అమెజాన్‌లో మీ బ్రౌజింగ్ హిస్టరీని దాచాలని చూస్తున్నారా? ఇలా చేయండి...

|

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అద్భుతమైన ఆఫర్లను అందిస్తూ వినియోగదారులను అధిక మందిని ఆకట్టుకుంటున్నది. ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మీకు ప్రియమైన వ్యక్తులకు తక్కువ సమయంలోనే ఆశ్చర్యాన్ని కలిగించే ఏదైనా వస్తువును కొనుగోలు చేయడం కోసం అమెజాన్ ఒక గొప్ప ప్రదేశంగా ఉంది. బహుమతుల నుండి అలంకరణల వస్తువుల వరకు ప్రతిది కూడా ఆన్‌లైన్ స్టోర్ ఇ-రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

 

అమెజాన్ బ్రౌజింగ్ హిస్టరీ

అయితే మీరు మీ అమెజాన్ అకౌంటును ప్రియమైన వారితో షేర్ చేసుకుంటే మీ అమెజాన్ బ్రౌజింగ్ హిస్టరీ డెడ్ గివ్ అవే అవుతుంది. దీనితో మీ ఆలోచన విధానాలు వారు చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన మరియు ప్రియమైన వారికి ఏదైనా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాన్ని ప్లాన్ చేస్తుంటే మరియు మీ అమెజాన్ బ్రౌజింగ్ హిస్టరీని వారు చూడకుండా ఉండాలంటే కనుక మీరు మీ అమెజాన్ బ్రౌజింగ్ హిస్టరీ నుండి ఎంపిక చేసిన అంశాలను తీసివేయవచ్చు. లేదా దీనికి ప్రత్యామ్నాయంగా మీరు మీ బ్రౌజింగ్ హిస్టరీను ట్రాక్ చేయకుండా అమెజాన్ ని నిరోధించవచ్చు. అయితే ఈ ఫీచర్‌ని ఆఫ్ చేయడం వలన అమెజాన్ మీ భవిష్యత్ కొనుగోళ్లకు సిఫార్సులను అందించకుండా నిరోధిస్తుంది. ఇది మీకు అనుకూలమైతే కనుక బ్రౌజింగ్ హిస్టరీని ఎలా హైడ్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్‌ వెబ్‌లో బ్రౌజింగ్ హిస్టరీను దాచే విధానం
 

అమెజాన్‌ వెబ్‌లో బ్రౌజింగ్ హిస్టరీను దాచే విధానం

స్టెప్ 1: ముందుగా వెబ్‌లో అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి మీ అకౌంటులోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: కర్సర్‌ను విండో యొక్క కుడివైపు ఎగువ భాగంలో అకౌంట్స్ & లిస్ట్ ఎంపికపై ఉంచి, ఆపై డ్రాప్-డౌన్ మెనులో యువర్ రికమండేషన్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఎగువ భాగంలో ఉన్న మెను బార్‌లో మీ బ్రౌజింగ్ హిస్టరీ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 4: కింది పేజీలో మీరు మీ అమెజాన్ బ్రౌజింగ్ హిస్టరీను చూస్తారు. వ్యక్తిగత అంశాలను తీసివేయడానికి మీరు తీసివేయాలనుకుంటున్న ప్రతి అంశం పక్కన ఉన్న వీక్షణ ఎంపిక బాక్స్ ని ఎంచుకొని రిమూవ్ బటన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: Amazonలో మీ బ్రౌజింగ్ హిస్టరీను పూర్తిగా క్లియర్ చేయడానికి విండో యొక్క కుడివైపు ఎగువ మూలలో ఉన్న మేనేజ్ హిస్టరీ పక్కన ఉన్న క్రింది-బాణంపై క్లిక్ చేసి, వీక్షణ నుండి అన్ని అంశాలను తీసివేయి బటన్‌ను ఎంచుకోండి.

స్టెప్ 6: భవిష్యత్తులో మీ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయకుండా అమెజాన్‌ని నిరోధించడానికి, బ్రౌజింగ్ హిస్టరీని ఆన్ / ఆఫ్ చేయి బటన్‌ను ఆఫ్ చేయండి.

 

అమెజాన్‌ యాప్‌లో మీ బ్రౌజింగ్ హిస్టరీని హైడ్ చేసే విధానం

అమెజాన్‌ యాప్‌లో మీ బ్రౌజింగ్ హిస్టరీని హైడ్ చేసే విధానం

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా ఐఫోన్ లో అమెజాన్ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: యాప్‌లో కుడివైపు దిగువ మూలన కనిపించే మూడు క్షితిజ సమాంతర రేఖల బటన్‌పై నొక్కండి.

స్టెప్ 3: ఇప్పుడు దిగువ భాగంలో ఉన్న అకౌంట్ బటన్‌ మీద నొక్కండి.

స్టెప్ 4: అకౌంట్ సెట్టింగ్‌ల ఎంపిక కింద మీ ఇటీవల వీక్షించిన అంశాలు ఎంపికను నొక్కండి.

స్టెప్ 5: ఒక్కొక్క ఐటెమ్‌ను తీసివేయడానికి ప్రతి అంశానికి వ్యతిరేకంగా వీక్షణ నుండి తీసివేయి ఎంపికను నొక్కండి.

స్టెప్ 6: మీ అమెజాన్ వెబ్ బ్రౌజింగ్ హిస్టరీలోని అన్ని అంశాలను తీసివేయడానికి వీక్షణ నుండి అన్ని అంశాలను తీసివేయి ఎంపికను నొక్కండి.

స్టెప్ 7: మీ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయకుండా అమెజాన్‌ని నిరోధించడానికి ఇటీవల వీక్షించిన అంశాలను ఆఫ్ చేయి ఎంపిక మీద నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to Hide Your Browsing History on Amazon Web and Amazon App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X