ఆన్‌లైన్‌ ద్వారా ఇ-పాన్ పొందడం ఎలా?

|

ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం వంటి వివిధ ప్రయోజనాల కోసం మీరు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను కలిగి ఉండాలి.

ఇన్స్టెంట్ ఇ-పాన్

ఇంతకుముందు పాన్ కార్డును పొందడానికి అనేక ఫారమ్ లను నింపిన పత్రాలను సమర్పించవలసి ఉండేది. ఇలా చేసిన కూడా పాన్ కార్డ్ రావడానికి దాదాపు 15 రోజుల వరకు సమయం పట్టవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఆదాయపు పన్ను విభాగం నుండి ఇన్స్టెంట్ ఇ-పాన్ ను పొందవచ్చు. ఇ-పాన్ అనేది ఐటి విభాగం డిజిటల్ సంతకంతో ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో జారీ చేసిన పాన్ కార్డు. దరఖాస్తుదారుడు ఇ-పాన్ పొందడానికి కేవలం చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్ మరియు డిజిటల్ సంతకం కలిగి ఉంటే చాలు.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

ఎలా దరఖాస్తు చేయాలి?

ఎలా దరఖాస్తు చేయాలి?

** ఇ-పాన్ ను https://www.pan.utiitsl.com/PAN/newA.do ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .

** మొదట కొత్త పాన్ కార్డ్ (ఫారం 49A) కోసం దరఖాస్తు చేసుకోండి.

** ఆ తరువాత ఇన్స్టెంట్ ఇ-పాన్ పొందడానికి "డిజిటల్ మోడ్" ని ఎంచుకోండి.

** డిజిటల్ మోడ్ కింద దరఖాస్తుదారులు ఎటువంటి డాక్యూమెంట్ కాపీని సమర్పించాల్సిన అవసరం లేదు. ఆధార్ ఆధారిత ఇ-సిగ్నేచర్ లేదా డిజిటల్ సంతకాన్ని ఉపయోగించి దరఖాస్తు ఫారమ్ సంతకం చేయవచ్చు.

** మొబైల్ నెంబర్ తో మీ ఆధార్ అప్డేట్ చేయబడింది అని నిర్ధారించుకోండి.

** e-KYCని నిర్వహించడానికి ఆధార్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు ఓటిపి పంపబడుతుంది.

దరఖాస్తుదారులు పుట్టిన తేదీ మరియు ఏదైనా చిరునామాను తెలిపే రుజువులు వంటి సహాయక పత్రాలను అందించాల్సిన అవసరం లేదు. ఆధార్ డేటాబేస్లో అందుబాటులో ఉన్న సమాచారం యొక్క వివరాలను ఉపయోగించి ఇ-పాన్ జెనరేట్ అవుతుంది. ఏదేమైనా ఇటీవలి ఫోటో మీద మీ యొక్క సంతకం జత చేసి సూచించిన ఆకృతిలో అప్‌లోడ్ చేయాలి.

 

ఐఫోన్ నుండి Wi-Fi పాస్‌వర్డ్‌ను సులువుగా ఎలా షేర్ చేయవచ్చుఐఫోన్ నుండి Wi-Fi పాస్‌వర్డ్‌ను సులువుగా ఎలా షేర్ చేయవచ్చు

 

జాగ్రత్తలు

జాగ్రత్తలు

మీ పాన్‌ను ఆన్‌లైన్‌లో పొందడంలో ఆధార్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందున ఏదైనా డేటా విషయంలో అసమతుల్యత ఉంటే కనుక దరఖాస్తు తిరస్కరించబడవచ్చు కాబట్టి మీ ఆధార్ వివరాలు సరైనవిగా ఇవ్వడం మరచిపోకండి.

 

ఆన్‌లైన్‌ ద్వారా రైల్వే క్రిమినల్ ఫిర్యాదులను ఎలా నమోదు చేయవచ్చుఆన్‌లైన్‌ ద్వారా రైల్వే క్రిమినల్ ఫిర్యాదులను ఎలా నమోదు చేయవచ్చు

రుసుము

రుసుము

దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తుదారుడు అతను / ఆమె ఫిసికల్ పాన్ కార్డ్ మరియు ఇ-పాన్ లేదా ఇ-పాన్ మరియు రెండింటినీ కోరుకుంటున్నారా అని ఎన్నుకునే అవకాశం ఉంది . మీరు ఇ-పాన్ తో పాటు ఫీజికల్ పాన్ కార్డు అవసరం ఉంటే కనుక మీరు RS.107 చెల్లించవలసి ఉంటుంది. మీకు ఇ-పాన్ మాత్రమే అవసరం ఉంటే కనుక కేవలం RS.66లు చెల్లిస్తే సరిపోతుంది.

Best Mobiles in India

English summary
How to Get Instant e-PAN Card Online in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X