LED TV పిక్చర్ క్వాలిటీని మెరుగుపరుచుకోవటం ఎలా..?

ఎల్ఈడి టీవీల ధరలు ఒక్కసారిగా దిగిరావటంతో ప్రతి ఇంట్లోనూ వివిధ సైజుల్లో ఎల్ఈడి టీవీలు దర్శనమిస్తున్నాయి.

|

ఎల్ఈడి టీవీల ధరలు ఒక్కసారిగా దిగిరావటంతో ప్రతి ఇంట్లోనూ వివిధ సైజుల్లో ఎల్ఈడి టీవీలు దర్శనమిస్తున్నాయి. సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌ల దగ్గర నుంచి మైక్రోమాక్స్ వంటి దేశవాళీ బ్రాండ్స్ వరకు వివిధ వేరియంట్‌లలో ఎల్ఈడి టీవీలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే మూడు రకాల ఎల్ఈడి టీవీలు మార్కెట్లో ఎక్కువుగా అమ్ముడుపోతున్నాయి. వాటిలో మొదటి రకం HD-ready LED TVలు కాగా రెండవ రకం full HD,మూడువ రకం smart LED TV. ప్రస్తుత మార్కెట్లో 720 పిక్సల్ హెచ్‌డి రెడీ క్వాలిటతో వస్తోన్న 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ రూ.10,000 కంటే తక్కువ ధరకే లభ్యమవుతోంది.

మీ ఫోన్ కిందపడినా,బండకేసి కొట్టినా చెక్కు చెదరదు, సూపర్ బ్యాగ్ !మీ ఫోన్ కిందపడినా,బండకేసి కొట్టినా చెక్కు చెదరదు, సూపర్ బ్యాగ్ !

పిక్షర్ క్వాలిటీ అనేది డిస్‌ప్లే ప్యానల్స్ పై ఆధారపడి ఉంటుంది...

పిక్షర్ క్వాలిటీ అనేది డిస్‌ప్లే ప్యానల్స్ పై ఆధారపడి ఉంటుంది...

ఎల్ఈడి టీవీలకు సంబంధించిన పిక్షర్ క్వాలిటీ అనేది వాటిలో అమర్చే డిస్‌ప్లే ప్యానల్స్ పై ఆధారపడి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో లివ్వింగ్ రూమ్ కండీషన్‌ను బట్టి పిక్షర్ క్వాలటీని అడ్జస్ట్ చేసుకోవల్సి ఉంటంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా LED TV పిక్షర్ క్వాలిటీని మెరుగుపరచుకునేందుకు అందుబాటులో ఉన్న పలు తీరైన మార్గాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

క్వాలిటీ HDMI కేబుల్స్‌ను వాడటం ద్వారా..

క్వాలిటీ HDMI కేబుల్స్‌ను వాడటం ద్వారా..

క్వాలిటీ HDMI కేబుల్స్‌ను వాడటం ద్వారా టీవీ అవుట్ పుట్‌ను మరింతగా మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి, నాసిరకమైన హెచ్‌డిఎమ్ఐ కేబల్స్ జోలికి వెళ్లకండి. మీ డివైస్‌లను హెచ్‌డిఎమ్ఐ కేబుల్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసిన తరువాత HDMI inputs కరెక్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని HDCP 2.2కి కనెక్ట్ చేయండి.

ఇంటర్నెట్ స్పీడ్ బాగుండాలి..

ఇంటర్నెట్ స్పీడ్ బాగుండాలి..

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ వంటి వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లకు సంబంధించి ఆన్‌లైన్ కంటెంట్‌ను వీక్షిస్తున్నపుడు TV పిక్షర్ క్వాలిటీ బాగుండాలంటే ఇంటర్నెట్ కనెక్టువిటీ వేగంగా ఉండాలి. ముఖ్యంగా 4కే టీవీల్లో ఇటువంటి కంటెంట్‌ను వాచ్ చేస్తున్నపుడు మీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వేగం కనీనం 40 Mbpsగా ఉండాలి.

ఖచ్చితమైన డిస్‌ప్లే సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా..

ఖచ్చితమైన డిస్‌ప్లే సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా..

వీక్షించే వీడియో కంటెంట్‌ను బట్టి డిస్‌ప్లే సెట్టింగ్‌ను అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా పిక్షర్ క్వాలిటీని మరింత ఎఫెక్టివ్‌గా మలచుకునే వీలుంటుంది. ఉదాహరణకు మీరు సినిమా చూస్తునపుడు "Movie or Cinema" మోడ్‌ను సెలక్ట్ చేసుకోవటం, గేమింగ్ ఆడుతున్నపుడు "Game" మోడ్‌లను సెలక్ట్ చేసుకోవటం బెస్ట్ క్వాలిటీ విజువల్స్‌ను ఆస్వాదించగలుగుతారు.

కాంట్రాస్ట్‌ను పెంచుకోవటం ద్వారా

కాంట్రాస్ట్‌ను పెంచుకోవటం ద్వారా

ఎల్‌ఈడీ టీవీల్లో కాంట్రాస్ట్‌ను గరిష్టంగా పెంచుకోవటం ద్వారా పిక్షర్ క్వాలిటీ మరింతగా మెరుగుపడుతుంది. పిక్షర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టాండర్డ్ మోడ్‌ను సెలక్ట్ చేసుకుని కాంట్రాస్ట్ లెవల్స్‌ను గరిష్టంగా పెంచుకున్నట్లయితే హై-క్వాలిటీ విజువల్ మీ సొంతమవుతుంది.

పవర్ సేవింగ్ మోడ్‌ను స్విచ్-ఆఫ్ చేయటం ద్వారా..

పవర్ సేవింగ్ మోడ్‌ను స్విచ్-ఆఫ్ చేయటం ద్వారా..

మీ టీవీలో పవర్ సేవింగ్ మోడ్ ఎనేబుల్ అయి ఉన్నట్లయితే వెంటనే ఆ మోడ్‌ను టర్నాఫ్ చేయండి. టీవీలో పవర్ సేవింగ్ మోడ్ ఎనేబుల్ అయి ఉండటం వల్ల ఇమేజ్ క్వాలిటీ పూర్తిగి తగ్గించివేయబడుతుంది. ఈ మోడ్‌ను ఆఫ్ చేయటం ద్వారా బ్రైట్నెస్ ఇంకా కాంట్రాస్ట్ లెవల్స్ మెరుగుపడతాయి.

Best Mobiles in India

English summary
when it comes to picture quality of LED TVs, the most important component that is questioned is the quality of the display panel. While the panel quality keeps varying from brand and brand, it totally depends on the price segment of the TV.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X