ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌‌ఫోన్‌లోకి జెల్లీబీన్ అప్లికేషన్‌లను ఇన్స్‌స్టాల్ చేయటమేలా..?

Posted By: Super

ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌‌ఫోన్‌లోకి జెల్లీబీన్ అప్లికేషన్‌లను ఇన్స్‌స్టాల్ చేయటమేలా..?

ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ‘గుడ్ న్యూస్’. మీ హ్యాండ్‌సెట్‌లో  ఆండ్రాయిడ్ ‘4.1 జెల్లీబీన్’ అప్లికేషన్‌లను రన్ చేసుకోవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియదు.  జెల్లీబీన్ వోఎస్‌లోని  ఈ-మెయిల్ క్లయింట్, జీమెయిల్, ఫేస్‌లాక్, గూగుల్ బుక్స్, గ్యాలరీ, గూగుల్ క్యాలెండర్, ఎర్త్, న్యూస్, మ్యూజిక్, గూగుల్ +, వీడియో ఎడిటర్, నాయిస్ ఫీల్డ్, మ్యాగజైన్స్, ఫేస్‌బీమ్, వాలెట్ వంటి ప్రత్యేక ఫీచర్లను మీ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ స్మార్ట్‌ఫోన్‌లో ఆస్వాదించవచ్చు. ఈ అప్లికేషన్‌లను మీ డివైజ్ సపోర్ట్ చేయాలంటే ముందుగా మూలలను కలిగి ఉండాలి. అంతేకాకుండా క్లాక్ వర్క్ మోడ్ రికవరీ అప్లికేషన్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి.

జెల్లీబీన్ అప్లికేషన్‌లను ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్‌లోకి ఇన్స్‌స్టాల్ చేసుకునే విధానం:

స్టెప్ 1: ముందుగా జెల్లీబీన్ అప్లికేషన్‌లను క్రింద జత చేసిన లింక్ అడ్రస్‌లోకి లాగినై మీ పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకోండి.

లింక్ అడ్రస్:

స్టెప్ 2:  ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ డివైజ్‌ను కంప్యూటర్‌కు యూఎస్బీ కేబుల్ ఆధారితంగా జత చేయండి.

స్టెప్ 3:  పీసీలో సేవ్ చేయబడిన  జెల్లీబీన్ అప్లికేషన్‌లను మీ ఆండ్రాయిడ్ డివైజ్ లోని రూట్ ఫోల్డర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి.

స్టెప్ 4:  ఇప్పుడు ఫోన్‌ను పీసీ నుంచి వేరు(Disconnect) చేయండి.

స్టెప్ 5:  ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను టర్న్ ఆఫ్ చేయండి.

స్టెప్ 6:  డివైజ్‌ను క్లాక్ వర్క్ మోడ్ రికవరీలోకి బూట్ చేయండి.

స్టెప్7:  ఇప్పుడు ‘ఇన్స్‌స్టాల్ జిప్ ఫ్రం ఎస్డీ‌కార్డ్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 8:  ఎస్డీ కార్డ్‌లోని సంబంధిత  జిప్ ఫైల్‌ను సెలక్ట్ చేసకోండి.

స్టెప్ 9: ఇప్పుడు అప్లికేషన్ ఫైళ్లను సెలక్ట్ చేసుకోగానే ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

స్టెప్ 10:  ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ

పూర్తికాగానే  ‘‘రీబూట్ సిస్టం నౌ’’ ఆప్షన్‌ను నొక్కి ఉంచండి.

స్టెల్ 10:   మీ డివైజ్ రీస్టార్ట్ కాగానే జెల్లీబీన్ అప్లికేషన్లు మీ డివైజ్‌లో రన్ అవుతాయి.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot