శ్రీకృష్ణ జన్మాష్టమికి అదిరిపోయే స్టిక్క‌ర్ల‌తో Whatsapp లో విషెస్ చెప్పండి!

|

హిందూ సంప్ర‌దాయ క్యాలెండర్‌లో శ్రీ కృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. భారతీయ పురాణాల ప్రకారం, ఈ రోజు శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకుంటారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో మ‌న మిత్రుల‌కు, స‌న్నిహితుల‌కు ప్ర‌త్యేకంగా కృష్ణాష్ట‌మి (Janmashtami) శుభాకాంక్షలు పంపడానికి యూజ‌ర్ల‌కు WhatsApp స్టిక్క‌ర్లు ప్రముఖ ఆప్ష‌న్‌గా మారింది.

 
శ్రీకృష్ణ జన్మాష్టమికి అదిరిపోయే స్టిక్క‌ర్ల‌తో Whatsapp లో విషెస్ చెప

మీరు కూడా WhatsApp ద్వారా మీ ప్రియమైన వారికి కృష్ణ జన్మాష్టమి (Janmashtami) శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే, స్టిక్కర్లు సులభమైన సాధ‌నాలు. మీరు కూడా కృష్ణాష్ట‌మికి సంబంధించిన స్టిక్క‌ర్ల‌ను సులభమైన దశల్లో Google Play Store నుండి థ‌ర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీకు నచ్చిన ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన ప్ర‌క్రియ‌ను వివ‌రంగా తెలుసుకోవ‌డానికి ఈ ఆర్టిక‌ల్‌ను పూర్తిగా చ‌ద‌వండి.

గూగుల్ ప్లేస్టోర్ (Google Playstore) నుంచి ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోండి:
కృష్ణ జన్మాష్టమి స్టిక్క‌ర్ల కోసం మీరు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ (Google Playstore) కు వెళ్లాలి. అందులో జన్మాష్టమి స్టిక్క‌ర్ ప్యాక్ అని సెర్చ్ చేయాలి. ఆ త‌ర్వాత మ‌న‌కు ప‌లు స్టిక్క‌ర్ ప్యాక్‌లు క‌నిపిస్తాయి. వాటిలో మంచి స్టిక్క‌ర్స్‌తో మంచి రేటింగ్ క‌లిగిన ప్యాక్‌ను ఎంపిక చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

శ్రీకృష్ణ జన్మాష్టమికి అదిరిపోయే స్టిక్క‌ర్ల‌తో Whatsapp లో విషెస్ చెప

కృష్ణ జన్మాష్టమి(Janmashtami) స్టిక్క‌ర్ ప్యాక్ డౌన్‌లోడ్ అయిన త‌ర్వాత దాన్ని ఓపెన్ చేసి యాడ్ టూ వాట్సాప్ 'Add to WhatsApp' అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి. మీరు స్టిక్కర్ ప్యాక్‌ని జోడించాలనుకుంటున్న విష‌యాన్ని ధృవీకరించమని WhatsApp మిమ్మల్ని అడుగుతుంది. ఆ ధ్రువీక‌ర‌ణ‌ను నిర్ధారిస్తున్న‌ట్లు మీరు ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి. అనంత‌రం ఇక స్టిక్కర్ ప్యాక్ WhatsApp యాప్‌లోని స్టిక్కర్స్ విభాగంలో కనిపిస్తుంది. ఇక వాట్సాప్‌లోని స్టిక్క‌ర్స్ సెక్ష‌న్‌లోకి వెళ్లి మీకు న‌చ్చిన కృష్ణ జన్మాష్టమి స్టిక్క‌ర్ను మీ మిత్రుల‌కు షేర్ చేసుకోవ‌చ్చు.

Apple, iPhone యూజ‌ర్లు ఎలా చేయాలి:
థర్డ్ పార్టీ స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి Apple iPhone వినియోగదారులను అనుమతించదు. యాప్‌లో ఇన్‌బిల్ట్ స్టిక్కర్ విభాగం ఉన్నప్పటికీ, అందులో జన్మాష్టమి కి సంబంధించి నిర్దిష్టమైన‌ స్టిక్కర్‌లు లేవు. ఐఫోన్ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ స్నేహితులను తమతో స్టిక్కర్‌ను షేర్ చేయమని కోర‌వ‌చ్చు, తద్వారా తమ స్టిక్కర్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవచ్చు. అనంత‌రం వాటిని ఐఫోన్ యూజ‌ర్లు కూడా త‌మ మిత్రుల‌తో షేర్ చేసుకోవ‌చ్చు.

శ్రీకృష్ణ జన్మాష్టమికి అదిరిపోయే స్టిక్క‌ర్ల‌తో Whatsapp లో విషెస్ చెప

మ‌రోవైపు, వాట్సాప్ ఇటీవ‌ల త‌మ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు అనేక కొత్త ఫీచ‌ర్ల‌ను వినియోగ‌దారుల ముందుకు తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాటి గురించి కూడా ఇప్పుడు చ‌ర్చించుకుందాం.
Delete For Everyone స‌మ‌య ప‌రిమితి పెంపు:
గ‌తంలో వాట్సాప్ యూజ‌ర్ల‌కు Delete For Everyone ఆప్ష‌న్‌కు 1 గంట‌, 8 నిమిషాల 16 సెకండ్ల వ‌ర‌కు స‌మ‌య ప‌రిమితి ఉంది. తాజాగా వాట్సాప్ ఈ డెలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్ ఫీచ‌ర్ స‌మ‌య ప‌రిమితి రెండు రోజుల 12 గంట‌ల‌కు పెంచింది. ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఇది ఇంకా అందుబాటులోకి రాని యూజ‌ర్లు త‌మ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

గ్రూప్ అడ్మిన్‌ల‌కు అధికారాలు..
Whatsapp గ్రూపుల్లో స‌భ్యులు చేసిన ఏ మెసేజ్‌ను అయినా డెలీట్ చేసే అవ‌కాశం గ్రూప్ అడ్మిన్‌కు క‌ల్పించే ఫీచ‌ర్ పై కంపెనీ ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అద‌న‌పు స‌మాచారం కంపెనీ నుంచి వెలువ‌డ‌లేదు. త్వ‌ర‌లోనే వినియోగదారుల కోసం ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసే మరో అప్‌డేట్ రానుందని ఇటీవ‌ల ఓ నివేదిక వెల్ల‌డించింది.

ఇవేకాకుండా మ‌రిన్ని అద్భుత ఫీచ‌ర్లు:
వాట్సాప్ యూజ‌ర్ల‌కు మ‌రింత ప్రైవ‌సీని అందించే ల‌క్ష్యంతో మ‌రిన్నఫీచ‌ర్ల‌ను కూడా ఆ కంపెనీ ఇటీవ‌ల ప‌రిచ‌యం చేసింది. ఏదైనా గ్రూప్ చాట్‌లో నుంచి ఎవ‌రికీ స‌మాచారం లేకుండా బ‌య‌ట‌కు వైదొల‌గే ఫీచ‌ర్‌ను తీసుకువ‌స్తోంది. అంతేకాకుండా, వ్యూ వ‌న్స్ మెసేజ్‌ల‌ను ఎవ‌రూ స్క్రీన్ షాట్ తీసుకోకుండా చేసేలా ఫీచ‌ర్ల‌ను తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మెటా సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఇటీవ‌ల ఓ పోస్ట్‌లో వెల్ల‌డించారు.

Best Mobiles in India

English summary
How to get sri krishna janmashtami sticker packs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X