ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఎవరైనా ఒకరు చూడకుండా దాచడం ఎలా?

|

మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఫోటో మరియు వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచం మొత్తం మీద సుమారుగా 1 బిలియన్ నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధిక సమయాన్ని గడపడం కోసం గత కొన్నేళ్లుగా సంస్థ అనేక రకాల కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచర్‌ను కూడా ప్రారంభించింది. ఈ ఫీచర్ యొక్క బెస్ట్ పార్ట్ ఏమిటంటే ఇది మీ ప్రొఫైల్‌లో ఉండకుండా కూడా మీరు పోస్ట్ చేస్తూనే ఉండవచ్చు.

 
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఎవరైనా ఒకరు చూడకుండా దాచడం ఎలా?

మీ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ పైన స్టోరీస్ లు పాప్ అప్ అవుతు అన్ని పోస్ట్‌లను వీక్షించడానికి వాటిని అడ్డంగా స్క్రోల్ చేయవచ్చు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ స్టోరీస్ ని వీక్షించడానికి దానిపై క్లిక్ చేయవచ్చు. అయితే మీ స్టోరీస్ ని నిర్దిష్ట వ్యక్తి చూడకూడదనుకునే కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మీరు మీ స్టోరీస్ ని వారి చూడకుండా దాచడానికి ఎంపిక ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో మీ స్టోరీస్ ని జోడించినప్పుడు కూడా వారు చూడకుండా నిరోధించవచ్చు. మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను మరొకరి నుండి దాచడానికి మరియు వారిని బ్లాక్ చేయడానికి చాలా తేడా ఉంటుంది కావున మీ పోస్ట్‌లను వారి నుండి దాచడం ఎలా చేయవచ్చునో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఎవరైనా ఒకరివద్ద నుండి దాచే విధానం

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఎవరైనా ఒకరు చూడకుండా దాచడం ఎలా?

** ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్ ను ఓపెన్ చేసి అందులో కుడివైపు దిగువ భాగంలో గల మీ ప్రొఫైల్‌ చిత్రంపై నొక్కండి.

** కుడివైపు ఎగువన గల మోర్ ఎంపికలను ఎంచుకోండి. ఆపై సెట్టింగ్‌ల ఎంపికల మీద నొక్కండి.

** తరువాత 'ప్రైవసీ' ఎంపిక మీద నొక్కండి, ఆపై స్టోరీస్ ఎంపికను ఎంచుకోండి.

**హైడ్ స్టోరీ పక్కన ఉన్న వ్యక్తుల నెంబర్ ను నొక్కండి.

** మీరు మీ స్టోరీని దాచాలనుకుంటున్న వ్యక్తులను ఎంచుకోండి, ఆపై 'డన్' ఎంపిక మీద నొక్కండి.

** కేవలం ఒకరి నుండి మీ స్టోరీని దాచడానికి మీరు వారి ఎంపికను తీసివేయాలి.

** మీ స్టోరీని ఎవరు చూశారో మీరు చూస్తున్నప్పుడు మీ స్టోరీని దాచడానికి మీరు వ్యక్తులను కూడా ఎంచుకోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఎవరైనా ఒకరు చూడకుండా దాచడం ఎలా?

మరోవైపు మీరు నిర్దిష్ట వ్యక్తి యొకస్ స్టోరీని చూడకూడదనుకుంటే కనుక ఇంస్టాగ్రామ్ దాని కోసం సెట్టింగ్‌ను కూడా కలిగి ఉంది. స్టోరీలు వాటి ప్రాధాన్యత పరంగా జాబితా చేయబడ్డాయి. మీరు ఒకరి పోస్ట్‌లను ఇతరుల కంటే ఎక్కువగా చూస్తూ ఉంటే కనుక ఇంస్టాగ్రామ్ వారి స్టోరీలను అగ్రస్థానంలో ఉంచుతుంది. ఫీడ్ ఎగువన ఉన్న బార్‌లో ఒకరి స్టోరీ కనిపించకూడదనుకుంటే కనుక మీరు వారి స్టోరీని మ్యూట్ చేయవచ్చు. ఒకరి స్టోరీని మ్యూట్ చేయడం అనేది వారిని అన్‌ఫాలో చేయడం మరియు వారి ప్రొఫైల్‌ను మ్యూట్ చేయడం వేరు.

Best Mobiles in India

English summary
How to Hide Your Instagram Stories From a Specific Someone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X