మీ పేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టు అనిపిస్తుందా..?

సోషల్ మీడియా ఖాతాలు లక్ష్యంగా హ్యాకర్లు దాడులు చేయడం ఈ మధ్య కాలం లో చాల ఎక్కువయ్యింది.

|

సోషల్ మీడియా ఖాతాలు లక్ష్యంగా హ్యాకర్లు దాడులు చేయడం ఈ మధ్య కాలం లో చాల ఎక్కువయ్యింది.కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ సోషల్ మీడియా ఖాతాలను 14 ఏళ్ల పిల్లాడు హ్యాక్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.అందువల్ల మీ సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది ఫేస్‌బుక్ వాడుతుంటారు కాబట్టి తమ అకౌంట్ హ్యాక్ అయ్యిందో లేదో ఈ టిప్స్ ద్వారా తెలుసుకోండి.

ఫేస్‌బుక్ ఓపెన్ చేసి....

ఫేస్‌బుక్ ఓపెన్ చేసి....

ఫేస్‌బుక్ ఓపెన్ చేసి లాగ్ ఇన్ అయ్యి టాప్ రైట్ కార్నర్‌లోని యారో గుర్తులా ఉన్న ఐకాన్‌పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి.

సెక్యూరిట్ అండ్ లాగిన్ ఆప్షన్...

సెక్యూరిట్ అండ్ లాగిన్ ఆప్షన్...

ఎడమ వైపు జనరల్ కింద ఉన్న సెక్యూరిట్ అండ్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

మీ ఫోన్ లేదా మీ  సిస్టమ్ నుంచి కాకుండా....

మీ ఫోన్ లేదా మీ సిస్టమ్ నుంచి కాకుండా....

మీ ఫోన్ లేదా మీ సిస్టమ్ నుంచి కాకుండా మరో డివైజ్ నుంచి లాగిన్ అయ్యి ఉంటే మీ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినట్లు భావించొచ్చు.

ఏ టైంలో లాగిన్ అయ్యారో పూర్తి వివరాలు....
 

ఏ టైంలో లాగిన్ అయ్యారో పూర్తి వివరాలు....

మీ ఫేస్‌బుక్ ఖాతాలోకి ఏ టైంలో లాగిన్ అయ్యారో, ఏ గ్యాడ్జెట్ల నుంచి లాగిన్ అయ్యారో పూర్తి వివరాలు ఉంటాయి. ఏయే డివైజ్‌లలో లాగిన్ అయి ఉన్నారు, ఏ టైం నుంచి లాగిన్ అయ్యి ఉన్నారో కూడా ఉంటాయి.

ఒకవేళ వేరే డివైజ్ నుంచి లాగిన్ అయ్యి ఉంటే....

ఒకవేళ వేరే డివైజ్ నుంచి లాగిన్ అయ్యి ఉంటే....

ఒకవేళ వేరే డివైజ్ నుంచి లాగిన్ అయ్యి ఉంటే కుడి వైపు ఉండే మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తే నాట్ యూ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత సెక్యూర్ అకౌంట్ అని ఫేస్‌బుక్ అడుగుతుంది. ఇక్కడ మీ అకౌంట్ సెక్యూరిటీని పెంచుకోవడం కోసం ఆప్షన్స్ ఉంటాయి. అనుమానం ఉన్న డివైజ్ దగ్గర లాగౌట్‌పై క్లిక్ చేయొచ్చు. తర్వాత పాస్‌వర్డ్ మార్చుకుంటే సరిపోతుంది. చివర్లో లాగౌట్ ఆఫ్ ఆల్ సెషన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది.

సెక్యూర్‌గా ఉండటం కోసం Two-Factor Authentication ....

సెక్యూర్‌గా ఉండటం కోసం Two-Factor Authentication ....

మరింత సెక్యూర్‌గా ఉండటం కోసం Two-Factor Authentication ఎంచుకోవచ్చు. దీన్ని ఎనేబుల్ చేయడం ద్వారా కొత్త డివైజ్ నుంచి లాగిన్ అయితే మీ ఫోన్‌కు మెసేజ్ అందుతుంది. మీ అకౌంట్ హ్యాక్ అయితే అన్‌లాక్ చేయడం కోసం కొన్ని నమ్మకైన కాంటాక్ట్ నంబర్లు ఇవ్వొచ్చు.

 

 

Best Mobiles in India

English summary
How to Know If you’ve been Hacked on Facebook and What you Must Do.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X