Just In
Don't Miss
- News
పౌరసత్వ నిరసల ఎఫెక్ట్: అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు..!
- Lifestyle
జంటలు మార్నింగ్ సెక్స్ తో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసా!
- Sports
ఐపీఎల్ వేలం 2020: గెలుపు గుర్రాల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరా!
- Automobiles
ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో
- Movies
శక్తిమ్యాన్లా సూపర్ హీరో అవుతా.. వైరలవుతోన్న ట్రైలర్
- Finance
మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
స్మార్ట్‌ఫోన్‌లో సెన్సార్ల గురించి ఎప్పుడైనా విన్నారా ?
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. ఇందులో ఏం ఉన్నాయో తెలియకుండానే చాలామంది వాడేస్తుంటారు. ఇంటర్నెట్ ఉంటే చాలు ఇక వేరే వాటితో పనిలేకుండా అందరూ సోషల్ మీడియాలో గడిపేస్తుంటారు. మరి మీ స్మార్ట్ ఫోన్లో సెన్సార్లు ఉంటాయని ఎవరికైనా తెలుసా..అసలు అవి ఎలా పనిచేస్తాయో కూడా చాలామందికి తెలియదు. మరి ఆ సెన్సార్లు ఎన్ని ఉన్నాయి అనే విషయం అయితే అంతే పట్టదు. అందరూ వాడే స్మార్ట్ఫోన్లు మరింత బలోపేతం కావటానికి సెన్సార్లు ఏర్పాటు ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్ల కోసం 9 సెన్సార్లు అభివృద్థి చేయబడ్డాయి. ఈ మధ్య కొత్తగా కొన్ని సెన్సార్లు వచ్చినా ప్రధానంగా ఈ తొమ్మది సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూడండి.
యూజర్లకు శుభవార్తను అందించిన ఆపిల్

లైట్ సెన్సార్ ..
ఫోన్లోని ఆటో బ్రైట్నెస్ సెట్టింగ్ ఆప్షన్‌కు సంబంధించిన బాధ్యతను లైట్ సెన్సార్ తీసుకుంటుంది. ఈ లైట్ సెన్సార్ వెళుతురు కండీషన్‌ను బట్టి డిస్ప్లే బ్రైట్నెస్ను ఎడ్జస్ట్ చేస్తుంటుంది.

యాక్సిలరోమీటర్ సెన్సార్
స్మార్ట్ఫోన్లలో పొందుపరిచే యాక్సిలరోమీటర్ సెన్సార్ స్మార్ట్‌ఫోన్ మోషన్‌ను డిటెక్ట్ చేస్తుంది. wake-up screen వంటి ఆప్షన్‌కు కూడా ఈ సెన్సార్‌ను ఉఫయోగిస్తున్నారు. స్ర్కీన్ ఓరియంటేషన్ బాధ్యతలను కూడా ఈ యాక్సిలరోమీటర్ సెన్సార్ తీసుకుంటుంది.

ప్రాక్సిమిటీ సెన్సార్
స్మార్ట్ఫోన్లలో అత్యధికంగా వినియోంచబడుతోన్న సెన్సార్లలో ప్రాక్సిమిటీ సెన్సార్ ఒకటి. మీరు వేరొక పనిలో ఉన్నప్పుడు ఈ సెన్సార్ ఆటోమెటిక్‌గా ఫోన్ డిస్ప్లేను టర్నాఫ్ చేసేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా భాగంలో అమర్చబడే ఈ సెన్సార్ వ్యవస్థ మీ కదిలకలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది.

మాగ్నిటోమీటర్
స్మార్ట్ఫోన్లలో ఏర్పాటు చేసే మాగ్నిటోమీటర్ సెన్సార్ మాగ్నటిక్ ఫీల్డ్‌లను గుర్తించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని గుర్తించగలిగే ఈ సెన్సార్ ఆధారంగానే ఫోన్లోని జీపీఎస్ యాప్స్ పనిచేస్తాయి.
గైరోస్కోప్ సెన్సార్
స్మార్ట్ఫోన్లలో ఏర్పాటు చేసే గైరోస్కోప్ సెన్సార్ డివైస్ యొక్క యాంగ్యులర్ మొమెంటమ్‌ను లెక్కిస్తుంది. ఈ సెన్సార్ ఇంచుమించుగా యాక్సిలరోమీటర్ సెన్సార్ తరహాలో స్పందిస్తుంది.

హార్ట్ రేట్ మానిటర్
హార్ట్ రేట్ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో కెమెరా ఫ్లాష్ క్రింద నిక్షిప్తం చేస్తారు. యూజర్ ఈ సెన్సార్ పై తన వేలిని కొద్ది సెకన్లు ఉంచినట్లయితే ఎల్ఈడి లైట్ రక్త ప్రసరణను నమోదు చేసి ఆ వివరాలను సెన్సార్‌కు పంపుతుంది. తద్వారా మీ హార్ట్ రేట్ ఫోన్ తెర పై ప్రత్యక్షమవుతుంది. ఈ హార్ట్-రేట్ సెన్సార్ ఫీచర్ ఎస్ హెల్త్ అప్లికేషన్లో ఓ భాగంగా స్పందిస్తుంది.

ఫింగర్ ప్రింట్ సెన్సార్..
ఫోన్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వేలిముద్రలు ఆధారంగా స్పందించే ఈ సెన్సార్ ఫోన్‌ను సెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేస్తుంది. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవటం వల్ల మీరు తప్ప వేరొకరు ఫోన్ ను అన్ లాక్ చేయలేరు. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా వరకు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తున్నాయి.

పిడోమీటర్ సెన్సార్..
ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లో ఈ పిడోమీటర్ సెన్సార్‌ను ఏర్పాటు చేసారు. స్మార్ట్ బ్యాండ్స్ అలానే వేరబుల్ గాడ్జెట్లలో ఈ పిడోమీటర్ సెన్సార్ ఎక్కువుగా కనిపిస్తుంటుంది. ఈ సెన్సార్ మీ ఫిట్నెస్ కదిలకలను పసిగట్టి శరీరంలోని క్యాలరీల తీరును విశ్లేషిస్తుంది.

బారోమీటర్..
స్మార్ట్ఫోన్లలో ఏర్పాటు చేసే బారోమీటర్ సెన్సార్లు చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులను విశ్లేషించి సంబంధిత వెదర్ అప్డేట్లను ఎప్పటికప్పుడు యూజర్ ముందు ఉంచుతాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790