Instagram ఫాలోవర్స్ జాబితాను దాచడం ఎలా?

|

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోటో షేరింగ్ యాప్ లలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ తన యొక్క వినియోగదారుల గోప్యతను దృష్టిలో ఉంచుకొని అనేక రకాల ఫీచర్లను విడుదల చేసింది. యూజర్ల యొక్క గోప్యతను రక్షించడం కోసం అనేక ప్రైవసీ నియంత్రణలను అందించినప్పటికీ వినియోగదారులు కొన్ని చిట్కాలతో తమను తాము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రతి ఒక్కరూ తమ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేదా ఫాలోయింగ్ లిస్ట్‌ను మరొకరు చూడకూడదనుకుంటే కనుక ఇప్పుడు వారిని దాచవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Hide Instagram Followers and You Following Users List Step By Step

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ జాబితాను దాచే విధానం

** మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ జాబితాలోని ఫాలోవర్స్ లను దాచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీకు ప్రైవేట్ అకౌంట్ ఉంటే కనుక మీరు ఫాలోవర్స్ సంఖ్యను దాచలేరు. అయితే మిమ్మల్ని ఎవరు ఫాలోచేస్తున్నారు మరియు మీరు ఫాలోయింగ్ చేసే వారిని మీరు ఇప్పటికీ దాచవచ్చు.

How to Hide Instagram Followers and You Following Users List Step By Step

** నిర్దిష్ట వినియోగదారులను మీ ప్రొఫైల్‌ను చూడకుండా నిరోధించడానికి ఒక మార్గం వారిని బ్లాక్ చేయడం. బ్లాక్ చేయబడిన వినియోగదారులు మీ ప్రొఫైల్ ని సెర్చ్ చేయలేరు మరియు ఫాలోవర్లు మీ అకౌంట్ యొక్క జాబితా వివరాలను కనుగొనలేరు. అయితే వారు ఏదైనా ఇతర అకౌంటును ఉపయోగిస్తే మాత్రమే వారు మీ యొక్క సమాచారం పొందగలరు.

** ఎవరైనా వినియోగదారున్ని బ్లాక్ చేయడానికి మీరు చేయాల్సిందల్లా వారి ప్రొఫైల్‌కు వెళ్లి కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల మెనుపై నొక్కి బ్లాక్‌ ఎంపికని ఎంచుకోండి.

** బ్లాక్ చేయడం అనేది కొంచెం విపరీతమైన పని అని మీరు అనుకుంటే కనుక మీరు ఎప్పుడైనా వినియోగదారులను మీ అకౌంట్ నుండి తీసివేయడాన్ని ఎంచుకోవచ్చు. ఈ విధంగా వారు మీ పోస్ట్‌లు మరియు ఇతర డేటాను అనుసరించడానికి మరియు మళ్లీ యాక్సెస్ పొందడానికి మీకు అభ్యర్థనను పంపవలసి ఉంటుంది.

How to Hide Instagram Followers and You Following Users List Step By Step

** ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులను పరిమితం చేసే ఎంపికను కూడా అందిస్తుంది. బ్లాక్ ఎంపిక వలె ఈ ఎంపిక కూడా ప్రొఫైల్ మెనులో ఉంటుంది.

** మీరు యాక్టివ్‌గా ఉన్నప్పుడు మరియు మీ స్టోరీలను వీక్షించినప్పుడు నియంత్రిత వినియోగదారులు మీ ఆన్‌లైన్ స్టేటస్ తో సహా నిర్దిష్ట సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు. మీరు ప్లాట్‌ఫారమ్‌లో వారి మెసేజ్లను చదవడం పూర్తయిన తర్వాత వారు "వ్యూ" ఎంపికను కూడా చూడలేరు.

Best Mobiles in India

English summary
How to Hide Instagram Followers and You Following Users List Step By Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X