మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ లక్షణాలను గుర్తించారా.. అయితే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే..!
టెక్నాలజీ రోజు రోజుకు గణనీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. సైబర్ నేరగాళ్లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బ్యాంక్ ఖాతాల నుంచి నగదు కాజేయడం సహా స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తున్నారు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
హ్యాకింగ్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం డిజిటల్ పరికరాలను అనేక రకాలుగా హ్యాక్ (Phone Hack) చేయవచ్చు. ఫోన్‌కు లింక్‌లు పంపడం ద్వారా కూడా మన ఫోన్‌ను వారి నియంత్రణలోకి తీసుకోవచ్చు. అయితే మన ఫోన్ హ్యాకింగ్‌కు గురైందా లేదా అనేది తెలుసుకొనేందుకు అనేక మార్గాలున్నాయి. ఫోన్‌లోని కొన్ని మార్పులను సరిగా గమనించడం ద్వారా హ్యాకింగ్‌కు గురైందా లేదా అనేది తెలుసుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ : ఫోన్ బ్యాటరీ అకస్మాత్తుగా డిశ్ఛార్జి అయిపోతుంటే హ్యాకింగ్ గురైనట్లు కొంత వరకు అంచనాకు రావచ్చు. ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఈ సమస్యను మీరు గుర్తిస్తే హ్యాంకింగ్‌కు గురైనట్లు నిర్ధారించుకోవచ్చు. ఫోన్‌ను హ్యాకింగ్‌కు గురైతేనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఫోన్ వేడెక్కుతుంటే : ఎటువంటి కారణం లేకుండా ఫోన్ వేడెక్కుతుంటే ఫోన్ హ్యాక్ చేయబడిందని భావించవచ్చు. ఫోన్‌ను ఎక్కువ సేపు వినియోగించినప్పుడు వేడెక్కడం సాధారణం. అయితే అసలు వినియోగించని సమయంలో కూడా ఫోన్ వేడెక్కుతుందంటే మీ ఫోన్‌ను ఇతరులు నియంత్రిస్తున్నట్లు అంచనాకు రావచ్చు. దీంతోపాటు సోషల్ మీడియాలో అసాధారణ కార్యకలాపాలను గుర్తిస్తే మీ ఫోన్ నియంత్రణ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందని అనుమానించవచ్చు.

ఫోన్ నెమ్మదిగా పనిచేస్తుందా..? : బ్యాక్‌గ్రౌండ్‌లో ఎటువంటి యాప్‌లు లేనప్పుడు మీ ఫోన్ నెమ్మదిగా స్పందిస్తుంటే హ్యాకింగ్ బారినపడినట్లు భావించవచ్చు. వేరొకరు మీ ఫోన్‌ను నియంత్రిస్తుంటేనే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు యాప్‌లు క్రాష్ అవ్వడం, వినియోగిస్తుండగా మధ్యలో ఆగిపోవడం హ్యాకింగ్ సంకేతాలుగా భావించవచ్చు.
పాప్ అప్ నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తున్నాయా? : సబ్‌స్క్రై్బ్ చేయని వెబ్‌సైట్‌లు, యాప్‌ల నుంచి పాప్ అప్ నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తుంటే మాత్రం అప్రమత్తం కావాల్సి ఉంటుంది. దీంతోపాటు మీ ఫోన్‌లో ఏయే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం ఉత్తమం. కొన్ని యాప్‌లు అనుమతి లేకుండా ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ కావచ్చు. అటువంటి యాప్‌ల ద్వారా హ్యాకర్లు మన ఫోన్‌ను నియంత్రించే అవకాశం ఉంటుంది.
ఫోన్ గ్యాలరీలో..: మీ ఫోన్ గ్యాలరీలో మీకు తీసిన ఫోటోలు కాకుండా ఇతర ఫోటోలను గుర్తి్స్తే మీ ఫోన్‌ను ఇతరులు వినియోగిస్తున్నట్లు అంచనాకు రావచ్చు. పైన తెలిపిన అంశాలను మీఫోన్‌లో గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించినా వెంటనే సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి తనిఖీ చేయించడం ఉత్తమం.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








