ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్ సురక్షితంగా ఉండాలంటే..?

ఈ ఆధునిక స్మార్ట్ కమ్యూనికేషన్ ప్రపంచంలో ప్రతిఒక్కరికి టెక్నాలజీ ఎంతో అవసరం. చేతిలో టెక్నాలజీ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి.

ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్ సురక్షితంగా ఉండాలంటే..?

Read More : ఫుల్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.10,000లోపు

వేలకు వేలు పోసి కొనుగోలు చేసే స్మార్ట్ గాడ్జెట్స్ పట్ల ప్రయాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రయాణ సమయాల్లో మీ వెంట క్యారీ చేసే ల్యాప్‌టాప్‌లను సురక్షితంగా ఉంచుకునేందుకు పలు ముఖ్యమైన టిప్స్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

చాలా మంది ప్రయాణ సమయాల్లో తమ ల్యాప్‌టాప్‌లను సాధారణ బ్యాక్‌ప్యాక్ ఇంకా పుస్తకాల బ్యాగ్‌లలో మోసుకువెళుతుంటారు. ఈ విధానం ఏమాత్రం సురిక్షితం కాదు. ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బ్యాగ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవటం ద్వారా ప్రయాణంలో మీ ల్యాపీ ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది.

టిప్ 2

ప్రయాణ సమయాల్లో ల్యాప్‌‌టాప్ పవర్‌ను పూర్తిగా ఆఫ్‌చేసి ఉంచటం మంచిది. జర్నీ సమయంలో ల్యాపీని ఎక్కువ సేపు వినియోగంచటం కారణంగా కుదుపుకు గురయ్యే అవకాశముంది. దీంతో ల్యాపీలోని కాంపోనెంట్లు దెబ్బ తింటాయి. ప్రయాణ సమయంలో ల్యాపీని చల్లటి వాతావరణంలో ఉంచటం మంచింది.

టిప్ 3

ప్రయాణ సందర్భాల్లో మీ ల్యాప్‌టాప్‌కు అదనపు సెక్యూరిటీ అవసరం. ఇటీవల కాలంలో రైళ్లు, బుస్సులలో ల్యాప్‌టాప్ దొంగతనాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి, ప్రయాణం సమయంలో ల్యాప్‌టాప్ రక్షణ పట్ల మరింత అప్రమత్తత అవసరం.

టిప్ 4

పబ్లిక్ ప్రాంతాల్లో వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించే ముందు కాస్తంత ఆలోచించండి. మీ ల్యాపీలోకి వైరస్‌లను ప్రవేశపెట్టి డేటాను దొంగిలించేందుకు హ్యాకర్లకు ఇదో మంచి మార్గం. ఇటువంటి సమస్యలను ఎదుర్కొవాలంటే మీ ల్యాప్‌టాప్‌లో సురక్షితమైన యాంటీ స్పైవేర్ వ్యవస్థను అప్ టూ డేట్‌గా లోడై ఉండాలి.

టిప్ 5

మీ ల్యాప్‌టాప్ మోడల్, సీరియల్ నెంబర్, సర్వీస్ నెంబర్, స్పెసిఫికేషన్స్ వంటి అంశాలను లిఖిత పూర్వకంగా రాసి ఉంచుకోవటం మంచింది. అనుకోని పరిస్థితులలో ల్యాపీ చోరికి గురైనట్లయితే ఈ సమాచారంతో వెతికిపట్టుకునే అవకాశం ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Keep Your laptop Safe while Traveling. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot