Paytm ద్వారా మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఎలా..?
మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడదామనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్ (Paytm), తమ కస్టమర్స్ కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడదామనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్ (Paytm), తమ కస్టమర్స్ కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయంతో పేటీఎమ్ మనీ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుని మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) విధానంలో తక్కువ మొత్తంలో డబ్బును పెట్టుబడిగా పెట్టి, కొంత కాలం తరువాత మంచి మొత్తంలో డబ్బును పొందే వీలుంటుంది. ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి రూ.100 నుంచి ప్రారంభమవుతాయి.

రిజిస్ట్రేషన్ అలానే కేవైసీ (KYC) ప్రాసెస్‌ను కంప్లీట్ చేయాలి..
పేటీఎమ్ ద్వారా మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారు ముందుగా రిజిస్ట్రేషన్ అలానే కేవైసీ (KYC) ప్రాసెస్‌ను కంప్లీట్ చేయవల్సి ఉంటుంది. ఈ డిజిటల్ ప్రాసెస్ ఎటువంటి పేపర్లతో పనిలేకుండా జరిగిపోతుంది. నేటి స్పెషల్ ఫోకస్ స్టోరీ భాగంగా పేటీఎమ్ మనీ (Paytm Money) ద్వారా మ్యూచవల్ ఫండ్స్‌లో ఏ విధంగా పెట్టుబడులు పెట్టొచ్చు అనే దాని పై స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా మీ పేరుతో Paytm Money అకౌంట్‌ను సెటప్ చేసుకోవాలి..
ఇందుకుగాను ముందుగా పేటీఎమ్ మనీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవటం లేదా, పేటీఎమ్ మనీ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేటీఎమ్ మనీ యాప్ ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ స్టోర్ నుంచి పొందవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాత మీ పేటీఎమ్ అకౌంట్‌కు సంబంధించిన లాగిన్ క్రెడిన్షియల్స్‌తో పేటీఎమ్ మనీ వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేగవంతంగా కంప్లీట్ అవ్వాలంటే?
ఆ తరువాత ‘Apply for Access' అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కు సంబంధించిన వెయిట్ లిస్ట్‌లోకి వెళతారు.ఇక్కడ కొంత సేపు మీరు వెయిట్ చేయవల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేగవంతంగా జరిగిపోవాలనుకున్నట్లయితే పేటీఎమ్ మనీ యాప్‌లోని ‘I Want Faster Access' అనే ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. దీంతో మీకు సంబంధించి Paytm Money అకౌంట్ సెటప్ కావటంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా విజయవంతంగా పూర్తవుతుంది.

ఆ తరువాత KYC ప్రాసెస్‌ను పూర్తి చేయాలి..
KYC ప్రాసెస్‌ను పూర్తి చేసే క్రమంలో ముందుగా మీ పాన్ కార్డ్ నెంబర్‌ను ఎంటర్ చేసి ఆ తరువాత మీ వ్యక్తిగత సమాచారం, అడ్రస్ ప్రూఫ్, నామినీ, బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ వంటి ముఖ్యమైన వివరాలను ఫిల్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత మీ డిజిటిల్ సిగ్నేచర్‌తో పాటు మీ ఫోటోను కూడా అప్‌లోడ్ చేయవల్సి ఉంటుంది. తదుపరి చర్యలో భాగంగా 5 సెకన్ల ఇన్ పర్సన్ వెరిఫికేషన్ వీడియోను మీరు అప్ లోడ్ చేయవల్సి ఉంటుంది. ఈ వీడియోలో మీ పూర్తి పేరును ఉచ్చరించాల్సి ఉంటుంది. KYC ప్రాసెస్ పూర్తయిన తరువాత నుంచి పేటీఎమ్ మనీ ద్వారా మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు.

మ్యూచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం ఎలా..?
పేటీఎమ్ మనీ ద్వారా మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారికి క్విక్ ఫిల్టర్స్‌తో పాటు బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్), వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ వంటి పెట్టుబడి మోడ్ ప్రాధాన్యతలు అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








