జియో ఇంటర్నెట్ స్లోగా ఉందా, అయితే స్పీడ్ పెంచుకోవచ్చు ఇలా !

By Hazarath
|

రిలయన్స్ జియో రాకతో మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తిన విషయం విదితమే..దిగ్గజ టెల్కోలకు షాకిస్తూ దూసుకొచ్చిన జియో స్పీడ్ విషయంలో కాస్తా వెనకబడిందని జియో యూజర్లు వాపోతున్నారు. కనీసం 20 ఎంబిపిఎస్ కూడా రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జియో స్పీడ్ ను పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్ అందుబాటులోకి వచ్చాయి. మీరు వాటిని ఫాలో అయితే చాలు. జియో స్పీడ్‌ని 40ఎంబిపిఎస్‌ వరకు పెంచుకోవచ్చు.

 

రెండు రూపాయలకే 1 జిబి డేటా, సంచలనాలే ఇక !రెండు రూపాయలకే 1 జిబి డేటా, సంచలనాలే ఇక !

నెట్‌వర్క్ సెట్టింగ్స్ చేంజ్

నెట్‌వర్క్ సెట్టింగ్స్ చేంజ్

మీరు మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని నెట్ వర్క్ సెట్టింగ్స్‌లో కెళ్లి APN కొత్తది క్రియేట్ చేసుకోండి. అక్కడ ఈ కింది వివరాలను పొందుపరచండి.
Name : Jio4G new
APN - jionet
APN Type - Default
Proxy - Not Set
Port - Not Set
Username - Not Set
Password - Not Set
Server - www.google.com
MMSC - Not Set
MMS proxy - Not Set
MMS port - Not Set
MCC - 405
MNC - 857, 863 or 874
Authentication type - Not Set
APN Protocol - IPv4/IPv6

నెట్ వర్క్ మోడ్

నెట్ వర్క్ మోడ్


అన్ని ఫోన్లకు సిమ్ వేయగానే ఆటోమేటిగ్గా సిమ్ నెట్ వర్క్ చూపిస్తుంది. అయినప్పటికీ ఓ సారి చెక్ చేసుకోవడం మేలు. ఇందుకోసం మీరుSettings>>network settings>>Preferred network type: 4G LTE అని సెట్ చేసుకోండి.

 

 

 VPN apps
 

VPN apps

వీపీఎన్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా కూడా జియో స్పీడ్ పెంచుకోవచ్చు.ఇండియన్ ఐపీ సపోర్టడ్ వీపీఎన్ డౌన్ లోడ్ చేసుకుంటే జియో స్పీడ్ పెరుగుతుంది. ఇందుకోసం మీరు VPN master or SNAP VPN కాని డౌన్ లోడ్ చేసుకుని వాటిని ఓపెన్ చేసి ఇండియన్ సర్వర్స్ కి కనెక్ట్ అయితే చాలు.

MTK engineering mode app

MTK engineering mode app

ఇది కూడా జియో స్పీడ్ ని పెంచుతుంది. ఇందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి MTK engineering mode appని డౌన్ లోడ్ చేసుకోండి. ఆ యాప్ ఓపెన్ చేసి MTK settings>> Band Options>> select LTE mode క్రియేట్ చేసుకోండి. బాండ్ 40 సెలక్ట్ చేసుకోవడం మరచిపోవద్దు.అయిపోయిన తరువాత దీన్ని సేవ్ చేసి మీ ఫోన్ రీ స్టార్ట్ చేయండి. మీ జియో స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.

డేటా స్పీడ్‌లను వివిధ రకాల bandలలో

డేటా స్పీడ్‌లను వివిధ రకాల bandలలో

రిలయన్స్ జియో వివిధ రకాల డేటా స్పీడ్‌లను వివిధ రకాల bandలలో ఆఫర్ చేస్తుంది. వాటిలో band 40 ఇతర బ్యాండ్‌లతో పోలిస్తే వేగవంతమైన డేటా స్పీడ్స్‌ను ఆఫర్ చేస్తోంది. మీ ఫోన్ ఎల్టీఈ బ్యాండ్‌ను బ్యాండ్ 40కి మార్చుకోవటం ద్వారా హైడేటా స్పీడ్‌ను మీరు ఆస్వాదించవచ్చు.

క్వాల్కమ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లయితే

క్వాల్కమ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లయితే

మీరు క్వాల్కమ్ ప్రాసెసర్‌తో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లయితే ##4636#*#* సీక్రెట్ కోడ్‌ను అప్లై చేసి ఎల్టీఈ బ్యాండ్‌ను band 40కి మార్చుకోవచ్చు. అయితే ఈ ట్రిక్ వన్‌ప్లస్ 3, షియోమీ ఎంఐ 5 వంటి క్వాల్కమ్ చిప్ డివైస్‌లలో మాత్రమే వర్క్ అవుతుంద‌ని గ్ర‌హించండి.

Best Mobiles in India

English summary
How To Increase Jio 4G Net Speed Upto 80 Mbps, 5 Awesome Tricks

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X