మీ పాస్‌వర్డ్ దొంగిలించబడిందో లేదో తెలుసుకోవడం ఎలా ?

Posted By: ChaitanyaKumar ARK

ఈ డిజిటల్ ప్రపంచం మనం అనుకున్నంత సురక్షితం కాదు. ఏమాత్రం ఆలోచన లేకుండానే, మనసుకు తోచిన ప్రతి వెబ్సైట్ లోనూ మన వివరాలతో సైన్-అప్ చేస్తుంటాం. కానీ ఇలాంటి అనేక వెబ్సైట్స్ చౌర్యానికి గురవడం వలన, వినియోగదారుల వివరాలకు భద్రతలేకుండా పోతుంది. తద్వారా పాస్వోర్డ్స్ చౌర్యం జరిగి, మీ అకౌంట్స్ సులభంగా హాక్ కు గురయ్యే అవకాశం ఉంది. కావున మీ అకౌంట్ వివరాలు దొంగిలించబడినవో లేదో తెలుసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. మీ పాస్వోర్డ్ ఇప్పటికీ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని పద్దతులను మీముందు ఉంచుతున్నాం. అదృష్టవ శాత్తూ, మీ అకౌంట్ యొక్క సెక్యూరిటీ స్థాయి తెలుసుకోవడం చాలా సులభo.

మీ పాస్‌వర్డ్ దొంగిలించబడిందో లేదో తెలుసుకోవడం ఎలా ?

"Troy Hunt's Have I Been Pwned?" ఉపయోగించండి :
Troy Hunt's Have I Been Pwned అనేది మీ అకౌంట్ పాస్వోర్డ్ తస్కరించబడిందో లేదో తెలుసుకోవడానికి ఒక మంచి వెబ్సైట్ గా ఉన్నది. ఈ వెబ్సైట్ లో తస్కరించబడిన అనేక అకౌంట్లకు సంబంధించిన వివరాలు డేటాబేస్ రూపంలో పొందుపరచబడి ఉన్నాయి. ఒకవేళ మీ వివరములు తస్కరించబడిన ఎడల, మీ ఈ-మెయిల్ అడ్రెస్ ఇచ్చి ఎంటర్ చేయగానే , మీరు సైన్-అప్ అయి, చౌర్యానికి గురైన వెబ్సైట్స్ లిస్ట్ అందులో చూపబడుతుంది. haveibeenpwned.com నందు వివరములు చూడగలరు. మరియు ఇది Dark web నుండి యూసర్ నేమ్, పాస్వోర్డ్స్ కలయికను కూడా చూపగలదు.

వాట్సప్‌లోకి కొత్తగా అదిరే ఫీచర్, డిలీట్ బాధకు ఇకపై సెలవు !

ఈ వెబ్సైట్ ద్వారా మన పాస్వార్డ్స్ హాక్ అయ్యాయో లేదో సులువుగా తెలుసుకునే వెసులుబాటు ఉంది. మీ యూసర్ నేమ్, పాస్వోర్డ్ సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి హోమ్ పేజ్ లో కనిపించే " have I been pwnd ?" అనే పెద్ద సెర్చ్ బార్ లో మీ ఈ-మెయిల్ అడ్రెస్ ఇచ్చి "pwned ?" మీద క్లిక్ చేయవలసి వస్తుంది. ఈ వెబ్సైట్, మీ అకౌంట్స్ తస్కరణకు గురయ్యాయో లేదో అన్న వివరాలను పూర్తిగా మీ ముందు ఉంచుతుంది. మీ అకౌంట్స్ సురక్షితమైతే "Good News- no pwnage found! No breached accounts and no pastes." అని మెసేజ్ చూపెడుతుంది.

మీ పాస్‌వర్డ్ దొంగిలించబడిందో లేదో తెలుసుకోవడం ఎలా ?

ఒకవేళ తస్కరణకు గురైన పక్షం లో మీకు 'Oh no- pwned!' అని మెసేజ్ చూపించడంతో పాటు, మీ మెయిల్ ద్వారా సైన్- అప్ కాబడిన వెబ్సైట్స్ లో హాక్ కాబడిన వెబ్సైట్స్ జాబితాను చూపిస్తుంది. తద్వారా మీ అకౌంట్స్ సంబంధించిన పాస్వోర్డ్స్ వెంటనే మార్చుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ మెయిల్ అడ్రెస్ తో పాటు , మీ పాస్వోర్డ్స్ కూడా సురక్షితoగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. సెర్చ్ బార్ లో మీ పాస్వోర్డ్స్ టైప్ చేసి, pwned పై క్లిక్ చేసి మీ పాస్వోర్డ్స్ సురక్షితంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.

ఒక్క విషయం ... !
ఇక్కడ ఖచ్చితంగా చెప్పదగిన విషయం ఏమిటంటే, మీ పాస్వోర్డ్స్ సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి థార్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉపయోగించడం మంచిది కాదు. ఒక్కోసారి ఇవి సమస్యలను పెంచే అవకాశాలు ఉన్నాయి. కావున మీకు చౌర్యానికి గురయిందన్న అనుమానం వచ్చిన వెబ్సైట్స్ లో మీ అకౌంట్స్ పాస్వోర్డ్స్ తరచుగా మారుస్తూ ఉండండి. మరియు ఏదైనా వెబ్సైట్ లో వివరాలు ఇచ్చే ముందు, నమ్మదగిన వెబ్సైట్ అయితేనే ఇవ్వండి.

English summary
How to know if your password has been stolen or not More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot