బ్యాటరీ బ్యాకప్ కోసం 5 సింపుల్ టిప్స్

|

నేటి తరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ల ద్వారా అనేక సౌలభ్యతలను మనం ఆస్వాదిస్తున్నాం.

బ్యాటరీ బ్యాకప్ కోసం 5 సింపుల్ టిప్స్

Read More : 3జీబి ర్యామ్‌తో Redmi 3s Prime, రూ.6,999కే

అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే 5 సింపుల్ టిప్స్...

టిప్ 1

టిప్ 1

మీ స్మార్ట్‌ఫోన్‌లోని వై-ఫై ఇంకా బ్లూటూత్ ఆప్షన్‌లను అవసరం మేరకే ఉపయోగించుకోండి. అవసరం లేనప్పటికి చాలా మంది వీటిని ఆన్ చేసి ఉంచుతారు. కాబట్లి ఆయా కనెక్టువిటీ అప్లికేషన్ లతో పని పూర్తికాగానే ఆఫ్ చేయటం మంచిది. తద్వారా మీ బ్యాటరీ లైఫ్ మరింత ఆదా అవుతుంది.

టిప్ 2

టిప్ 2

మీ స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాటరీ ఏఏ విభాగానికి ఎంతెంత శక్తిని మంజూరు చేస్తుందో తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ వినియోగానికి సంబంధించి విశ్లేషణతో కూడిన సమచారాన్ని తెలుసుకోవాలంటే, ముందుగా మీ ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి లాగినై About Phone > Battery > Battery Use ఆప్షన్‌లలోకి వెళ్లవలసి ఉంటుంది.

టిప్ 3
 

టిప్ 3

ప్రయాణ సందర్భాల్లో బ్యాటరీ ఛార్జింగ్ ఇబ్బందులు తలెత్తటం సర్వసాధారణం. ఇలాంటి సమాయాల్లో పవర్ ఇన్వర్టర్‌ను మీ వెంట తీసుకువెళటం ద్వారా కారులోనే మీ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.

టిప్ 4

టిప్ 4

మ్యూజిక్ లేదా వీడియోలను స్ట్రీమ్ చేయ్యటం, 3జీ కనెక్టువిటీ సాయంతో డేటాను డౌన్‌లోడ్ చెయ్యటం వంటి సందర్భాల్లో బ్యాటరీ పవర్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి అవసరానికి మాత్రమే వీటిని వినియోగించుకోవాలి. బ్యాటరీలో పవర్ తక్కువుగా ఉన్నప్పుడు 3జీ కనెక్షన్‌ను ఆఫ్ చెయ్యటం మంచిది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ మేనేజిమెంట్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేసుకోవటం వల్ల బ్యాటరీని మరింత ఆదాచేసుకోవచ్చు.

టిప్ 5

టిప్ 5

బ్యాటరీ చార్జ్ దిగపోవటానికి గల ప్రధాన కారణాల్లో స్ర్కీన్ బ్రైట్నెస్ కూడా ఒకటి. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.

Best Mobiles in India

English summary
How To Improve Your Smartphone Battery Life with Quick Tips. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X