PUBG గేమ్ ఆడుతున్నారా? ఈ టిప్స్ ఫాలో అయితే మీరే విన్నర్!

బ్యాటిల్ రాయల్ కాన్సెప్ట్‌ ఆధారంగా అభివృద్థి చేయబడని ప్లేయర్ అన్‌నౌన్ బ్యాటిల్‌గ్రౌండ్స్ (పీయూబీజీ) మొబైల్ గేమ్‌కు స్మార్ట్‌ఫోన్ యూజర్లు బ్రహ్మరథం పడుతోన్న విషయం తెలిసిందే.

|

బ్యాటిల్ రాయల్ కాన్సెప్ట్‌ ఆధారంగా అభివృద్థి చేయబడని ప్లేయర్ అన్‌నౌన్ బ్యాటిల్‌గ్రౌండ్స్ (పీయూబీజీ) మొబైల్ గేమ్‌కు స్మార్ట్‌ఫోన్ యూజర్లు బ్రహ్మరథం పడుతోన్న విషయం తెలిసిందే. ఈ గేమ్‌లో భాగంగా 100 మంది ప్లేయర్స్ పారాచూట్ సహాయంతో ఓ నిర్మానుష్య ద్వీపంలోకి ల్యాండ్ అవుతారు ఇక్కడ కొన్ని వెపన్స్ ఇంకా రక్షణ కవచాల సహాయంతో గేమ్ చివరి వరకు వీరు మనుగడ సాగించాల్సి ఉంటుంది.

 

8 కెమెరాల స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసా ?8 కెమెరాల స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసా ?

జీవన్మరణ పోరాటం..

జీవన్మరణ పోరాటం..

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిపోయే ఈ జీవన్మరణ పోరాటంలో భాగంగా ప్లేయర్స్ ఒకరినొకరు చంపుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఈ క్రమంలో మంచి టెక్నిక్స్ ఇంకా వ్యూహాలను ఫాలో అయ్యే ప్లేయర్స్ మాత్రమే తమ ఆయుధాలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగగలుగుతారు.

 

 

వాటిని వాడితే 100% వరకు హీల్ అవ్వొచ్చు..

వాటిని వాడితే 100% వరకు హీల్ అవ్వొచ్చు..

PUBG గేమ్‌ప్లేలో భాగంగా ప్లేయర్స్ గాయాల నుంచి కోలుకునేందుకు అనేక మెడిసన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని తీసుకోవటం ద్వారా వారు 75% వరకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా ప్లేయర్లు 100% వరకు హీల్ అవ్వొచ్చు. అది ఏవిధంగానో ఇప్పుడు తెలుసుకుందాం...

 

 

హెల్త్ ఐటమ్స్...
 

హెల్త్ ఐటమ్స్...

హెల్త్‌ ఐటమ్స్ అనేవి ప్లేయర్ ఆరోగ్యాన్ని ఇన్‌స్టెంట్‌గా రీజనరేట్ చేస్తాయి. దీంతో వారు మరింత యాక్టివ్‌గా తయారవుతారు. మెడ్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, బ్యాండేజ్ ఇలా మూడు రకాల హెల్త్ ఐటమ్స్ PUBG గేమ్‌ప్లేలో భాగంగా యర్స్‌కు అందుబాటులో ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మెడ్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, బ్యాండేజ్..

మెడ్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, బ్యాండేజ్..

మెడ్ కిట్ (Med Kit) : PUBG గేమ్‌ప్లేలో భాగంగా మెడ్ కిట్ అనేది బెస్ట్ హీలింగ్ ఐటమ్‌గా గుర్తింపుతెచ్చుకుంది. ఈ మెడిసన్‌‌ను తీసుకున్న 8 సెకన్లలోపే 100% ఆరోగ్యంతో ప్లేయర్ రీస్టోర్ కాబడతాడు.
ఫస్ట్ ఎయిడ్ కిట్ (First Aid Kit) : PUBG గేమ్‌ప్లేలో భాగంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది రెండవ బెస్ట్ హీలింగ్ ఐటమ్‌గా గుర్తింపుతెచ్చుకుంది. ఈ మెడిసన్‌‌ను తీసుకున్నట్లయితే 75% ఆరోగ్యంతో ప్లేయర్ రీస్టోర్ కాబడతాడు.
బ్యాండేజ్ (Bandage) : PUBG గేమ్‌ప్లేలో భాగంగా ఈ హెల్త్ ఐటమ్ చాలా సులువుగా లభ్యమవుతుంది. ఈ బ్యాండెజ్ అనేది 7 సెకన్లలో 10% ఆరోగ్యాన్ని రీజనరేటర్ చేస్తుంది.

బూస్టర్ ఐటమ్స్ గురించి..

బూస్టర్ ఐటమ్స్ గురించి..

బూస్టర్ ఐటమ్స్ అనేవి కొంత సమయం పాటు హెల్త్‌ను రీజనరేట్ చేయగలుగుతాయి. ఇదే సమయంలో యాడెడ్ ఇమ్యూనిటీని కూడా ఇవి ఆఫర్ చేస్తాయి. పెయిన్ కిల్లర్, ఎనర్జీ డ్రింక్, అడ్రినలిన్ సిరంజ్ ఇలా మూడు రకాల బూస్టర్ ఐటమ్స్ PUBG గేమ్‌ప్లేలో భాగంగా ప్లేయర్స్‌కు అందుబాటులో ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

పెయిన్ కిల్లర్, ఎనర్జీ డ్రింక్, అడ్రినలిన్ సిరంజ్...

పెయిన్ కిల్లర్, ఎనర్జీ డ్రింక్, అడ్రినలిన్ సిరంజ్...

పెయిన్‌కిల్లర్ (Painkiller): పెయిన్‌కిల్లర్ అనేది ప్లేయర్స్‌కు సంబందించిన బూస్టర్ బార్‌ను 60 శాతం వరకు ఫిల్ చేస్తుంది. ఈ పవర్‌ను 7 సెకన్లలోపు ఉపయోగించుకోవల్సి ఉంటుంది.
ఎనర్జీ డ్రింక్ (Energy Drink) : ఈ బూస్టర్ ఐటమ్ చాలా తక్కువ మొత్తంలో ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ అనేవి ప్లేయర్స్‌కు సంబందించిన బూస్టర్ బార్‌ను 60 శాతం వరకు ఫిల్ చేస్తాయి. ఈ పవర్‌ను 4 సెకన్లలోపు ఉపయోగించుకోవల్సి ఉంటుంది.
అడ్రినలిన్ సిరంజ్ (Adrenaline Syringe) : ఈ బూస్టర్ ఐటమ్ చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది ఎక్కువుగా సప్లై క్రాట్స్‌లో దొరుకుతుంది. అడ్రినలిన్ సిరంసెజ్ అనేవి ప్లేయర్స్‌కు సంబందించిన బూస్టర్ బార్‌ను 100 శాతం వరకు ఫిల్ చేస్తాయి. ఈ పవర్‌ను 10 సెకన్లలోపు ఉపయోగించుకోవల్సి ఉంటుంది.

 

 

తెలివిగా ఆర్గనైజ్ చేసుకోవాలి..

తెలివిగా ఆర్గనైజ్ చేసుకోవాలి..

గేమ్‌ప్లే సమయంలో ప్లేయర్ ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి, హెల్త్ ఐటమ్స్‌ను చాలా జాగ్రత్తగా వాడుకోవల్సి ఉంటుంది. ప్లేయర్‌కు సంబంధించిన బ్యాగ్ లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంటుంద కాబట్టి ఇతర స్టఫ్‌తో పాటు హెల్త్ ఐటమ్స్‌ను ఉంచుకునేందుకు కూడా చోటును కల్పించుకోవాలి. బూస్టర్ ఐటమ్స్‌తో పోలిస్తే మెడ్ కిట్ అలానే ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు ఎక్కవు స్పేసును ఆక్రమించేస్తుంటాయి. కాబట్టి వాటిని రెండు లేదా మూడుకు పరిమితం చేసి మిగిలిన స్పేసును బూస్టర్ ఐటమ్స్ కు కేటాయించుకుంటే సరిపోతుంది. ప్లేయర్స్‌కు మైనర్ డామేజీలు సంభవించిన సమయంలో బ్యాండేజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా చాలా వేగంగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to keep your health full during a gameplay in PUBG.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X