లాక్‌డౌన్ వ్యవధిలో E-Pass ను పొందడం ఎలా?

|

భారత ప్రభుత్వం ప్రస్తుతం మే 3 వరకు పూర్తి లాక్డౌన్ ను పొడిగించింది. అత్యవసర పరిస్థితులు మరియు ప్రజలకు అవసరమైన సేవలను అందించడం మినహా మిగిలిన అన్నిటిని కూడా పరిమితం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ మహమ్మారి అయిన COVID-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఈ చర్యలను తీసుకున్నారు.

 
How to Get E-Pass during Lockdown in your State in Telugu

అత్యవసర సేవలను అందించే వ్యాపారాలు సమస్యలు లేకుండా నడవడానికి, అత్యవసర పరిస్థితులలో సాధారణ ప్రజలు తమ ఇళ్ల వెలుపలకు రావడానికి అనేక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఆన్‌లైన్‌లో ఇ-పాస్‌లను అందిస్తున్నాయి. లాక్డౌన్ కోసం ఇ-పాస్ను COVID-19 అత్యవసర పాస్ అని అంటారు. కొన్ని రాష్ట్రాలలో ఆన్‌లైన్ లాక్డౌన్ పాస్ అని కూడా సూచిస్తున్నారు. అనేక రాష్ట్రాలు తమ వెబ్‌సైట్‌లో ఇ-పాస్ కోసం నమోదు చేసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తున్నాయి. అయితే కొందరు మొబైల్ యాప్స్ లేదా వాట్సాప్ నంబర్లను కూడా విడుదల చేశారు.

 
How to Get E-Pass during Lockdown in your State in Telugu

లాక్డౌన్ కోసం ఇ-పాస్ ఎలా పొందాలి?

1. మీ రాష్ట్రం లేదా నగరం యొక్క అధికారిక లాక్‌డౌన్ ఇ-పాస్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.

2. మీ రాష్ట్ర వెబ్‌సైట్‌లో ఇ-పాస్ కొరకు "APPLY Here" ఇలాంటి బట్టెన్ మీద క్లిక్ చేయండి.

3. ఇ-పాస్ ను పొందాలనుకునే కారణాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి రాష్ట్ర వెబ్‌సైట్ వినియోగదారుడి నుండి భిన్నమైన సమాచారాన్ని అడుగుతుంది. ఉదాహరణకు మహారాష్ట్ర ఇ-పాస్ వెబ్‌సైట్ ఫోటో ఐడి ప్రూఫ్, చెల్లుబాటు అయ్యే సంస్థ పత్రాలు, మెడికల్ రిపోర్ట్ మరియు కంపెనీ ఐడిని దరఖాస్తుతో జతచేయమని అడుగుతుంది.

How to Get E-Pass during Lockdown in your State in Telugu

4. మీరు దరఖాస్తును సమర్పించిన తర్వాత దానిని స్థానిక పోలీసులు సమీక్షిస్తారు. తరువాత మాత్రమే మీకు పాస్ జారీ చేయబడుతుంది.

5. దరఖాస్తును పూరించడంలో ఏదైనా వ్యత్యాసం ఉంటే వినియోగదారులు స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి దాన్ని పరిష్కరించవచ్చు. దరఖాస్తుదారునికి ప్రత్యేకమైన టోకెన్ ఐడి ఇవ్వబడుతుంది.

Best Mobiles in India

English summary
How to Get E-Pass during Lockdown in your State in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X