ప్రమాదంలో స్మార్ట్‌ఫోన్లు, ఈ నకిలీ యాప్స్ డౌన్‌లోడ్ చేశారా..?

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది గూగుల్ ప్లే స్టోర్ వైపు. అక్కడ ఉన్న పాపులర్ యాప్స్ పోన్లోకి వెంటనే డౌన్లోడ్ చేస్తుంటారు. అది ఒరిజినలా, కాదా అనే విషయం తెలియకుండానే డౌన్‌లోడ్ చేస్తుంటారు. అయితే అలాంటి వారి ఫోన్లపై ఇప్పుడు మాల్‌వేర్‌ల దాడి జరుగుతోంది. కాబట్టి మీరు ఈ చిట్కాలతో మీ ఫోన్లను రక్షించుకోండి.

Airtel మరో అద్భుత ఆఫర్, ఈ సారి బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చూసేందుకు ఒకేలా ఉన్నా..

ఒరిజినల్, నకిలీ యాప్స్ చూసేందుకు ఒకేలా ఉన్నా వాటిలో కొన్ని తేడాలు ఉంటాయి. ఈ తేడాలను కనిపెట్టడం ద్వారా ఒరిజినల్, ఫేక్ యాప్స్‌ను ఇట్టే సులభంగా గుర్తించవచ్చు. మీ ఫోన్లను రక్షించుకోవచ్చు.

లోగోలు ఒకేలా ఉన్నా వాటి టెక్ట్స్ వేరేలా..

ఒరిజినల్ యాప్స్‌కు నకిలీ యాప్స్‌కు లోగోలు ఒకేలా ఉన్నా వాటి టెక్ట్స్ వేరేలా ఉంటుంది. అందులో ఏదైనా ఒక అక్షరాన్ని మిస్ చేస్తూ నకిలీ యాప్ ఉంటుంది. లేదంటే వాట్సాప్ పదానికి ముందు వెనుక వేరే పదాలను జోడించి ప్లే స్టోర్‌లో పెడతారు. అవి జాగ్రత్తగా చూసి కనిపెట్టాలి.

డౌన్‌లోడ్స్ సంఖ్య కొన్ని కోట్ల లో

అసలు యాప్స్ ఏవైనా డౌన్‌లోడ్స్ సంఖ్య కొన్ని కోట్ల లో ఉంటాయి. నకిలీ యాప్‌లు చాలా అత్యల్పమైన డౌన్‌లోడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇది గుర్తించడం ద్వారా కూడా అసలు యాప్, నకిలీ యాప్‌ను కనిపెట్టవచ్చు.

రేటింగ్‌పై కూడా..

అలాగే యాప్‌కు ఉన్న రేటింగ్‌పై కూడా ఓ కన్నేయండి. ఎందుకంటే నకిలీ యాప్స్‌కు రేటింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఒరిజినల్ యాప్స్‌కు రేటింగ్ ఎక్కువ ఉంటుంది.

 

ఒరిజినల్, నకిలీ యాప్స్ లోగోలు

ఒరిజినల్, నకిలీ యాప్స్ లోగోలు కొన్ని సంధర్భాల్లో కరెక్ట్ గా ఉండవు. రంగులో గానీ, బ్రైట్‌నెస్‌లోగానీ, షేడింగ్‌లో గానీ తేడా ఉంటుంది. దీన్ని కనిపెట్టడం ద్వారా కూడా రక్షణ పొందవచ్చు.

యాడ్స్ పరంగా..

యాడ్స్ పరంగా కూడా ఓ లుక్కేయండి. చాలా వరకు ఒరిజినల్ యాప్స్‌లో యాడ్స్ ఉండవు. వాట్సప్, మెసెంజర్ తీసుకుంటే వాటిల్లో మనకు యాడ్స్ కనిపించవు. అయితే వీటికి వచ్చే నకిలీ యాప్స్‌లో విపరీతమైన యాడ్స్ ఉంటాయి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Identify Fake Apps in the Google Play Store more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot