మీ వాట్సాప్ అకౌంట్‌ను ఎవరైనా ఉపయోగిస్తున్నారా.. ఎలా తెలుసుకోవాలి..?
వాట్సాప్ (Whatsapp) ప్రస్తుతం ఎక్కువ మంది యూజర్లు కలిగిన మెసేజింగ్ యాప్స్ లో ఒకటిగా ఉంది. భారత్‌లో సుమారు 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం వాట్సాప్ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా భద్రత కోసం ఇప్పటికే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్, టూ స్టెప్ వెరిఫికేషన్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు వాట్సాప్ ప్రైవేట్ చాట్‌ను ఇతరులు చూసేందుకు అవకాశం లేకుండా చాట్‌లాక్ వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి.
నాలుగు డివైస్‌లో లాగిన్ :
వాట్సాప్ ను ఒకేసారి నాలుగు డివైస్‌లో వినియోగించుకొనేందుకు అవకాశం ఉంది. Linked Device పేరుతో ఈ ఫీచర్‌ను గతంలోనే తీసుకొచ్చింది. కొన్నిసార్లు ఈ ఫీచర్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. మీకు చెందిన డివైస్‌లతోపాటు పని ప్రదేశంలో ఇతర డివైస్‌లో లాగిన్ చేస్తుంటారు.

పొరపాటును logout చేయడం మర్చిపోతే ఆ డివైస్ ద్వారా మీ వాట్సాప్ యాక్టివ్‌గానే ఉంటుంది. ఫలితంగా మీ చాట్, కాంటాక్ట్‌ను వారు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. దీంతోపాటు మీకు తెలియకుండా మీ వాట్సాప్ అకౌంట్ ను వారి డిజైస్‌లో లాగిన్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.
ఇలా తెలుసుకోండి :
అయితే మీకు వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు ఎవరైనా వినియోగిస్తున్నారా లేదా అని తెలుసుకొనేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. వాట్సాప్ లో Linked Device ఫీచర్ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఆ లిస్ట్ నుంచి ఇతర డివైస్‌లను తొలగించవచ్చు.
- వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
- కుడి వైపున కనిపిస్తున్న త్రీ డాట్ మెనూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- అనంతరం అక్కడ కనిపించిన Linked Device ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- మీ వాట్సాప్ అకౌంట్ ఎన్ని చోట్ల లాగిన్ అయిందనే వివరాలతో ఒక లిస్ట్ కనిపిస్తుంది.
- అక్కడ మీకు సంబంధం లేని డివైస్‌లు కనిపిస్తే వాటిని తొలగించవచ్చు.
ఇలా మీ వాట్సాప్ చాట్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అయితే మీ వాట్సాప్‌ను ఎవరూ యాక్సెస్ చేసినా.. మీ ప్రైవేట్ చాట్‌ను ఎవరూ చూడకుండా ఉండేందుకు Chatlock Feature ను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ చాట్‌ను Hide కూడా చేసుకొనేందుకు అవకాశం ఉంది.
మీకు ముఖ్యం అనిపించిన ఏదైనా చాట్ పైన Long Press చేయాలి. అనంతరం మీకు కొన్ని ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో Chatlock ఫీచర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మరియు ఓ PIN లేదా బయోమెట్రిక్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఫలితంగా ఈ చాట్ ప్రత్యేకమైన Locked Chats ఫోల్డర్‌లోకి వెళ్తుంది.
ఇలా లాక్ చేసిన చాట్‌లను Hide చేసుకొనేందుకు అవకాశం ఉంది. చాట్‌లాక్ చేసిన కాంటాక్ట్‌పై Long Press చేయడం ద్వారా మీకు కొన్ని ఆప్షన్‌లు కనిపిస్తాయి Hide ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. మీ అనుమతి లేకుండా మీ వాట్సాప్‌ను ఎవరైనా వినియోగించేందుకు ప్రయత్నం చేసినా.. Locked Chats ను ఎవరూ చూసేందుకు అవకాశం ఉండదు.


Click it and Unblock the Notifications








