పెన్‌డ్రైవ్ సాయంతో విండోస్ 8వోఎస్‌ను పీసీలో ఇన్స్‌స్టాల్ చేయవచ్చా?

By Prashanth
|
Windows 8


మైక్రోసాఫ్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 అధికారికంగా విడుదలైంది. చాలా మందికి వోఎస్‌లను తమతమ మిత్రుల వద్ద నుంచి పెన్‌డ్రైవ్ ద్వారా కాపీ చేసుకని తమ పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఈ తరహాలోనే విండోస్ 8నూ పెన్‌డ్రైవ్ లేదా ఇతర యూఎస్బీ డ్రైవ్ ద్వారా పీసీలలో ఇన్స్‌స్టాల్ చేసుకోవచ్చు.

 

అవసరమైనవి:

- విండోస్ 8 డివీడీ లేదా ఐఎస్‌వో ఇమేజ్,

 

- 4జీబి అంతకన్నా పెద్దదైన యూఎస్బీ డ్రైవ్,

- విండోస్ ఆధారిత కంప్యూటర్,

- మైక్రోసాఫ్ట్ విండోస్7 యూఎస్బీ డీవీడీ డౌన్‌లోడ్ టూల్,

1.) ముందుగా విండోస్ 7 యూఎస్బీ డీవీడీ టూల్‌ను పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకుని ఆపై ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ లింక్: http://www.withsteps.com/download/Windows7-USB-DVD-tool.exe

2.) ఇన్స్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం విండోస్ 7 యూఎస్బీ డీవీడీ టూల్‌ను ఓపెన్ చేసి బ్రౌజ్ లోకేషన్‌లోకి వెళ్లి విండోస్8.ఐఎస్‌వో ఫైల్‌ను ఎంపిక చేసుకుని క్రింది భాగంలో కనిపించే next ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3.) ఇప్పుడు మీ పీసీకి యూఎస్బీ మెమరీ స్టిక్ లేదా పెన్‌డ్రైవ్‌ను యూఎస్బీ పోర్ట్ ఆధారితంగా కనెక్ట్ చేసి ‘యూఎస్బీ డివైజ్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

4.) తరువాత కనిపించే లొకేషన్‌లో మీ యూఎస్బీ డివైజ్‌ను సెలక్ట్ చేసుకుని ‘బిగిన్ కాపియింగ్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

5.) ఇప్పుడు విండోస్ 8 ఇన్స్‌స్టాలేషన్‌కు అవసరమైన ఫైల్స్ మీ యూఎస్బీ డ్రైవ్‌లోకి కాపీ కాబడతాయి.

6.) ఈ స్టెప్స్ ను అనుసరించటం ద్వారా యూఎస్బీ డ్రైవ్ ను ఉపయోగించి విండోస్ 8వోఎస్ ను పీసీలోకి ఇన్స్ స్టాల్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X