Home
How to

Disney + Hotstar సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందడం ఎలా?

ఇండియాలో ఒక సంవత్సరం నుంచి OTT వినియోగం మరింత ఎక్కువ అయింది. దేశంలోని అగ్రశ్రేణి OTT ప్లాట్‌ఫామ్‌లలో డిస్నీ + హాట్‌స్టార్ కూడా ఒకటి. డిస్నీ + హాట్‌స్టార్ భారతదేశంలోని వినియోగదారుల కోసం మూడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ లను అందిస్తుంది. డిస్నీ + హాట్‌స్టార్ చందా ప్లాన్ రూ.299 ధర వద్ద నుండి మొదలై రూ.1499 ధర వరకు ఉంటుంది. ఈ మూడు సబ్స్క్రిప్షన్ ప్లాన్‌లలో ఒకదాన్ని కొనుగోలు చేయడానికి మీరు డిస్నీ + హాట్‌స్టార్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళవచ్చు.

డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ల జాబితా

డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ల జాబితా

డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్రీమియం ప్లాన్ నెలకు రూ.299 ధరతో ప్రారంభమవుతుంది. ఇది రెండు స్క్రీన్ ల సపోర్ట్ తో అన్‌లిమిటెడ్ లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ స్పెషల్స్ & స్టార్ సీరియల్స్, డిస్నీ + సినిమాలు, హాలీవుడ్ సినిమాలు & పిల్లల కంటెంట్, ఇంగ్లీష్ షోలు & డిస్నీ + ఒరిజినల్స్, యాడ్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్, 4K వీడియో నాణ్యత వంటి వాటితో లభిస్తాయి. ఈ ప్లాన్ ఇంగ్లీష్ + డబ్బింగ్‌లో సినిమాలను అందిస్తుంది. అలాగే రూ.399 ధర వద్ద లభించే VIP వార్షిక ప్లాన్ ఒక స్క్రీన్ సపోర్ట్ మరియు SD క్వాలిటీలో వీడియోలను చూడగల సామర్థ్యాన్ని అందిస్తుంది. చివరగా రూ.1499 ధర వద్ద లభించే ప్రీమియం వార్షిక ప్లాన్ అన్‌లిమిటెడ్ లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ స్పెషల్స్ & స్టార్ సీరియల్స్, మల్టీప్లెక్స్ & న్యూ ఇండియన్ మూవీస్, డిస్నీ + మూవీస్, హాలీవుడ్ మూవీస్ & కిడ్స్ కంటెంట్, హెచ్‌డి వీడియో క్వాలిటీతో ఒక స్క్రీన్ సపోర్ట్‌తో అందిస్తుంది.

డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందే విధానం

డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందే విధానం

డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ను విడిగా కొనుగోలు చేయడానికి ఇష్టపడని వారికి ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఫోన్ కాల్స్ కోసం మీరు ఉపయోగించే జియో మరియు ఎయిర్‌టెల్ యొక్క ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లు డిస్నీ + హాట్‌స్టార్ కు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తాయి. దీని అర్థం మీరు ఆ ప్లాన్‌లకు చందా పొందినట్లయితే మీకు డిస్నీ + హాట్‌స్టార్ చందా ఉచితంగా లభిస్తుంది. ఉచిత డిస్నీ + హాట్‌స్టార్ ను అందించే జియో మరియు ఎయిర్‌టెల్ ప్లాన్‌లు దిగువన ఉన్నాయి వాటిని తనిఖీ చేయండి.

జియో, ఎయిర్టెల్

జియో రూ. 2599 ప్లాన్

జియో రూ. 598 ప్లాన్

జియో రూ. 777 ప్లాన్

జియో రూ.401 ప్లాన్

ఎయిర్టెల్ రూ.401 ప్లాన్

ఎయిర్టెల్ రూ.448 ప్లాన్

ఎయిర్టెల్ రూ.599 ప్లాన్

ఎయిర్టెల్ రూ.2698 ప్లాన్

 

డిస్నీ + హాట్‌స్టార్ VIP

రిలయన్స్ జియో మరియు ఎయిర్‌టెల్ నుండి వచ్చిన ఈ ప్లాన్‌లన్నీ 399 రూపాయల విలువైన డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క వార్షిక ప్లాన్ ను ఉచితంగా అందిస్తాయి. మీ ఎయిర్‌టెల్ మరియు జియో ఫోన్ నంబర్‌లను ఎయిర్‌టెల్ థాంక్స్ మరియు మైజియో యాప్ ద్వారా రీఛార్జ్ చేయవచ్చు. లేదా మీ మొబైల్ నంబర్‌ను రీఛార్జ్ చేయడానికి మీరు Google Pay, PhonePe, Paytm మరియు మరిన్ని యాప్ లకు కూడా వెళ్ళవచ్చు.

Best Mobiles in India

English summary
How to Get The Disney+ Hotstar Subscription at Free of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X