. వాట్సప్ ద్వారా డూప్లికేట్ బిల్ పొందే సౌకర్యాన్ని కల్పించింది.

|

Delhi electricity distribution company (discom) BSES వినూత్నగాం ఆలోచన చేసింది. వాట్సప్ ద్వారా డూప్లికేట్ బిల్ పొందే సౌకర్యాన్ని కల్పించింది. ఇకపై ఢిల్లీలో నివసిస్తున్న వారు వాట్సప్ ద్వారా తమ డూప్లికేట్ కరెంట్ బిల్లును పొందవచ్చని కంపెనీ తెలిపింది కాగా ఇలాంటి సర్వీసును ప్రకటించిన ఏకైక సంస్థ discom మాత్రమే. discom చెప్పిన వివరాలు ప్రకారం కస్టమర్లు ఇకపై BSES వెబ్ సైటు ద్వారా మరియు మొబైల్ యాప్ ద్వారా వాట్సప్ నుంచే డూప్లికేట్ కరెంట్ బిల్లును పొందవచ్చు. ఈ సౌకర్యం కేవలం ఢిల్లీలో నివసిస్తున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని BSES తెలిపింది.

ఈ GPS/Navigation యాప్స్ తో జర భద్రం గురుఈ GPS/Navigation యాప్స్ తో జర భద్రం గురు

BSES వాట్సప్ నంబరు

BSES వాట్సప్ నంబరు

వినియోగదారులు తమ వాట్సప్ లో BSES వాట్సప్ నంబరును సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కాంటాక్ట్ లిస్టులో వారి నంబర్ 9999919123ను సేవ్ చేసుకుని #Bill9-digit CA (Customer Account )ని టైప్ చేసి 9999919123 ఈ నంబరుకు సెండ్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీకు మీ డూప్లికేట్ కరెంట్ బిల్ వస్తుంది.

వారికి మాత్రమే

వారికి మాత్రమే

కాగా ఈ సదుపాయం కేవలం south and west Delhi, east and central Delhi వాసులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయం SAP and IOMS platforms మీద అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. నో సప్లయి కంప్లయింట్స్, పవర్ దొంగతనం చేస్తే ఫిర్యాదులు వంటివి కూడా చేయవచ్చు.

డిజిటల్ వైపు అడుగులు

డిజిటల్ వైపు అడుగులు

BSES సర్వీసులు ద్వారా డిజిటల్ పేమెంట్లను ఆహ్వానిస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పుడు అన్ని రకాల డిజిటల్ వాలెట్లు డిజిటల్ పేమెంట్లను అంగీకరిస్తుండటంతో దానికి డిమాండ్ పెరిగిందని అలాగే క్యాష్ బ్యాక్ స్కీములు కూడా వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. నాన్ క్యాష్ ద్వారానే మాకు దాదాపు 90 శాతం చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు.

వాట్సప్ కొత్త లుక్

వాట్సప్ కొత్త లుక్

డార్క్‌ మోడ్‌తో వాట్సప్‌కు కొత్త లుక్ తో పాటు బ్యాటరీ సేవ్ చేసుకునే అవకాశం ఉంది. రాత్రి సమయంలో యాప్ ఉపయోగిస్తే కళ్లకు ఒత్తిడి తగ్గుతుంది. త్వరలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఒక్క వాట్సప్ మాత్రమే కాదు గూగుల్ కూడా తమ యాప్స్‌లో డార్క్ మోడ్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే యూట్యూబ్, మెసేజెస్, క్రోమ్ లాంటివాటిలో డార్క్ మోడ్ ఉంది. గూగుల్ అసిస్టెంట్‌కు డార్క్ మోడ్ రానుంది.

Best Mobiles in India

English summary
How to get duplicate electricity bill on WhatsApp more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X