WhatsApp DPని నిర్దిష్ట కాంటాక్ట్ నెంబర్ల నుండి దాచడం ఎలా?

|

ప్రస్తుత స్మార్ట్ యుగంలో సోషల్ మీడియా యాప్ లను అధికంగా వినియోగిస్తున్నారు. ఎన్ని రకాల సోషల్ మీడియా యాప్ లు ఉన్నప్పటికీ కూడా త్వరిత మెసేజ్ లను పంపడానికి, స్వీకరించడానికి మరియు వాటికీ రిప్లైలను ఇవ్వడానికి అధిక మంది వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. ఈ వాట్సాప్ దాని యొక్క వినియోగదారులకు ఆకర్షణీయంగా చేయడానికి టన్నుల కొద్దీ కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇది చాలా మంది వినియోగదారులతో కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే మీరు కొంత మంది వినియోగదారులకు కేవలం కొంత మేర వరకు మాత్రమే సమాచారాన్ని భాగస్వామ్యం చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇటీవల తమ యొక్క ఆన్‌లైన్ స్టేటస్ ని అందరి నుండి దాచడానికి అనుమతించే కొత్త కార్యాచరణను కూడా రూపొందించింది.

వాట్సాప్

వాట్సాప్ ని వినియోగిస్తున్న వినియోగదారులు తమ యొక్క ప్లాట్‌ఫారమ్‌లోని నిర్దిష్ట కాంటాక్ట్ నెంబర్ల నుండి వాట్సాప్ యొక్క డిస్‌ప్లే ఫోటోని దాచడానికి కూడా అనుమతిని ఇస్తుంది. ఇది చాలా మందికి ఉపయోగపడే ఉపాయాలలో ఒకటి. మీ యొక్క ఫోన్ లో వృత్తిపరంగా మరియు అనేక ఇతర కారణాలతో చాలా మంది ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకొని ఉంటారు. అయితే వారందరిలో మిమ్మల్ని బాధించే బంధువులు కూడా ఉండవచ్చు. ఏదైనా కారణం చేత మీ వాట్సాప్ యొక్క డిస్‌ప్లే ఫోటోని అందరికి షేర్ చేయకూడదు అని మీరు భావిస్తే కనుక కింద తెలిపే మార్గాలను అనుసరించండి.

నిర్దిష్ట కాంటాక్ట్ నెంబర్ల నుండి వాట్సాప్ DPని దాచే విధానం

నిర్దిష్ట కాంటాక్ట్ నెంబర్ల నుండి వాట్సాప్ DPని దాచే విధానం

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లోని నిర్దిష్ట పరిచయాల నుండి మీ వాట్సాప్ DPని దాచడానికి కింద తెలిపే దశలను అనుసరించండి. కింద తెలిపే దశలు iOS మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఇద్దరికి కూడా వర్తిస్తాయి.

** వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.

** సెట్టింగ్‌లు>అకౌంట్> ప్రైవసీ> ప్రొఫైల్ ఫోటో ఎంపికలను అనుసరించండి.

** ఇప్పుడు "మై కాంటాక్ట్ ఎక్ససెప్ట్..." ఎంపికపై నొక్కండి.

** ఇప్పుడు మీరు మీ DPని దాచాలనుకుంటున్న కాంటాక్ట్ నెంబర్ లను ఎంచుకోండి.

** కుడివైపు ఎగువ మూలలో గల "డన్" ఎంపికపై నొక్కండి.

 

కాంటాక్ట్‌లు

మీరు అలా చేసిన తర్వాత ఈ కాంటాక్ట్‌లు సాధారణంగా మీ నుండి మెసేజ్ లను స్వీకరించడం కొనసాగిస్తాయి. కానీ వారు మీ వాట్సాప్ యొక్క DP ఫోటోని మాత్రం చూడలేరు. తెలియని వ్యక్తులు మీ DPని చూడకూడదనుకుంటే కనుక మీరు "ఓన్లీ కాంటాక్ట్స్" ఎంపికను ఎంచుకోవచ్చు. దీన్ని ఎంచుకున్న వినియోగదారులు మీకు నచ్చని అవాంఛిత కాంటాక్ట్ నంబర్‌లను మీ యొక్క ఫోన్ నుంచి తొలగించవచ్చు. తద్వారా వారు మీ డిస్‌ప్లే ఫోటోని యాక్సెస్ చేయలేరు. అలాగే వాట్సాప్ వినియోగదారులు కావాలంటే ప్రతి ఒక్కరి నుండి వారి DPని దాచడానికి కూడా అనుమతిస్తుంది.

ప్రొఫైల్ పిక్చర్

వాట్సాప్ డిస్‌ప్లే ఫోటో (DP) వలె ప్లాట్‌ఫారమ్‌లోని వ్యక్తుల నుండి వారి "చివరిగా చూసిన" స్టేటస్ ని దాచడానికి కూడా వినియోగదారులకు ఇప్పుడు ఒక ఎంపిక ఉంది. అయితే మీరు పైన పేర్కొన్న దశలను అనుసరించి చివరిగా "ప్రొఫైల్ పిక్చర్"కి బదులుగా, మీరు "చివరిగా చూసిన" వర్గానికి వెళ్లాలి.

వాట్సాప్ చాట్‌ బ్యాకప్

ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు తమ చాట్‌లను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. మీరు ప్రాథమిక పరికరంలో మీ ఖాతాకు లాగిన్ చేసిన ప్రతిసారీ, మీరు మీ గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేయబడిన తాజా బ్యాకప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాకప్‌పై వినియోగదారులకు ఎటువంటి నియంత్రణ ఉండదు. కొత్త ఫీచర్‌ రాకతో వినియోగదారులు వాట్సాప్ చాట్ బ్యాకప్‌లను వారి స్థానిక ఇంటర్నల్ స్టోరేజ్ లేదా ఏదైనా ఇతర క్లౌడ్ స్టోరేజ్‌లో స్టోర్ చేయగలరు. ఈ బ్యాకప్‌లలో మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు మరియు ఇతర ఫైల్‌లను కలిగి ఉన్న మీ మొత్తం చాట్ డేటాను కలిగి ఉంటాయి. వినియోగదారులు తమ యొక్క చాట్‌ను బ్యాకప్ డౌన్‌లోడ్ చేయగలరు మరియు దానిని తిరిగి గూగుల్ డ్రైవ్‌లో ఉంచగలరు కూడా. ఇది వినియోగదారులకు వారి స్వంత డేటాపై మరింత నియంత్రణను అందిస్తుంది. అంతేకాకుండా వారు కోరుకున్న ప్రదేశంలో స్టోర్ చేసుకునే ఎంపికను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
How to Hide WhatsApp DP From Specific number in Your Phone Contact Number List?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X