జియో ఫీచర్ ఫోన్‌లో Jio కాల్ రికార్డింగ్ యాప్ ను ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

|

ఇండియాలో రిలయన్స్ జియో సంస్థ మొదలైనప్పటి నుంచి అన్ని రంగాలలోను ప్రత్యేక గుర్తింపును సాధిస్తోంది. టెలికామ్ మరియు బ్రాడ్ బ్యాండ్ రంగాలతో పాటుగా ఇండియాలో అధిక శాతం గల 2G వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలోనే ఫీచర్ ఫోన్లను కూడా విడుదల చేయడం మొదలుపెట్టింది. జియో ఫోన్లు యూజర్లకు 2Gతో పాటుగా 4G నెట్‌వర్క్‌ను కూడా ఎంచుకోవడానికి అనుమతిని ఇస్తుంది. కంపెనీ ఇప్పటివరకు రెండు ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. వీటి యొక్క ధరలు వరుసగా రూ.1,324 మరియు రూ. 2,999.

జియో ఫీచర్ ఫోన్‌లలో గల యాప్ వివరాలు
 

జియో ఫీచర్ ఫోన్‌లలో గల యాప్ వివరాలు

రిలయన్స్ జియో యొక్క రెండు ఫీచర్ ఫోన్‌లలో వినియోగదారులు వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ వంటి మరెన్నో యాప్ లను యాక్సిస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అయితే జియో ఫోన్ ను వాడుతున్న వారు తమకు వచ్చే అన్ని రకాల ఫోన్ కాల్ లను రికార్డు చేయడానికి చూస్తున్నట్లు అయితే కనుక మీరు Jio కాల్ రికార్డింగ్ యాప్ ను ఉపయోగించవచ్చు. ఈ యాప్ ను ఫీచర్ ఫోన్ లో ఎలా ఇన్ స్టాల్ చేయాలో మరియు దానిని ఎలా ఉపయోగించాలో అన్న మార్గాల కోసం అన్వేషిస్తుంటే కనుక కింద ఉన్న మార్గాలను అనుసరించండి.

జియో ఫీచర్ ఫోన్‌లో Jio కాల్ రికార్డింగ్ యాప్ ను ఇన్‌స్టాల్ చేసే పద్ధతులు

జియో ఫీచర్ ఫోన్‌లో Jio కాల్ రికార్డింగ్ యాప్ ను ఇన్‌స్టాల్ చేసే పద్ధతులు

స్టెప్ 1: మొదటగా మీరు మీ యొక్క జియో ఫోన్‌లో గల Jio యాప్ స్టోర్ కి వెళ్లాలి.

స్టెప్ 2: ఇందులో Jio కాల్ రికార్డింగ్ అప్లికేషన్ కోసం సెర్చ్ చేయండి.

స్టెప్ 3: తరువాత దీనిని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ అప్లికేషన్‌ ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 4: దీనిని ఇన్‌స్టాల్ చేయడానికి నిబంధనలు & షరతులను అంగీకరించడానికి చెక్‌బాక్స్‌ మీద టిక్ చేయాలి.

స్టెప్ 5: ఇన్‌స్టాల్ చేయబడిన తరువాత Jio ఫోన్ కాల్ అప్లికేషన్‌ను అన్ని కాల్స్ కోసం ఉపయోగించవచ్చు.

Jio ఫోన్లలో కాల్స్ రికార్డ్ చేయడం ఎలా?
 

Jio ఫోన్లలో కాల్స్ రికార్డ్ చేయడం ఎలా?

మీ జియో ఫోన్‌లో కాల్‌లను రికార్డ్ చేయడానికి కింద ఉన్న దశలను అనుసరించండి

స్టెప్ 1: ఫోన్ లో జియో కాల్ రికార్డింగ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసిన తరువాత రికార్డింగ్ కోసం ఆటో కాల్ రికార్డింగ్ ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 2 : ఈ ఎంపికను ఎంచుకున్న తరువాత మీరు రిసీవ్ చేసుకున్న ప్రతి కాల్‌ కూడా రీకోడింగ్ స్వయంచాలకంగా ప్రారంభించబడుతుంది.

స్టెప్ 3 : జియో ఫీచర్ ఫోన్‌లోని ఫైల్ విభాగంలో మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది. ఆలా కాకపోతే కనుక కాల్‌ను మరొక ప్రదేశంలో కూడా స్టోర్ చేయడానికి కూడా మీకు అనుమతి ఉంది.

స్టెప్ 4: మీరు స్టోర్ చేసుకున్న విభాగం నుండి రికార్డు చేయబడిన కాల్ లను వినవచ్చు. తేదీ, పేరు మరియు సమయం ప్రకారం రికార్డింగ్‌ను సెర్చ్ చేయడానికి కూడా ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Install and Use Jio Auto Call Recording App in Jio Feature Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X