Home
How to

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్‌ గురించి మీకు తెలుసా..?

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఇటీవల కాలంలో యూజర్ల సౌకర్యం కోసం అనేక ఫీచర్‌ లను తీసుకొస్తోంది. ఇటీవలే హ్యాష్‌ట్యాగ్‌ లపై పరిమితి విధించింది. ఫలితంగా కంటెంట్‌ తో సంబంధం లేకుండా హ్యాష్‌ట్యాగ్‌ లు వినియోగించే వారికి చెక్ పెట్టినట్లయింది. రీల్స్‌ లేదా పోస్ట్‌ కు గరిష్ఠంగా 5 హ్యాష్‌ట్యాగ్‌ లను మాత్రమే అనుమతిస్తోంది.

దీంతోపాటు ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్‌ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టీవీలోనూ ఇన్‌స్టాను వినియోగించుకొనే అవకాశం కలగనుంది. అయితే టీవీల్లో రీల్స్ చూసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. టీవీల్లో ఇన్‌స్టా యాప్‌ కోసం అమెజాన్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

instagram Archive feature

అమెరికాలో కొన్ని అమెజాన్‌ ఫైర్‌ టీవీల్లో ఇన్‌స్టాగ్రామ్‌ ఫర్‌ టీవీ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఈ యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసి, లాగిన్ కావాలి. గరిష్ఠంగా 5 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను లాగిన్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ప్రత్యేక ఫీచర్‌ :
కోట్లాది మంది ఇన్‌స్టాగ్రామ్‌ ను వినియోగిస్తున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ ప్రత్యేక సదుపాయం కూడా ఉంది. మీ పాత పోస్ట్‌లను డిలీట్‌ చేయకుండా, Hide చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో ఇన్‌బిల్ట్‌ గానే ఉంది. ఈ ఫీచర్‌ పూర్తి వివరాలు.

ఈ ఫీచర్‌ ఉపయోగం ఏంటి ? :
ఇన్‌స్టాగ్రామ్‌ Archive ఫీచర్‌ గురించి చాలా మంది తెలుసుకొనే ఉంటారు. ఈ ఫీచర్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ పాత పోస్ట్‌లను మీ ఫాలోవర్స్‌ కు కనిపించకుండా Hide చేయవచ్చు. ఫలితంగా ఈ పోస్ట్‌లు డిలీట్‌ కావు, కానీ ఎవరికీ కనిపించవు. అయితే ఈ ఫీచర్‌ ను ఎలా వినియోగించాలి.

స్టెప్‌ 1 : ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ లో అకౌంట్‌ ను ఓపెన్‌ చేయాలి.
స్టెప్‌ 2 : మీరు ఏ పోస్ట్‌ను Hide చేయాలని భావిస్తున్నారో, ఆ ఫోస్ట్‌ వద్దకు వెళ్లాలి.
స్టెప్ 3 : ఈ పోస్ట్‌ వద్ద ఉన్న మూడు చుక్కలపై (Three dots at Top Right) క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 4 : అక్కడ Archive అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
స్టెప్‌ 5 : Archive పైన క్లిక్ చేయగానే ఆ పోస్ట్‌ Hide అవుతుంది.
స్టెప్‌ 5 : అయితే ఈ పోస్ట్‌ డిలీట్‌ కాకుండా, మీ అకౌంట్‌లో ప్రైవేట్‌గా సేవ్‌ చేసి ఉంటుంది.

ఇలా Archive చేసిన పోస్టులను చూసేందుకు సెట్టింగ్స్‌ అండ్‌ యాక్టివిటీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ కనిపించే Archive పైన క్లిక్‌ చేయాలి. ఇలా ప్రైవేట్‌గా సేవ్‌ అయిన పోస్టులు అన్ని కనిపిస్తాయి. అయితే ఈ పోస్ట్‌లను అందరికీ కనిపించేలా చేసేందుకు అక్కడ కనిపించే Three Dots పైన క్లిక్‌ చేయాలి.

ఇన్‌స్టాగ్రామ్‌ పాత పోస్ట్‌లు కనిపించకూడదని భావించే వారికి ఈ ఫీచర్‌ ఉపయోగపడే అవకాశం ఉంది. మహిళలకు ప్రైవసీ పరంగానూ ఈ ఫీచర్‌ ఉపయోగపడే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
how to hide Old instagram posts with out delete here is the telugu guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X