రైల్వే నుంచి కొత్తగా వచ్చిన RailOne యాప్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి.. పూర్తి వివరాలు..!
RailOne Login : భారతీయ రైల్వే జులై 1 వ తేదీన రైల్‌వన్ యాప్‌ను విడుదల చేసింది. అన్ని సర్వీసులను ఒకే చోటకు చేర్చి ఈ సూపర్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం తొలి రోజుల్లో స్వరైల్ పేరుతో బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. అయితే తాజాగా రైల్‌వన్ పేరుతో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్, ప్లాట్‌ఫాం టికెట్లు, PNR, ట్రైయిన్ స్టేటస్, ఫిర్యాదులు, ఫుడ్ ఆర్డర్ చేయడం సహా అనేక ఫీచర్లను ఈ యాప్‌లో ఇంటిగ్రేట్ చేశారు.
రైల్వేలో తరచూ ప్రయాణాలు చేసే వారు టికెట్ల బుకింగ్ కోసం IRCTC రైల్ కనెక్ట్, అన్ రిజర్వడ్ మరియు ప్లాట్‌ఫాం టికెట్ల కోసం UTS, ఫుడ్ ఆర్డర్ కోసం ఫుడ్ ఆర్ ట్రాక్, PNR, ట్రైయిన్ స్టేటస్ కోసం, ఫిర్యాదులు కోసం ఇలా వేర్వేరు ప్లాట్‌ఫాంలున్నాయి. వీటిన్నింటినీ ఈ కొత్త యాప్‌లో ఇంటిగ్రేట్ చేసి తీసుకొచ్చారు.

ఈ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) అభివృద్ధి చేసింది. స్వరైల్ పేరుతో బీటా టెస్టింగ్ అనంతరం రైల్‌వన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS స్టోర్‌లలో అందుబాటులో ఉంది. అయితే రైల్‌వన్ యాప్‌లో ఎలా రిజిస్ట్రర్ కావాలి.
రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్ల బుకింగ్, ప్లాట్‌పాం టికెట్లు, ట్రైయిల్ వివరాలు, PNR స్టేటస్, ఫుడ్ ఆర్డర్, సరకు రవాణా, రైల్వే హెల్ప్‌లైన్ వంటి అనేక సర్వీసులను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్లాట్‌ఫాం టికెట్లను 3 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. R వాలెట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
RailOne📱
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 1, 2025
All-in-One App by Bharatiya Railways.#10YearsOfDigitalIndia pic.twitter.com/L18jnwLLa4
స్టెప్ 1 : రైల్‌వన్ యాప్‌ను ఆండ్రాయిడ్, iOS యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
స్టెప్ 2 : యాప్‌ను ఓపెన్ చేశాక లాగిన్, New User Registration, Guest ఆప్షన్‌లు కనిపిస్తాయి.
స్టెప్ 3 : New User Registration వద్ద IRCTC రైల్ కనెక్ట్, UTS ద్వారా కూడా లాగిన్ చేసే ఆప్షన్‌లు కనిపిస్తాయి.
స్టెప్ 4 : IRCTC రైల్ కనెక్ట్, UTS ఖాతాలు ఉంటే లాగిన్ చేసుకోవచ్చు. లేకుంటే New User Registration కిందనే ఫోన్ నంబర్ ద్వారా రిజిస్టర్ కావాల్సి ఉంది.
స్టెప్ 5 : మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక పక్కనే ఉన్న రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 6 : రిజిస్టర్ పైన క్లిక్ చేశాక.. మరో స్క్రీన్ ఓపెన్ కానుంది. అక్కడ మొబైల్ నంబర్, పేరు, ఈ-మెయిల్ ఐడీ, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వివరాలను నమోదు చేసి, SignUp చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 7 : రైల్ యాప్ ను అకౌంట్‌ను బయోమెట్రిక్, mPIN, OTP ద్వారా కూడా లాగిన్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
స్టెప్ 8 : యాప్‌లో రిజిస్టర్ అయ్యేందుకు ఆసక్తి లేని వారు.. Guest ఆప్షన్ ద్వారా లాగిన్ కావచ్చు.
స్టెప్ 9 : Guest ఆప్షన్‌లో ట్రైయిన్ వివరాలు, PNR స్టేటస్, ట్రెయిన్ ట్రాకింగ్ వంటి సమాచారం చూసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది.
స్టెప్ 10 : మీ మొబైల్ నంబర్‌తో రైల్ కనెక్ట్, UTS యాప్‌లో ఇప్పటికే అకౌంట్ ఉంటే.. మీకు ఆ వివరాలు గుర్తులేకపోయినా.. లాగిన్ సమయంలో రైల్‌వన్ యాప్ గుర్తుచేస్తుంది.


Click it and Unblock the Notifications








