Home
How to

మీ Aadhaar కార్డు ఎక్క‌డెక్క‌డ వినియోగించారో History తెలుసుకోండిలా!

భార‌త దేశంలో నివ‌సించే ప్ర‌తి ఒక్క‌రికి గుర్తింపు కోసం ప్ర‌భుత్వం Aadhaar Cardల‌ను జారీ చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అంద‌రికీ Aadhaar Card త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఏ అప్లికేష‌న్ పెట్టుకోవాల‌న్నా, ప్ర‌భుత్వానికి సంబంధించి ఏదైనా ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు పెట్టుకోవాల‌న్నా ఆధార్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి అయింది. అయితే, ఎవ‌రెవ‌రు త‌మ ఆధార్ కార్డును ఎక్క‌డ వినియోగిస్తున్నార‌నే విష‌యాన్ని తెలుసుకోవాల‌నుకుంటే దానికి కూడా ప్ర‌భుత్వం ఓ మార్గాన్ని క‌ల్పించింది.

Aadhaar

ఆధార్ కార్డు వినియోగానికి సంబంధించిన హిస్ట‌రీ తెలుసుకునే వెసులుబాటును ప్ర‌భుత్వం అధికారిక సైట్‌లో క‌ల్పించింది. కొన్ని చిన్న చిన్న స్టెప్స్ పాటించ‌డం ద్వారా మీరు మీ యొక్క ఆధార్ కార్డు యూసేజ్‌కు సంబంధించిన హిస్ట‌రీ ని తెలుసుకోవ‌చ్చు. ఒక‌వేళ మీరు కూడా మీ ఆధార్ కార్డు హిస్ట‌రీ తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్ల‌యితే.. మేం ఇక్క‌డ మీ కోసం ఆ ప్ర‌క్రియ‌ను అందిస్తున్నాం. దీనిపై ఓసారి లుక్కేయండి.

Aadhaar

ఆధార్ కార్డు హిస్ట‌రీ ఎలా చూడాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
* ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. లింక్: (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html)
* UIDAI వెబ్‌సైట్లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత "మై ఆధార్‌" సెక్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
* మై ఆధార్ సెక్ష‌న్‌లో కింద కొన్ని ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిలో ఆధార్ స‌ర్వీసులు అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఇప్పుడు మీకు మ‌రో ట్యాబ్‌లో ఆధార్ స‌ర్వీసుల‌కు సంబంధించిన ఆప్ష‌న్లు ప్రత్య‌క్ష‌మ‌వుతాయి.
* వాటిలో ఆధార్ Authentication History అనే సెక్ష‌న్ మీకు క‌నిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత మీరు ఆధార్ Authentication History క‌నుగొన‌డానికి కొన్ని వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
* మీ యొక్క 12 అంకెల ఆధార్ నంబ‌ర్‌, సెక్యురిటీ కోడ్ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత ఓటీపీ అడుగుతుంది.
* ఆ ఓటీపీని అక్క‌డ ఇచ్చిన బాక్సులో ఎంట‌ర్ చేయ‌డంతో పాటుగా, మీకు ఆధార్ హిస్ట‌రీ ఎప్ప‌టి నుంచి కావాల‌నుకుంటున్నారో అందుకు సంబంధించిన తేదీని న‌మోదు చేయాల్సి ఉంటుంది.
* ఈ వివ‌రాలన్నీ పూర్తి చేసి విజ‌య‌వంతంగా స‌బ్‌మిట్ చేస్తే.. మీకు మీ ఆధార్ Authentication History అనేది పొంద‌గ‌లుగుతారు.

ఇక మీరు ఆధార్ హిస్ట‌రీని పొందిన త‌ర్వాత అందులో ఎప్పుడు, ఎక్క‌డ వినియోగించారు అనే విష‌యాల్ని స్ప‌ష్టంగా తెలుసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్ వ‌ల్ల క‌లిగే మ‌రో ముఖ్య ఉప‌యోగం ఏంటంటే.. ఎవ‌రైనా మ‌న ఆధార్ డేటాను త‌ప్పు మార్గంలో వినియోస్తున్న‌ట్ల‌యితే దానికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఆస్కారం ఉంటుంది. కాబ‌ట్టి, ఎవ‌రైనా త‌మ ఆధార్ హిస్ట‌రీని తెలుసుకోవాల‌నుకుంటే పైన పేర్కొన్న స్టెప్స్‌ను అనుస‌రించి తెలుసుకోవ‌చ్చు.

Aadhaar

అదేవిధంగా, Aadhaar పీవీసీ కార్డును ఆర్డ‌ర్ చేయ‌డానికి ఈ కింది ప‌ద్ద‌తి పాటించండి:
* ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. లింక్: (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html)
* UIDAI వెబ్‌సైట్లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత "మై ఆధార్‌" సెక్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
* మై ఆధార్ సెక్ష‌న్‌లో కింద కొన్ని ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిలో డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఇప్పుడు మీకు లాగిన్ విత్ ఆధార్ అండ్ ఓటీపీ అని ఒక బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* అనంత‌రం మీ ఆధార్ నంబ‌ర్ టైప్ చేసిన త‌ర్వాత, రిజిస్ట‌ర్‌డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.
* లాగిన్ విజ‌య‌వంతం అయిన త‌ర్వాత మీకు డాష్‌బోర్డులో ప‌లు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. అందులో రెండోది ఆర్డ‌ర్ పీవీసీ కార్డు అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఆ ఆప్ష‌న్‌ ఎంపిక చేసుకున్న త‌ర్వాత పీవీసీ కార్డును ఆర్డ‌ర్ చేయ‌డానికి మీకు ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. అయితే ఇందుకోసం మీరు రూ.50 చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. మీరు పేర్కొన్న అడ్ర‌స్‌కు కార్డు పోస్టు ద్వారా అందుతుంది.

Best Mobiles in India

English summary
How to know aadhar card used history online.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X