స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ పనితీరును పెంచడానికి పాటించవలసిన చిట్కాలు...

|

స్మార్ట్‌ఫోన్‌లలో గేమ్‌లను ఆడటం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు తీరిక సమయాలలో గేమ్‌లను ఆడటానికి అధికముగా ఇష్టపడుతున్నారు. అయితే మొబైల్ గేమ్‌లను ఆడాలంటే ఖరీదైన స్మార్ట్‌ఫోన్ మాత్రమే కొనాలని ఎవరు చెప్పారు? అనేక బడ్జెట్-స్థాయి స్మార్ట్‌ఫోన్‌లు కూడా మంచి గేమింగ్ అనుభవాన్ని అందించగలవు. పవర్ ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్‌లు అందించే గేమింగ్ అనుభవాన్ని ఇది ఏ విధంగానూ బలహీనపరచదు. గేమింగ్ పనితీరు అంతర్గత హార్డ్‌వేర్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ పనితీరును పొందడానికి పాటించవలసిన చిట్కాల గురించి ఆలోచిస్తుంటే కనుక కింద తెలిపే మార్గాలను అనుసరించండి.

బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను ఆఫ్ చేయడం

బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను ఆఫ్ చేయడం

మీ స్మార్ట్‌ఫోన్‌లో పరిమిత మొత్తంలో ర్యామ్ ఉన్నప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను తొలగించడం అనేది గేమింగ్ పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. ఇది RAMని ఖాళీ చేయడమే కాకుండా మొబైల్ ఆప్టమైజింగ్ పనితీరును సాపేక్షంగా మెరుగుపరుస్తుంది.

పవర్ సేవింగ్ మోడ్‌ను ఆఫ్ చేయడం

పవర్ సేవింగ్ మోడ్‌ను ఆఫ్ చేయడం

పవర్ సేవింగ్ మోడ్ అనేది బ్రైట్‌నెస్, క్లాక్ స్పీడ్‌ని తగ్గించడం వంటి సిస్టమ్ వనరులను పరిమితం చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్ ని మెరుగుపరచడమే కాకుండా బ్యాటరీ అధిక సమయం రావడానికి వీలుగా ఉద్దేశించబడింది. మీ యొక్క ఫోన్ లో మీరు అధికంగా గేమ్‌లను ఆడడానికి ఇష్టపడుతుంటే కనుక ఆడుతున్న సమయంలో అది ఆఫ్ చేయబడిందని నిర్ధారించుకోండి.

గేమ్ మోడ్ లేదా హై-పెర్ఫార్మెన్స్ మోడ్‌కి మారడం
 

గేమ్ మోడ్ లేదా హై-పెర్ఫార్మెన్స్ మోడ్‌కి మారడం

అధిక ధర వద్ద లభించే అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా కొన్ని బడ్జెట్ ధరలో లభించే ఫోన్‌లు కూడా ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌తో లేదా అధిక పనితీరు ఫీచర్ తో వస్తాయి. ఈ మోడ్‌లో ఇతర కార్యకలాపాల కంటే గేమింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి స్మార్ట్‌ఫోన్‌లు ముందే కాన్ఫిగర్ చేయబడతాయి. కాబట్టి ఈ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే దాన్ని ప్రారంభించడంతో మీ యొక్క ఫోన్ అధికంగా హీట్ అవ్వకుండా గేమ్ సజావుగా ఆడటానికి వీలుగా ఉంటుంది.

గేమ్ బూస్టర్ యాప్‌ని ఉపయోగించడం

గేమ్ బూస్టర్ యాప్‌ని ఉపయోగించడం

గేమ్ బూస్టర్ యాప్‌లు అనేవి గేమింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ పనితీరును మరియు సిస్టమ్ వనరులను మెరుగ్గా నిర్వహించడానికి ఆప్టిమైజ్ చేస్తాయి. అత్యుత్తమ గేమింగ్ పనితీరును అందించడానికి వారు అన్ని అనవసరమైన కార్యకలాపాలు మరియు టాస్క్‌లను స్వయంచాలకంగా ఆఫ్ చేయవచ్చు.

గేమింగ్ సమయంలో మంచి Wi-Fi కనెక్షన్‌ని ఎంచుకోవడం

గేమింగ్ సమయంలో మంచి Wi-Fi కనెక్షన్‌ని ఎంచుకోవడం

మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో గేమ్ లను ఆడుతున్నప్పుడు ముఖ్యంగా ఆన్ లైన్ వంటి గేమ్లను ఆడుతున్న సమయంలో మృదువైన గేమింగ్ పనితీరు కోసం స్థిరమైన Wi-Fi కనెక్షన్ ఉండడం అనేది ముఖ్యమైన అంశం. ఇది లాగ్-ఫ్రీ గేమింగ్‌ను నిర్ధారిస్తుంది.

గేమ్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం

గేమ్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం

స్మార్ట్‌ఫోన్‌లలో అధిక గ్రాఫిక్స్ గల గేమ్లను ఆడడానికి ఇష్టపడుతూ ఉంటే కనుక మీరు మీ స్మార్ట్‌ఫోన్ ఆధారంగా గేమ్‌ల యొక్క గ్రాఫిక్స్ సెట్టింగ్‌కు ఎల్లప్పుడూ కొన్ని సర్దుబాట్లు చేయాలి. ఇది మీరు మెరుగైన ఫ్రేమ్ రేట్లను మరియు మృదువైన గేమింగ్ అనుభవాన్ని పొందడంలో సహాయపడుతుంది.

కాష్‌ని క్లియర్ చేయడం

కాష్‌ని క్లియర్ చేయడం

స్మార్ట్‌ఫోన్ మొత్తం కాష్‌ని డేటాను క్లియర్ చేయడం వల్ల స్టోరేజ్ చాలా వరకు ఆదా అవుతుంది. స్మార్ట్‌ఫోన్ సజావుగా పనిచేయడానికి తగినంత స్టోరేజ్ అనేది ఉండడం ముఖ్యం. దీని వలన మృదువైన గేమింగ్ పనితీరు కూడా ఉంటుంది.

హోమ్ స్క్రీన్‌పై విడ్జెట్‌లను వదిలించుకోవడం

హోమ్ స్క్రీన్‌పై విడ్జెట్‌లను వదిలించుకోవడం

మీరు ఆండ్రాయిడ్ వినియోగదారు అయితే విడ్జెట్‌లు సిస్టమ్ వనరులను వినియోగిస్తాయని మీరు తెలుసుకోవాలి. వాటిని తీసివేయడంతో మీ స్మార్ట్‌ఫోన్ పనితీరును మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది.

తాజా సాఫ్ట్‌వేర్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌డేట్ చేయడం

తాజా సాఫ్ట్‌వేర్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌డేట్ చేయడం

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తరచుగా సిస్టమ్ వనరులను మెరుగైన ఆప్టిమైజేషన్‌తో పనితీరు నవీకరణలను పంపుతారు. తాజా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వలన మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కు సాధ్యమైనంత ఉత్తమమైన పనితీరును కలిగి ఉన్నారని నిర్ధారిస్తుంది.

Best Mobiles in India

English summary
How to Increase Your Smartphone’s Gaming Performance

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X