Home
How to

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవసీ ఫీచర్ల కోసం చూస్తున్నారా.. వెంటనే ఈ రెండు ఫీచర్లు ఉపయోగించుకోండి..!

మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ప్లాట్‌ఫాంకు భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారు. యూజర్ల సౌకర్యం, భద్రత కోసం ఇన్‌స్టాగ్రామ్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే ఏదైనా రీల్‌ లేదా పోస్ట్‌ కొంత మంది ఫాలోయర్స్‌కు మాత్రమే కనిపించేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ఆప్షన్‌లు ఉన్నాయి. ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే యూజర్లకు ఈ ఫీచర్‌ అనుకూలంగా ఉంటుంది.

అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంపిక చేసిన వారికి మాత్రమే మీ స్టోరీ లేదా పోస్ట్‌ చేరేలా సింపుల్‌గా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. Unfollow లేదా Block చేయకుండా మీకు కావాల్సిన వారికి మాత్రమే మీ పోస్ట్‌లు కనిపించేలా చేయవచ్చు. మీ స్టోరీ కొంత మందికి మాత్రమే కనిపించేలా చేసేందుకు ఈ క్రింది విధంగా చేయండి.

How to hide a story and post on instagram for particular users telugu news

స్టెప్‌ 1 : ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్‌ చేయండి. అనంతరం ప్రొఫైల్‌ పైన క్లిక్ చేయండి.
స్టెప్ 2 : అక్కడ కనిపించిన 3 డాట్‌ మెనూ పైన క్లిక్‌ చేయండి.
స్టెప్‌ 3 : అక్కడ మీకు Hide Story అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
స్టెప్‌ 4 : ఆ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేసి మీ స్టోరీ ఎవరికి కనిపించకూడదని మీకు భావిస్తున్నారో ఆ జాబితాను యాడ్‌ చేయండి.
స్టెప్‌ 5 : అనంతరం ఆ ఆప్షన్‌ నుంచి Exit అవ్వండి. దీంతోపాటు మీ ఎంపిక చేసిన జాబితా సేవ్‌ అవుతుంది.
దీంతో మీ స్టోరీ కొంత మందికి మాత్రమే చేరుకుంది. ప్రైవసీ పరంగానూ ఈ ఫీచర్‌ను అనుకూలంగా ఉంటుంది.

సాధారణంగా మీరు చేసే ఏ పోస్ట్‌ అయినా మీ ఫాలోయర్స్‌ అందరికీ చేరుతుంది. నేరుగా కొంత మంది వ్యక్తులకు మీ పోస్ట్‌లు కనిపించకుండా చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో అవకాశం లేదు. అయితే Close Friends లిస్ట్‌ ద్వారా మీకు కావాల్సిన వారికి మాత్రమే పోస్ట్‌లు చేరేలా ప్రత్యేక జాబితాను క్రియేట్‌ చేసుకోవచ్చు.

స్టెప్‌ 1 : తొలుత ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని 3 డాట్‌ మెనూ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అక్కడ కనిపించిన Close Friends ఆప్షన్‌ పైన క్లిక్‌ చేసి, అందులో మీకు నచ్చిన వారిని యాడ్ చేయండి.
స్టెప్‌ 3 : అనంతరం మీరు ఫోటో లేదా వీడియోను పోస్ట్‌ చేసినప్పుడు Close Friends జాబితాను క్లిక్‌ చేయాలి.

ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు ఇబ్బంది పెట్టేలా మెసేజ్‌ చేస్తున్నా.. మీ పోస్టులు, రీల్స్‌లో అభ్యంతరకరంగా కామెంట్స్‌ చేస్తున్నా.. వారిని నేరుగా బ్లాక్‌ చేయవచ్చు. ఇందుకోసం ప్రొఫైల్‌లోని 3 డాట్‌ మెనూ పైన క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించిన Block పైన క్లిక్‌ చేసి బ్లాక్ చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి గత నెలలో ఓ కీలక ప్రకటన వచ్చింది. అదే ఆటో స్క్రోల్‌ ఆప్షన్‌. రోజులో ఎక్కువ సమయం రీల్స్‌ చూసే వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మాన్యువల్‌గా రీల్స్‌ను స్క్రోల్‌ చేస్తున్నాం. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆటోమేటిక్‌గా రీల్స్‌ స్క్రోల్‌ అవుతాయి. ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to hide a story and post on instagram for particular users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X