Home
How to

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ పెంచుకోవాలా... ఈ చిట్కాలు మీకోసమే..!

Smartphone Battery Life : భారత్‌ మార్కెట్లో గత కొన్ని నెలల నుంచి భారీ బ్యాటరీ సామర్థ్యంతో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. గత సంవత్సరం మార్చి నెలలో 7300mAh బ్యాటరీతో తొలిసారిగా ఐకూ ఫోన్‌ విడుదల అయింది. అనంతరం 7000mAh లేదా అంతకంటే అధిక బ్యాటరీ సామర్థ్యంతో అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు వివిధ మోడల్స్‌ ను తీసుకొచ్చాయి. గత నెలలో రియల్‌మి సంస్థ ఏకంగా 10,001mAh బ్యాటరీతో ఫోన్‌ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాటరీ సామర్థ్యంతో రియల్‌మి రెండు ఫోన్‌లను కలిగి ఉంది.

భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తు్‌న్నా.. వినియోగం కూడా బ్యాటరీ లైఫ్‌ పై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ ను పెంచుకోవచ్చు. దీంతోపాటు ఎక్కువ సంవత్సరాల వరకు బ్యాటరీ హెల్తీగా ఉండేలా చూసుకోవచ్చు.

How to increase smartphone battery life

డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ :
కొంత మంది యూజర్లు అధిక బ్రైట్‌నెస్‌ తో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తుంటారు. దీనివల్ల బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జి అవుతుంది. అవుట్‌డోర్‌ లో వినియోగిస్తున్నప్పుడు అధిక బ్రైట్‌నెస్‌ కావాల్సి ఉంటుంది. అయితే ఇన్‌డోర్‌ లోకి వచ్చినప్పుడు బ్రైట్‌నెస్‌ ను తగ్గించుకోవాలి.

Also Read

ఫోన్‌ డిస్‌ప్లే సెట్టింగ్స్‌ లో ఆటోమేటిక్‌ ఆప్షన్‌ ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. దీంతో పరిస్థితులకు అనుగుణంగా బ్రైట్‌నెస్‌ ఆటోమేటిక్‌ గా మారుతుంది. దీంతోపాటు ఫోన్ వినియోగించిన అనంతరం 15 నుంచి 30 సెకన్లలోనే డిస్‌ప్లే ఆఫ్‌ అయ్యేలా సెట్టింగ్స్‌ లో మార్పులు చేసుకోవాలి.

బ్యాగ్రౌండ్‌లో పనిచేస్తుంటే :
స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ అవసరాల కోసం యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. అయితే అందులో చాలా యాప్‌లను మనం వినియోగించకపోయినా, బ్యాగ్రౌండ్‌ లో పనిచేస్తుంటాయి. అంటే కంటెంట్‌ను రీఫ్రెష్‌ చేయడం, లొకేషన్‌ ట్రాకింగ్‌ వంటివి బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అయ్యేందుకు కారణం అవుతాయి. మీకు అవసరం లేని యాప్‌లను డిలీట్‌ చేయడం లేదా బ్యాగ్రౌండ్‌ లో పనిచేయకుండా చేయడం ఉత్తమం.

Recommended For You

డార్క్ మోడ్‌ :
స్మార్ట్‌ఫోన్‌లో డార్క్ మోడ్‌ను ఉపయోగించి, బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. దీంతోపాటు రాత్రి వేళల్లో ఉపయోగిస్తుంటే కళ్లు త్వరగా అలసిపోకుండా ఉంటాయి. యాప్స్‌ నోటిఫికేషన్ల కారణంగా బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అవుతుంది. అవసరం లేని నోటిఫికేషన్‌లను నిలిపివేయడం ఉత్తమం.

అప్‌డేట్స్ :
ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ సేవర్‌ మోడ్‌ ఇన్‌బిల్ట్‌గానే ఉంటోంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. దీంతోపాటు బగ్స్‌, పాత సాఫ్ట్‌వేర్‌లు బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అయ్యేందుకు కారణం అవుతాయి. అందుకే ఫోన్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోవాలి.

వీటిని ఆఫ్‌ చేసుకోవాలి :
ఫోన్‌ లో బ్లూటూత్, వైఫై, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లను అవసరం లేనప్పుడు ఆఫ్‌ చేయాలి. GPS నిరంతరం ఆన్‌లోనే ఉంటే బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జీ అవుతుంది. ఈ ఫీచర్ల కారణంగా ఫోన్‌ త్వరగా వేడెక్కేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీంతోపాటు లైవ్‌ వాల్‌పేపర్స్‌, విడ్జెట్స్‌ వినియోగం బ్యాటరీని ఎక్కువగా ఖర్చు చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to increase smartphone battery life more longer, full guide in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X