ప్లేస్టోర్‌లో ఫేక్ అప్లికేషన్స్‌ను గుర్తించడం ఎలా ?

Posted By: ChaitanyaKumar ARK

ప్రతిరోజూ వందల వేలల్లో పుట్టుకొస్తున్న ఫేక్ అప్లికేషన్స్ ను అరికట్టడానికి గూగుల్ సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్ ను ఏర్పరచింది. అదే గూగుల్ ప్రొటెక్ట్. క్రమంగా ప్లే స్టోర్ నుండి 7,00,000 ఫేక్ మరియు అసురక్షితమైన అప్లికేషన్స్ ను తొలగించడం జరిగినది. అయినా కూడా ఇంకా అనేక ఫేక్ అప్లికేషన్స్ ప్లే- ప్రొటెక్ట్ ను కూడా దాటి ప్లేస్టోర్ లో కనిపిస్తూ వినియోగదారుల అసహనానికి కారణం అవుతున్నాయి ఉన్నాయి.ఫేక్ అప్లికేషన్స్, కొన్ని అనవసర పర్మిషన్స్ తీసుకోవడం ద్వారా మీడియా , లొకేషన్, కాంటాక్ట్స్ వంటి భద్రతాపరమైన వనరులను తస్కరించే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇలాంటి అప్లికేషన్స్ వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తూ వారి ఉనికిని కూడా ప్రశ్నార్ధకం చేసే దిశలో అడుగులు వేస్తున్నాయి. అవగాహన అనేది అన్నిటా ముఖ్యం. లేనిచో చిన్నదే అనుకుని వదిలేసే కొన్ని, అనేక ప్రతికూల పరిస్థితులను తీసుకుని వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు చెప్పబోయే పద్దతుల ద్వారా ఇటువంటి ఫేక్ అప్లికేషన్స్ ను గుర్తించవచ్చు.

Airtel 30జిబి ఉచిత డేటా ఆఫర్, ఎటువంటి కండీషన్లు లేవు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెర్చ్ ఫలితాల ద్వారా గుర్తించడం:

ఎక్కువ శాతం ఫేక్ అప్లికేషన్స్ , జెన్యూన్ అప్లికేషన్స్ ఐకాన్లను పోలి ఉండి, అవే నిజమని భ్రమను కలిగిస్తూ ఉంటాయి. మీరు సెర్చ్ చేసినప్పుడు అదే ఐకాన్ మరియు పేరును పోలి ఉన్న అప్లికేషన్స్ కనపడిన ఎడల, జాగ్రత్తపడక తప్పదు. ఈ ఫేక్ అప్లికేషన్స్ తయారు చేసే డెవెలపర్స్ , ఎక్కువగా అవగాహనా రాహిత్యం కలిగిన వినియోగదారులనే టార్గెట్ చేస్తూ ఈ అప్లికేషన్స్ విడుదల చేస్తుంటారు. కావున సెర్చ్ ఫలితాలను కాస్త గమనించడం మంచిది.

అప్లికేషన్ పేర్లు మరియు డెవెలపర్ :

అప్లికేషన్ పేరును పరిశీలించడం ద్వారా ఫేక్ అప్లికేషన్స్ గుర్తించవచ్చు. కొన్ని సందర్భాలలో అసలు పేర్లకు కొంత కొసరు జోడించడం ద్వారా నిజమని నమ్మించే భ్రమను సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మద్యనే వాట్సాప్ ను అనుకరిస్తూ "వాట్సాప్ అప్డేట్ " అనే పేరు తో ఒక అప్లికేషన్ హల్చల్ చేసింది. అదేవిధంగా swiftkey కీబోర్డు ను అనుకరిస్తూ itself swiftkey అనే పేరుతో ఒక అప్లికేషన్ వచ్చింది. కానీ దీని డెవెలపర్ ను పరిశీలించగా "డిజైనర్ సూపర్ మాన్ " అని ఉంది. నిజానికి swiftkey కీబోర్డ్ అప్లికేషన్, swiftkey కంపెనీ పేరు మీదే ఉంటుంది. మరియు మైక్రోసాఫ్ట్ ఈ మద్యనే swiftkey ను భాగస్వామ్యం కూడా చేసుకుంది. ఈ అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుండి తొలగించారు కూడా.

డౌన్లోడ్ల సంఖ్య కూడా ముఖ్యం:

మీకన్నా ముందు ఎంత మంది అప్లికేషన్ ను వినియోగించారో తెలుసుకోవలసిన కనీస అవసరం ఉన్నది. తద్వారా అది చట్టబద్దమైనదా , కాదా అన్న అవగాహన మీకు వస్తుంది. ఉదాహరణకు ఫేస్బుక్ అప్లికేషన్ ను పరిశీలిస్తే , ఆ అప్లికేషన్ డౌన్లోడ్ సంఖ్య మీకు ఖచ్చితంగా ఒక అవగాహనని ఇవ్వగలదు. ఫేక్ అప్లికేషన్స్ ఎక్కువకాలం ప్లేస్టోర్ లో మనుగడ సాగించలేవు. అవి ఫేక్ అన్న అవగాహన వచ్చిన వెంటనే వాటిని తొలగిస్తుంటారు కాబట్టి. తద్వారా వాటి డౌన్లోడ్ల సంఖ్య ఎటు తిరిగీ తక్కువగానే ఉంటుంది.

అప్లికేషన్ వివరణ (description ):

అప్లికేషన్ వివరణ లో నిజానికి డెవెలపర్స్, ఖచ్చితత్వంతో వ్యవహరిస్తారు. అప్లికేషన్ గురించిన పూర్తి అవగాహన ఇచ్చేలాగా వివరణను పొందుపరచవలసి ఉంటుంది. కానీ ఫేక్ అప్లికేషన్స్ లో వివరణలో ఉపయోగించే భాష, వివరణా తీరు, వివరాలను తొలగించడం, లేదా తక్కువగా పొందుపరచడం వంటివి ఖచ్చితంగా ఒరిజినల్ అప్లికేషన్ కు వేరుగా ఉంటుంది. తద్వారా ఆ అప్లికేషన్ పై ఒక అవగాహన వస్తుంది.

స్క్రీన్ షాట్స్:

ఫేక్ అప్లికేషన్ డెవెలపర్స్, అవి నిజమని నమ్మించే ప్రయత్నంలో , ఒరిజినల్ అప్లికేషన్స్ పేజీలో వినియోగించిన స్క్రీన్ షాట్స్ నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు swiftkey ను అనుకరించిన ఒక ఫేక్ అప్లికేషన్ " typing like flying swift" అనే వాక్యం తో ఫోటోలను పొందుపరచారు. కానీ త్వరలోనే ఈ అప్లికేషన్ కూడా తొలగించబడింది.

రివ్యూస్ :

రివ్యూస్ రాసేవారిలో ఎక్కువ శాతం అప్లికేషన్ వినియోగించిన తర్వాత తమ అనుభవాలను వివరిస్తుంటారు. ఆ రివ్యూస్ చదవడం ద్వారా అప్లికేషన్ గురించిన అవగాహన కూడా వస్తుంది. కావున కచ్చితంగా రివ్యూలు చదవాల్సిన అవసరం ఉంది. చివరగా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫేక్ అప్లికేషన్స్ వలన లాభాలు లేకపోగా నష్టాలే తీవ్రంగా ఉంటాయి. బాంకింగ్ ఆధారిత వివరాలను సైతం తస్కరించగలిగే ఫేక్ అప్లికేషన్స్ విషయంలో అజాగ్రత్త ఉనికికే ప్రమాదం తెస్తుంది అనడంలో సందేహమే లేదు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to identify fake Android apps in Google Play Store More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot