Home
How to

IPL 2022 మ్యాచ్ ల లైవ్ అప్‌డేట్‌లను అలెక్సా సాయంతో పొందడం ఎలా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2022) భారతదేశంలో భారీ అభిమానుల మధ్య జరుగుతోంది. అనేక కారణాల కారణంగా మీరు ప్రతిరోజూ జరిగే IPL మ్యాచ్‌లను లైవ్ లో చూడలేకపోతే స్కోర్ యొక్క వివరాలు తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అమెజాన్ యొక్క వర్చువల్ అసిస్టెంట్, అలెక్సా సహాయంతో క్రికెట్ ఔత్సాహికులు మ్యాచ్ యొక్క లైవ్ అప్‌డేట్‌లను పొందడమే కాకుండా పాల్గొనే జట్ల వివరాలు మరియు మ్యాచ్ అనంతరం యొక్క కామెంటరీల వంటి ఇతర సమాచారాన్ని వేగంగా అందించగలదు. 2022 IPL సీజన్‌లోని మ్యాచ్-సంబంధిత లైవ్ అప్‌డేట్‌ల వివరాలను కొన్ని చిట్కాలతో సులభంగా తెలుసుకోవడానికి కింద ఉన్న ఉపాయాలను అనుసరించండి.

How to Get IPL 2022 Cricket Matches Live Updates With The Help of Alexa?

పాల్గొనే జట్ల గురించి తెలుసుకోవడం

IPL జట్లు ప్రతి సీజన్‌లో మారుతూ ఉంటాయి కావున జట్లలో గల మంచి ఆటగాళ్లను ట్రాక్ చేయడం అంత సులభం కాదు. అలెక్సాతో క్రికెట్ ఔత్సాహికులు సాధారణ వాయిస్ ఆదేశాలతో నేటి మ్యాచ్ లో పాల్గొనే టీమ్ మరియు వారి ఆటగాళ్ల వివరాలను తెలుసుకోవడం మరింత సులభతరం చేస్తుంది. వినియోగదారులు చేయాల్సిందల్లా "అలెక్సా నేడు ఏ జట్లు ఆడుతున్నాయి?" లేదా "అలెక్సా RCB కెప్టెన్ ఎవరు?" అని చెప్పడమే.

How to Get IPL 2022 Cricket Matches Live Updates With The Help of Alexa?

టీమ్ మరియు ఆటగాళ్ల గణాంకాలను ట్రాక్ చేయడం

అలెక్సాతో క్రికెట్ ఔత్సాహికులు తమ అభిమాన జట్టు యొక్క ఆటగాళ్ల తాజా గణాంకాలను కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం వారు చేయాల్సిందల్లా "అలెక్సా KKR ర్యాంక్ ఎంత?" లేదా "అలెక్సా CSK యొక్క అత్యధిక స్కోర్ ఏమిటి?" అని చెప్పడమే.

లైవ్ మ్యాచ్ వివరాలను పొందడం

How to Get IPL 2022 Cricket Matches Live Updates With The Help of Alexa?

క్రికెట్ ఔత్సాహికులకు Alexa నేటి లైవ్ మ్యాచ్ అప్‌డేట్‌లను కూడా అందించగలదు. వారు చేయాల్సిందల్లా "అలెక్సా, ఎవరు టాస్ గెలిచారు?" లేదా "అలెక్సా, స్కోర్ ఎంత?" లేదా "అలెక్సా, ముంబై స్కోర్ ఎంత?" అని అడగడమే.

మ్యాచ్ తర్వాత వివరాలను పొందడం

క్రికెట్ ఔత్సాహికులు మ్యాచ్ ముగిసిన తర్వాత మ్యాచ్ యొక్క అన్ని రకాల వివరాలను పొందడానికి అలెక్సాను ఉపయోగించవచ్చు. ఇందుకోసం "అలెక్సా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు?" లేదా "అలెక్సా, ఎవరు ఎక్కువ పరుగులు సాధించారు?" అని చెప్పండి.

Best Mobiles in India

English summary
How to Get IPL 2022 Cricket Matches Live Updates With The Help of Alexa?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X