మీ స్మార్ట్‌ఫోన్‌లు ఎంత మురికిగా ఉంటున్నాయో, మీకు తెలుసా..?

రోజుకు ఎన్నిసార్లు మీ మొబైల్ ఫోన్‌ను టచ్ చేస్తున్నారు..? ఫోన్‌ను తాకిన ప్రతిసారీ మీ చేతుల్లోకి ఎంత బ్యాక్టీరియా మిమ్మల్ని చుట్టుముడుతుంది..?

|

మీ చేతుల్లోని స్మార్ట్‌ఫోన్‌లు ఎంత డర్టీగా ఉంటున్నాయో, మీకు తెలుసా..?, మురికి వస్తువులను పుట్టుకున్న ప్రతిసారీ చేతులను శుభ్రంగా కుడుక్కుంటాం. అలాంటిది, వివిధ రకాల బ్యాక్టీరియాలతో నిండే ఉండే మొబైల్ ఫోన్‌లను తాకిన ప్రతిసారీ చేతులను శుభ్రం చేసుకుంటున్నామా..?

Read More : రూ.15,000లో బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

మొబైల్ ఫోన్ నిత్యావసర సాధానం

మొబైల్ ఫోన్ నిత్యావసర సాధానం

నిత్యావసర సాధానల్లో ఒకటైన మొబైల్ ఫోన్ గురించి ఆసక్తికర వివరాలు బహిర్గతమయ్యాయి. పలు పరిశోధనల ద్వారా వెల్లడైన వివరాల మేరకు మొబైల్ ఫోన్‌లు 85శాతం కామన్ బ్యాక్టీరియాతో నిండి ఉంటున్నాయట. మనకు తెలియకుండా మనల్ని చుట్టుముడుతోన్న బ్యాక్టిరీయా గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పబ్లిక్ టాయిలెట్‌లలో ఉండే క్రిముల కంటే ఎక్కువ

పబ్లిక్ టాయిలెట్‌లలో ఉండే క్రిముల కంటే ఎక్కువ

మీకు తెలుసా మీ సెల్‌ఫోన్, పబ్లిక్ టాయిలెట్‌లలో ఉండే క్రిముల కంటే ఎక్కువ క్రిములను కలిగి ఉంటుందట. సగటు టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లో, ఒక్కో చదరపు అంగుళం 25,000 క్రిములను కలిగి ఉంటుందట. అదే సమయంలో పబ్లిక్ టాయిలెట్‌లు చదరపు అంగుళానికి 1,201 బ్యాక్టీరియాలను కలిగి ఉంటుందట.

ఇవి కూడా బ్యాక్టీరియా కేంద్రాలేనట
 

ఇవి కూడా బ్యాక్టీరియా కేంద్రాలేనట

డోర్ క్నాబ్స్ (తలుపు గుబ్బలు), ఇవి కూడా బ్యాక్టీరియా కేంద్రాలేనట. వీటి ద్వారా కూడా మీ చేతుల్లోకి బ్యాక్టీరియా సంక్రమించే అవకాశముందట. డోర్ క్నాబ్స్ ఒక్కో చదరపు అంగుళానికి గాను 8,643 బ్యాక్టీరియాలను కలిగి ఉంటుదట. సాధారణంగా వంట గది క్రిములతో నిండి ఉంటుంది. కిచెన్ కౌంటర్స్‌లో చదరపు అంగుళానికి గాను 1736 బ్యాక్టిరియా తిష్టవేస్తుందట.

ఏటీఎమ్ స్ర్కీన్ చదరపు అంగుళానికిగాను 4,500 బ్యాక్టిరియాల

ఏటీఎమ్ స్ర్కీన్ చదరపు అంగుళానికిగాను 4,500 బ్యాక్టిరియాల

మనం రోజు ఉపయోగించే ఏటీఎమ్ స్ర్కీన్ చదరపు అంగుళానికి గాను 4,500 బ్యాక్టిరియాలను కలిగి ఉంటుందట. పెట్స్ ఈటింగ్ బౌల్, ఇది కూడా క్రిములతో నిండి ఉండే ప్రదేశమే. సగటు పెట్ ఈటింగ్ బౌల్ చదరపు అంగుళానికి 2,110 బ్యాక్టిరియాలను కలిగి ఉంటుందట.

 బ్యాక్టీరియా ఫ్రీగా ఉంచేందుకు

బ్యాక్టీరియా ఫ్రీగా ఉంచేందుకు

మీ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాక్టీరియా ఫ్రీగా ఉంచేందుకు అనేక ఉత్పత్తులు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. అయితే, వీటిలో కొత్త ఉత్పత్తులు స్ర్కీన్ కోటింగ్‌లను దెబ్బతీసేలా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ బ్యాక్టీరియాను తొలగించేందుకు యూవీ లైట్ క్లీనర్‌లు అందుబాటులోకి ఉన్నప్పటికి అవి చాలా ఖరీదులో లభ్యమవుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసే విషయంలో..

స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసే విషయంలో..

స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసే విషయంలో నిత్యం అప్రమత్తత వహించాల్సి ఉంటుంది. లేకుంటే, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సంక్రమించే రకరకాల బ్యాక్టీరియా మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదముంది. స్మార్ట్‌ఫోన్ క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే ఫోన్ మన్నిక దెబ్బతినే అవకాశముంది. మీ డర్టీ స్మార్ట్‌ఫోన్‌ను సరైన మార్గంలో క్లీన్ చేసేందుకు పలు బెస్ట్ టిప్స్.

స్మార్ట్‌ఫోన్ క్లీనింగ్‌కు అవసరమైన సామాగ్రి...

స్మార్ట్‌ఫోన్ క్లీనింగ్‌కు అవసరమైన సామాగ్రి...

లింట్ ఫ్రీ మైక్రోఫైబర్ క్లాత్,
కాటన్ స్వాబ్స్
డిస్టిల్ వాటర్,
రబ్టింద్ ఆల్కాహాల్

స్టెప్ 1

స్టెప్ 1

మీ ఫోన్ పై ఏర్పాటు చేసిన స్ర్కీన్ ప్రొటెక్టర్‌తో పాటు కవర్ కేస్‌లను తొలగిచండి. ఫోన్‌ను స్విచాఫ్ చేసి బ్యాటరీని వేరు చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఫోన్ స్ర్కీన్ ప్రోటెక్టర్‌ను జాగ్రత్తగా తొలగించండి. ఓ కాటన్ స్వాబ్‌ను రబ్బింగ్ ఆల్కాహాల్‌లో ముంచి కీబోర్డ్‌ను ఏమాత్రం ఒత్తిడి తగలకుండా సున్నితంగా శుభ్రం చేయండి.

స్టెప్ 3

స్టెప్ 3

ఇదే పద్ధతిని ఫోన్ వెనుక కేస్ పై అప్లై చేయండి. ఫోన్ లోపలి భాగాలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవల్సి ఉంటుంది. ముఖ్యంగా కెమెరా లెన్స్ కెమోరా లెన్స్ క్లినింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి.

స్టెప్ 4

స్టెప్ 4

ముఖ్యంగా కెమెరా లెన్స్ కెమోరా లెన్స్ క్లినింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొద్దిగా డిస్టిల్ వాటర్‌లో క్వాటన్ స్వాబ్‌ను ముంచి కెమెరా లెన్స్ ఇంకా ఫ్లాష్ ను స్పిన్నింగ్ మోషన్‌లో సున్నితంగా క్లీన్ చేయండి.

స్టెప్ 5

స్టెప్ 5

ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలను ఉపయోగించొద్దు. స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతలతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.

Best Mobiles in India

English summary
How to Keep Your Smartphone Clean. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X