ఇలా చేసి Youtube లో స‌బ్‌స్క్రైబ‌ర్స్ కౌంట్ క‌న‌ప‌డ‌కుండా చేయొచ్చు!

|

ఇటీవ‌లి కాలంలో ప్ర‌జ‌లు త‌మ‌ నిత్య కృత్యాలను వివిధ సామాజిక మాధ్య‌మాల ద్వారా ఇత‌రుల‌కు చూపించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే Youtube వినియోగం కూడా భారీగా పెరిగింది. అయితే Youtubeలో ఛానెల్స్ క్రియేట్ చేసుకోవ‌డం, వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌డం కంటే స‌బ్‌స్క్రైబ‌ర్స్‌ ను సంపాదించుకోవ‌డం క్రియేట‌ర్ల‌కు ఓ పెద్ద స‌వాల‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో కొంత మంది క్రియేట‌ర్లు త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్స్ కౌంట్ (నంబ‌ర్‌) బ‌య‌టి వ్య‌క్తుల‌కు తెలియ‌కుండా ఉండాల‌ని భావిస్తుంటారు.

స‌బ్‌స్క్రైబ‌ర్స్ కౌంట్ త‌క్కువా.. ఎక్కువా అనేది ప‌క్క‌న పెడితే అలా నంబ‌ర్‌ బ‌య‌టి వారికి క‌న‌బ‌డ‌కుండా ఉండాల‌ని కోరుకుంటారు. అలాంటి వారి కోసం నంబ‌ర్ బ‌య‌ట‌కు క‌న‌ప‌డ‌కుండా చేసుకునే వెసులుబాటు యూట్యూబ్ క‌ల్పిస్తోంది. ఇప్పుడు అలా మ‌న స‌బ్‌స్క్రైబ‌ర్స్‌ కౌంట్ ఇత‌రుల‌కు క‌న‌బ‌డ‌కుండా ఉండేందుకు ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం.

How to Hide count of your youtube

స‌బ్‌స్క్రైబ‌ర్స్ కౌంట్ ఇత‌రుల‌కు క‌న‌బ‌డ‌కుండా డిజేబుల్ చేసే ప్ర‌క్రియ:
* ముందుగా Youtube ఛానెల్ లేని వారు ఛానెల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత Channel లోకి వెళ్లి క‌స్ట‌మైజ్ ఛానెల్ (Customize Channel) ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* క‌స్ట‌మైజ్ ఛానెల్ (Customize Channel) ఆప్ష‌న్ ఎంపిక చేసుకున్న త‌ర్వాత స్క్రీన్‌పై ఎడ‌మ వైపున మ‌రికొన్ని ఆప్ష‌న్స్ మ‌నం క‌నుగొన‌వ‌చ్చు.
* ఎడ‌మ వైపు క‌నిపించే ఆప్ష‌న్స్‌లో సెటింగ్స్ (Settings) ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత మ‌న‌కు టేబుల్ మాదిరి మ‌రో విండో ఓపెన్ అవుతుంది. అందులో ఎడ‌మ వైపున "Channel" అని ఉన్న‌ రెండో ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* "Channel" ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకున్న త‌ర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ (Advance Settings) అనే సెక్ష‌న్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మ‌న‌కు కొన్ని ఆప్ష‌న్స్ కనిపిస్తాయి. వాటిలో డిస్‌ప్లే నంబ‌ర్ ఆఫ్ పీపుల్ స‌బ్‌స్క్రైబ్‌డ్ మై ఛానెల్ (Display Number Of People Subscribed My Channel)అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని డిజేబుల్ చేయాలి. అలా డిజేబుల్ చేయ‌డం ద్వారా మ‌న యూట్యూబ్ ఛానెల్ స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ అనేది బ‌య‌టి వ్య‌క్తుల‌కు క‌న‌బ‌డ‌కుండా చేయ‌వ‌చ్చు.

How to Hide count of your youtube

అదేవిధంగా ఇప్పుడు మ‌నం యూట్యూబ్‌లో ఛానెల్‌ ఎలా క్రియేట్ చేయాలో, మానిటైజేష‌న్ కు సంబంధించిన విష‌యాలు స్టెప్ బై స్టెప్ ప్ర‌క్రియ ద్వారా తెలుసుకుందాం.
చాలా మందికి వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాల‌నే ఆస‌క్తి ఉన్న‌ప్ప‌టికీ అకౌంట్ తీయ‌డం ఎలాగో తెలీక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కాబ‌ట్టి అలాంటి వారి కోసం ఇప్పుడు మ‌నం యూట్యూబ్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్ర‌క్రియ ద్వారా తెలుసుకుందాం.

* యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవ‌డం చాలా సులువైన ప్ర‌క్రియ‌. మీరు కూడా యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా Gmail లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ Gmail స‌హాయంతో తో యూట్యూబ్ లో Sign in అవ్వాలి.

* యూట్యూబ్‌లోకి లాగిన్ అయిన త‌ర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ప‌లు ర‌కాల ఆప్ష‌న్స్ క‌న‌బ‌డ‌తాయి. వాటిలోనే రెండో ఆప్ష‌న్ "Create a New Channel" అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.

* "Create a New Channel" ఆప్ష‌న్ క్లిక్ చేసిన త‌ర్వాత మీకు ఒక విండో(బాక్స్‌) ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ ఛానల్ కి ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరుని ఎంటర్ చెయ్యండి. దాంతో పాటు ఛానెల్ ప్రొఫైల్ పిక్చ‌ర్ ను అక్క‌డే అప్‌లోడ్ చేయండి. అంతే ఇక్కడితో మీ YouTube Channel క్రియేష‌న్ అయిపోతుంది.

* ఆ త‌ర్వాత మీ ఛానెల్‌లో పూర్తి వివ‌రాలు, ఛానెల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనే వివ‌రాల్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం Customize Channel ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీ ఛానల్ కి ఒక Logo ఇవ్వండి. అక్క‌డే మీరు Channel Description ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ గురించి వివరిస్తూ అంటే మీ ఛానల్ లో ఎటువంటి వీడియోలు అప్లోడ్ చెయ్యబోతున్నారు వంటి వివరాలు అన్నితెలియచేయండి.
అలాగే మీ Gmail, Facebook , Twitter వంటి సోషల్ మీడియా పేజీలకు సంబందించిన లింక్స్ ని కూడా Add చేసుకోవచ్చు.

* ఇక మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. ఇందుకోసం ఛానెల్‌లో కుడి వైపు పై భాగంలో + సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ వీడియో ని యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యవచ్చు.

How to Hide count of your youtube

వీడియోల‌పై ఆదాయం ఎలా!
Youtubeలో మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలపై వ్యూస్ ఆధారంగా మీరు ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. ముందుగా మీకు ఇన్‌కం జ‌నరేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కావాలంటే మీ ఛానెల్‌లోని వీడియోల‌న్నిటికీ క‌లిపి 4వేల గంట‌లకు పైగా వీక్ష‌ణ స‌మ‌యం ఉండాలి. దాంతో పాటుగా 1000 మంది స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ (Subscribers)ను మీ ఛానెల్ పొంది ఉండాలి. ఈ రెండు అర్హ‌త‌లు ఉంటే మీరు యూట్యూబ్ నుంచి మానిటైజేష‌న్ (Monitisation) ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌డానికి ముందు మ‌నం యూట్యూబ్ కు మానిటైజేష‌న్ రిక్వెస్ట్ (Monitisation request) పెట్టుకోవాలి. మ‌నం రిక్వెస్ట్ పెట్టుకున్న కొద్ది రోజుల‌కు Youtube సంస్థ మ‌న కంటెంట్‌పై త‌నిఖీలు నిర్వ‌హిస్తుంది. మ‌నం పెడుతున్న కంటెంట్ కాపీ కంటెంటా లేదా స్వ‌త‌హాగా త‌యారు చేసిందా అనే విష‌యాన్ని చూస్తుంది. ఇలా అన్ని అంశాల్లో మ‌న ఛానెల్ ప‌ర్ఫెక్ట్‌గా ఉంది అనుకుంటే మ‌న మానిటైజేష‌న్ రిక్వెస్ట్‌ను Youtube యాక్సెప్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
How to Hide count of your youtube channel subscribers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X