Instagramలో పోస్ట్‌లను దాచడం & అన్‌ఆర్కైవ్ చేయడం ఎలా?

|

మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఫోటో షేరింగ్ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యూజర్లు తమ యొక్క ఫోటోలను మరియు వీడియోలను అందరితో పంచుకుంటూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ లో మీరు పంచుకున్న పోస్ట్‌ను కేవలం ఒక క్లిక్‌తో దాచవచ్చు లేదా ఆర్కైవ్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్లు విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ తమ వివాహ చిత్రాలను పంచుకున్న తర్వాత దీపికా పదుకొణె షాకింగ్ చర్య తీసుకుంది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో తన వివాహ ఫోటోలను అన్‌ఆర్కైవ్ చేసింది. ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్‌లోని వినియోగదారులను వారు కోరుకున్నప్పుడు పోస్ట్‌లను అన్‌ఆర్కైవ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే ఆర్కైవ్ మరియు అన్‌ఆర్కైవ్ చేయడం ఎలా వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను ఆర్కైవ్ చేయడం లేదా దాచడం విధానం

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను ఆర్కైవ్ చేయడం లేదా దాచడం విధానం

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను ఆర్కైవ్ చేసే ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ మొబైల్ యాప్‌లో మాత్రమే పనిచేస్తుందని గమనించాలి.

స్టెప్ 1: ఇన్‌స్టాగ్రామ్ మొబైల్ యాప్‌ని ఓపెన్ చేసి మీ ప్రొఫైల్‌కు వెళ్లండి.

స్టెప్ 2: మీరు ఆర్కైవ్ చేయాలనుకుంటున్న ఫోటోపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: పోస్ట్ యొక్క కుడివైపు ఎగువ మూలలో ప్రదర్శించబడే మూడు చుక్కలను ఎంచుకోండి.

స్టెప్ 4: తరువాత అందులో కనిపించే ఆర్కైవ్ ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 5: ఇప్పుడు మీ ఫోటో ఆర్కైవ్ చేయబడుతుంది మరియు ప్రొఫైల్‌లో కనిపించదు.

 

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను అన్‌ఆర్కైవ్ చేయడం లేదా అన్‌హైడ్ చేసే విధానం

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను అన్‌ఆర్కైవ్ చేయడం లేదా అన్‌హైడ్ చేసే విధానం

స్టెప్ 1: మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ప్రొఫైల్ మెనుకి వెళ్లండి.

స్టెప్ 3: పోస్ట్ యొక్క కుడి ఎగువ మూలలో ప్రదర్శించబడే మూడు-చుక్కల ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 4: ఇప్పుడు అక్కడ ఉన్న అన్‌ఆర్కైవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: ఫోటో ఇప్పుడు మళ్ళి మీ ప్రొఫైల్‌లో కనిపిస్తుంది.

 

Instagramలో ఆర్కైవ్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేసే విధానం
 

Instagramలో ఆర్కైవ్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేసే విధానం

ఆర్కైవ్ చేయబడిన పోస్ట్‌లు మాత్రమే అన్‌ఆర్కైవ్ చేయబడతాయని గమనించాలి. దాచిన లేదా ఆర్కైవ్ చేసిన ఫోటోలను యాక్సెస్ చేయడానికి మీరు ఈ దశలను అనుసరించండి.

స్టెప్ 1: మీ ప్రొఫైల్‌కి వెళ్లండి.

స్టెప్ 2: మూడు లైన్ల ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఆర్కైవ్‌పై నొక్కండి.

స్టెప్ 4: ఎగువన ఉన్న పోస్ట్‌లు/స్టోరీల ఆర్కైవ్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: చివరగా స్టోరీస్ ఆర్కైవ్, పోస్ట్‌ల ఆర్కైవ్ లేదా లైవ్ ఆర్కైవ్‌ని ఎంచుకోండి.

 

Best Mobiles in India

English summary
How to Hide and Unhide Your Instagram Shared Photos and Videos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X