Netflix సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందడం ఎలా?
భారతదేశంలోని వినియోగదారుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.199 మరియు రూ.799 ధరల మధ్య నాలుగు సబ్స్క్రిప్షన్ ప్లాన్ లతో అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ యొక్క సబ్స్క్రిప్షన్ రూ.199 మొబైల్ ప్లాన్ కింద వినియోగదారులకు రెండు స్క్రీన్‌లకు అందిస్తుంది. ఇందులో 480 పిక్సెల్‌ల ఫోన్ లో HD వీడియో రిజల్యూషన్‌తో చూడడానికి అనుమతిని ఇస్తుంది. నెట్‌ఫ్లిక్స్ యొక్క మరో మూడు ప్లాన్‌ల ధరలు వరుసగా రూ.499, రూ.649, రూ.799 ల వద్ద ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌లు
రూ.499 ధర వద్ద లభించే బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లో మంచి వీడియో క్వాలిటీతో 480P రిజల్యూషన్ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ మరియు టివిలతో సహా నాలుగు పరికరాలకు మద్దతును ఇస్తుంది. అలాగే రూ.649 ధర వద్ద లభించే మూడవ ప్లాన్ "మెరుగైన" వీడియో మద్దతుతో 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ మరియు టివితో సహా నాలుగు పరికరాలకు మద్దతు ఇస్తుంది. చివరగా రూ.799ల విలువైన అత్యంత ప్రీమియం నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ఉత్తమ వీడియో నాణ్యతతో 4K + హెచ్‌డిఆర్ రిజల్యూషన్ తో ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ మరియు టివితో సహా నాలుగు పరికరాలకు మద్దతును అందిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ యొక్క సబ్స్క్రిప్షన్ ను పొందడానికి మీరు నేరుగా నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌కు వెళ్ళవచ్చు. తరువాత మీరు ఎంచుకోవలసిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను కొనుగోలు చేయవచ్చు. మీరు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ను యుపిఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, పేటిఎం లేదా ఏదైనా ఇతర ఆన్‌లైన్ లావాదేవీల ప్రక్రియతో కొనుగోలు చేయవచ్చు. మీరు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ను కొనకుండా ఉచితంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను కోరుకుంటే కనుక దాన్ని పొందడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. రిలయన్స్ జియో వంటి ఆపరేటర్లు తన యొక్క వినియోగదారులకు అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ యొక్క చందాను ఉచితంగా అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ను ఉచితముగా అందిస్తున్న జియోఫైబర్ యొక్క ప్లాన్ ల వివరాలు కింద తెలపబడ్డాయి.

ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో జియోఫైబర్ ప్లాన్
** రూ.1499 ధర వద్ద లభించే జియోఫైబర్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందించడంతో పాటు అపరిమిత కాల్‌లను, అన్‌లిమిటెడ్ డేటాను 300 Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది.
** రూ.2499 ధర వద్ద లభించే జియోఫైబర్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందించడంతో పాటు అపరిమిత కాల్‌లను, అన్‌లిమిటెడ్ డేటాను 500 Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది.
** రూ.3999 ధర వద్ద లభించే జియోఫైబర్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందించడంతో పాటు అపరిమిత కాల్‌లను, అన్‌లిమిటెడ్ డేటాను 1Gbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది.
** రూ.8499 ధర వద్ద లభించే జియోఫైబర్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందించడంతో పాటు అపరిమిత కాల్‌లను, అన్‌లిమిటెడ్ డేటాను 1Gbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఈ ప్లాన్ చెల్లుబాటు కాలానికి మొత్తం 6600GB డేటాను అందిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ యొక్క సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందడానికి జియోఫైబర్ కనెక్షన్‌ను మీరు Jio.com అధికారిక వెబ్‌సైట్ లేదా Mi Jio యాప్ కు వెళ్ళవచ్చు. మీరు ఇప్పటికే JioFiber కస్టమర్ అయితే కనుక నంబర్‌ను రీఛార్జ్ చేయడానికి మీరు దీన్ని ఆన్‌లైన్‌లో paytm, Google Pay, PhonePe ద్వారా చేయవచ్చు లేదా Jio.com వెబ్‌సైట్‌కు వెళ్ళవచ్చు.


Click it and Unblock the Notifications








