మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆడియో క్వాలిటీ అదిరిపోవాలా..?

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోన్న అత్యుత్తమ ఆపరేటింగ్ సిస్టంలలో ఆండ్రాయిడ్ ఓఎస్ ఒకటి.

By GizBot Bureau
|

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోన్న అత్యుత్తమ ఆపరేటింగ్ సిస్టంలలో ఆండ్రాయిడ్ ఓఎస్ ఒకటి. ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను టెక్నాలజీ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ కస్టమైజేషన్స్ పట్ల అవగాహనను ఏర్పరుచుకోవటం వల్ల ఫోన్ క్వాలిటీని అన్ని విభాగాల్లోనూ మెరుగుపరుచుకోవచ్చు. ఫోన్ క్వాలిటీని డిసైడ్ చేసే కీలక అంశాల్లో ఆడియో ఒకటి.

 

కస్టమైజేషన్ పట్ల మీకు ఎంతోకొంత అవగాహన ఉన్నట్లయితే..

కస్టమైజేషన్ పట్ల మీకు ఎంతోకొంత అవగాహన ఉన్నట్లయితే..

ఆడియో క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోయినట్లయితే ఫోన్ వాడటమే వేస్ట్ అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ కస్టమైజేషన్ పట్ల మీకు ఎంతోకొంత అవగాహన ఉన్నట్లయితే ఫోన్ ఆడియో క్వాలిటీని మరింతగా మెరుగుపరుచుకునే వీలుంటుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఆడియో క్వాలిటీని ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా మీ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌ను చెక్ చేసుకోండి..

ముందుగా మీ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌ను చెక్ చేసుకోండి..

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఎండ్‌లెస్ ఆప్టిమైజేషన్ ఆప్షన్స్‌తో వస్తున్నాయి. వీటి ద్వారా ఆడియో క్వాలిటీని మరింతగా ఎన్‌హాన్స్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్‌ను ఆప్టిమైజ్ చేసుకునే క్రమంలో డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Sounds & Vibration ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఆడియో క్వాలిటీకి సంబంధించి అనేకమైన ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిని అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా ఆడియో క్వాలిటీని పెంచుకోవచ్చు. వీటితో పాటు ఆండ్రాయిడ్ ఈక్వలైజర్ అనే ఫీచర్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వస్తోంది.

మ్యూజిక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా..
 

మ్యూజిక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఆడియో క్వాలిటీని ఎన్‌హాన్స్ చేసేందుకు అనేక థర్డ్ యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో Poweramp లేదా Playerpro యాప్‌లను వినియోగించుకోవటం ద్వారా ఆడియో క్వాలిటీ మరింతగా మెరుగుపడుతుంది. ఈ యాప్ కస్టమ్ ప్రీసెట్స్‌తో పాటు Bassను పెంచుకుతంది. Poweramp మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్ సీరియస్ ట్యూనింగ్ నిమిత్తం 10-బ్యాండ్ ఆర్‌క్యూను ఆఫర్ చేస్తుంది.

Ainur Nero టూల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా..

Ainur Nero టూల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా..

మరొక పద్థతిలో భాగంగా Ainur NERO అనే సాఫ్ట్‌‍వేర్‌ను ఉపయోగించుకుని ఫోన్ ఆడియో క్వాలిటీని మెరుగుపరుచుకోవచ్చు, ఈ అడ్వాన్సుడ్ ఆడియో ఎన్‌హాన్స్‌మెంట్ టెక్నాలజీని UltraM8s డెవలపర్స్ అభివృద్థి చేసారు. ఈ న్యూరో మోడ్ ఆండ్రాయిడ్ సిస్టం నుంచి ఆడియో ప్రాసెసింగ్ యూనిట్‌ను తొలగించి దాని స్థానంలో తన సొంత API‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. దీంతో ఆడియో క్వాలిటీ మరింతగా మెరుగుపడుతుంది. ఒకవేళ మీ డివైస్ రూట్ అయి ఉన్నట్లయితే TWRP అనే రికవరీ టూల్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్రొసీజర్ సమయంలో ఈ టూల్ చాలా వర్క్ అవుతుంది.

 

 

Dolby Atmos Surround అనే మరో సాఫ్ట్‌వేర్ ద్వారా..

Dolby Atmos Surround అనే మరో సాఫ్ట్‌వేర్ ద్వారా..

Dolby Atmos Surround అనే మరో సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఫోన్ ఆడియో క్వాలిటీ మరింతగా మెరుగుపడుతుంది. అయితే ఈ సాఫ్ట్‌వేర్ మీ ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ డివైస్ ఖచ్చితంగా రూట్ చేసినదై ఉండాలి.

Best Mobiles in India

English summary
How to Increase Audio Quality on Any Android Device.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X