మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ సెక్యూరిటీ కోసం గూగుల్ చెబుతోన్న ముఖ్యమైన టిప్స్

స్మార్ట్‌ఫోన్‌లను అనేక రకాల కమ్యూనికేషన్ అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. మన వెన్నెంటే ఉంటు మన వ్యక్తిగత సమాచారాన్ని నిరంతరం క్యారీ చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లను సెక్యూర్‌గా ఉంచుకోవల్సిన బాధ్యత వినియోగదారుల పై ఎంతైనా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో సెక్యూరిటీ స్థాయిని మరింత బలోపేతం చేసుకునేందుకు గూగుల్ సూచిస్తోన్న బెస్ట్ టిప్స్...

Read More : ఈ వారం విడుదలైన కొత్త ఫోన్‌లు (టాప్ - 10)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను తప్పనసరిగా ఆన్ చేసి ఉంచండి. అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను వెతకటంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషిస్తుంది.

టిప్ 2

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు స్ర్కీన్ లాక్‌ను సెట్ చేయటం మరవకండి. స్ర్కీన్ లాక్‌ను సెట్ చేయటం వల్ల ఎవరు పడితే ఇతరులు మీ ఫోన్ ను తెరిచి చూసేందుకు ఆస్కారం ఉండదు.

టిప్ 3

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవటం ద్వారా ఫోన్‌లోని డేటా భద్రంగా ఉంటుంది.Settings > Security > Encrypt phone

టిప్ 4

మీ ఫోన్ లాక్‌స్ర్కీన్‌ మీద మీ ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నెంబర్‌ను జత చేయటం ద్వారా మీ ఫోన్ ను సలువుగా గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది.Settings > Security > Owner info

టిప్ 5

మీ ఆండ్రాయడ్ ఫోన్‌కు సంబంధించిన యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే తీసుకోండి.

టిప్ 6

మీ ఫోన్‌లోని డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవటం ఉత్తమం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Keep Your Android Smartphone Safe and Private. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot