ఇలా చేస్తే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఇతరులు Login చేస్తే వెంటనే తెలిసిపోతుంది..!
మీకు ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఏంటి అంటే.. ఇన్‌స్టాగ్రామ్ అనే మాట చాలా మంది నోట నుంచి వస్తుంది. ఎందుకంటే ఇన్‌స్టా అంత పాపులర్. మెటాకు చెందిన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. పోస్టులు, రీల్స్ సహా అనేక అప్‌డేట్స్ కోసం ఉపయోగిస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం ఇన్‌స్టా అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? :
దీంతోపాటు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) అనేక ఇన్‌బిల్ట్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. అయితే మీ అకౌంట్ ను ఉపయోగిస్తున్నట్లు ఎప్పుడైనా అనిపించింది. మీకు సంబంధం లేని పోస్టులపై లైక్స్ మరియు పరిచయం లేదని వ్యక్తులకు మెసేజ్‌లు పంపినట్లు ఎప్పుడైనా అనిపించిందా..?

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ఫీచర్ :
అయితే ఇలా ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం.. మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇతర వ్యక్తులు ఉపయోగిస్తున్నట్లు భావించవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో అనేక మందికి అవగాహన లేక ఆందోళన చెందుతుంటారు. మీ అకౌంట్‌లోకి ఇతరులు లాగిన్ అయితే, మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ఫీచర్ ఉంది.
ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ నోటిఫికేషన్‌లను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
స్టెప్ 1 : ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి, Settings and Activity ఆప్షన్ లోకి వెళ్లాలి.
స్టెప్ 2 : అనంతరం Accounts Center ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : ఆ తర్వాత Password and Security పైన ట్యాప్ చేయాలి.
స్టెప్ 4 : మీ అకౌంట్ ఏయే డివైజ్‌లతో లాగిన్ చేసి ఉందో తెలుసుకొనేందుకు Where You are Logged in పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 5 : మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏదైనా డివైజ్ నుంచి లాగిన్ చేసి ఉంటే, అక్కడ మీకు ఆయా వివరాలు కనిపిస్తాయి.
స్టెప్ 6 : మీకు తెలియని లొకేషన్, డివైడ్ ఉంటే వెంటనే Logout చేయాలి.
స్టెప్ 7 : మీ అకౌంట్ లాగిన్ వివరాలు నోటిఫికేషన్ ద్వారా పొందేందుకు Where You are Logged in ఆప్షన్ కింద ఉండే Login alerts పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 8 : Login alerts ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకున్నాక.. కొత్త డివైజ్‌లో మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ చేస్తే.. మీకు నోటిఫికేషన్ రూపంలో సమాచారం అందుతుంది.

మీకు తెలియకుండా మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను ఇతరులు లాగిన్ చేసినట్లు భావిస్తే, వెంటనే Logout చేయడం సహా పాస్‌వర్డ్‌ను అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఇన్‌బిల్ట్ ఆప్షన్ ద్వారా మీ ఖాతాను సురక్షితంగా ఉపయోగించుకొనేందుకు వీలుంటుంది.
ఏదైనా లొకేషన్ లేదా డివైజ్ నుంచి మీ ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ చేసి ఉన్నట్లు భావిస్తే.. వెంటనే Logout చేయాలి. లేకుంటే ఇతరులు మీ అకౌంట్‌ను దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ నిర్దేశించిన విధంగా మీ అకౌంట్‌కు బలమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications