Home
How to

Spotify 3 నెలల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందడం ఎలా?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ యొక్క అన్ని రకాల కార్యకలాపాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. మ్యూజిక్ కూడా ఆన్‌లైన్ విధానంలో అనేక యాప్ ల ద్వారా వినడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో స్పాటిఫై యాప్ ఒకటి. భారతదేశంలోని వినియోగదారులకు మూడు నెలల స్పాటిఫై ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందించడానికి స్పాటిఫై వీసాతో జతకట్టింది. ఈ ఆఫర్ ప్రీమియం ఇండివిజువల్ ప్లాన్‌కి చెల్లుబాటు అవుతుంది. నెలకు రూ.119 ధర వద్ద లభించే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ వీసా కార్డ్‌ని కలిగి ఉన్న వినియోగదారులు ఈ ఆఫర్‌ను ఉచితంగా పొందడానికి అర్హులు అవుతారు.

Spotify ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌

Spotify ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ అనేది వేలకొద్దీ ప్రకటన-రహిత పాటలు మరియు మల్టి-డివైస్ మద్దతుకు యాక్సెస్‌ను అందిస్తుంది. సబ్‌స్క్రిప్షన్‌ పొందిన సభ్యులు వినడానికి పాటలను ఆఫ్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు గ్రూప్ సెషన్‌లు మరియు పాటలను దాటవేయడం వంటి ఫీచర్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు వీసా కార్డ్‌ని కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. వినియోగదారులు ప్రాంప్ట్ చేసినప్పుడు వారి వ్యక్తిగత Spotify అకౌంటుతో సైన్ ఇన్ చేసి, వీసా కార్డ్ వివరాలను నమోదు చేయాలి. ముఖ్యంగా ట్రయల్ పీరియడ్‌తో సహా ఏ విధమైన Spotify ప్రీమియం ప్లాన్‌లను ఇంతకు ముందు పొందని వినియోగదారులు ఈ ఆఫర్‌కు అర్హులు కారు. ఇప్పుడు ఆఫర్‌ను పొందడానికి ఈ సాధారణ దశలను అనుసరించండి.

3 నెలల Spotify ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా పొందే విధానం

3 నెలల Spotify ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా పొందే విధానం

** ఆఫర్ పేజీని సందర్శించి " స్టార్ట్ ట్రయల్" ఎంపికపై నొక్కండి.

** ఇప్పుడు మీ యొక్క అకౌంట్ అన్ని వివరాలతో లాగిన్ చేయండి లేదా సైన్ అప్ చేయండి.

** మూడు నెలల ట్రయల్ ఎంపికను ఎంచుకుని వీసా కార్డ్ వివరాలను జోడించి దాన్ని యాక్టివేట్ చేయండి.

వినియోగదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉచిత ట్రయల్‌ని రద్దు చేసుకోవచ్చు. మూడు నెలల ట్రయల్ తర్వాత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించడం కొనసాగించడానికి వినియోగదారులు ప్రతి నెలా రూ.119 చెల్లించాలి.

 

Spotify

ప్రస్తుతం Spotify మినీ, డుయో, ఫ్యామిలీ మరియు ఇండివిజువల్‌ వంటి నాలుగు ప్రీమియం ప్లాన్‌లను అందిస్తోంది. మినీ ప్లాన్ ఒక్క అకౌంటుకు రోజుకు రూ.7లను ఛార్జ్ చేస్తుంది. అలాగే ప్రీమియం డుయో ప్లాన్ రెండు అకౌంటులకు మద్దతు ఇస్తుంది మరియు దీని ధర నెలకు రూ. 165. ఫ్యామిలీ ప్లాన్ గరిష్టంగా ఆరు అకౌంటులకు మద్దతు ఇస్తుంది. దీని కోసం మీకు రూ.199 ఖర్చు అవుతుంది. చివరగా, ప్రీమియం ఇండివిజువల్ ప్లాన్ సంవత్సరానికి రూ.939 ధర వద్ద లభిస్తుంది.

Spotify

పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా Spotify తన 12 నెలల ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.939కి 20 శాతం తగ్గింపును ప్రకటించింది. మీరు వార్షిక ప్లాన్‌లో రూ.250 వరకు ఆదా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఆఫర్ యొక్క ప్రయోజనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరియు మీరు వార్షిక ప్లాన్‌ను కొనుగోలు చేసిన తర్వాత మీ ఆఫర్ యాక్టివేట్ గా ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to Get Spotify 3 Months Premium Subscription For Free?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X