ఫోన్ బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ కాలం నిలవాలంటే..?

By Super
|
How to Increase the Charge on a Phone


మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ గుండెకాయ అయితే, చార్జర్ ఆక్సిజన్ లాంటిది. ఈ రెండింటిలో ఏది సరిగా స్పందించకున్నా.. ఫోన్ మనుగడ కష్టతరమవుతోంది. అయితే, కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో బ్యాటరీ జీవిత కాలం రెట్టింపవుతుంది.

ఇవిగోండి చిట్కాలు:

- సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది.

- బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి.

- బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం.

- బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి.

- అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి.

- స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి.

- ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి.

- ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X