మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు మద్దతును ఇస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా?

|

5G నెట్‌వర్క్ అనేది ఇప్పుడు మరింత ఎక్కువ చర్చనీయంగా ఉంది. 5G అనేది వినియోగదారులకు 20Gbps వరకు వేగవంతమైన డేటాను అందిస్తుంది. శామ్‌సంగ్, ఒప్పో, వన్‌ప్లస్, హువాయి, నోకియా, షియోమి, ఆపిల్ వంటి సంస్థలు ఇప్పటికే 5G నెట్‌వర్క్‌కు మద్దతును ఇచ్చే కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసాయి. అలాగే తమ యొక్క కొత్త ఫోన్ లలో కూడా 5G మద్దతును అందివ్వనున్నాయి.

మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు మద్దతును ఇస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా?

 

మీరు వాడుతున్న ప్రస్తుత ఆండ్రాయిడ్ ఫోన్ 5g నెట్‌వర్క్‌కు మద్దతును ఇస్తుందో లేదో తనిఖీ చేయడానికి మొదట మీరు మీ ఫోన్‌లో 'సెట్టింగులు' లను ఓపెన్ చేయండి. తరువాత 'వై-ఫై & నెట్‌వర్క్' ఎంపికను ఎంచుకొని అందులో 'మోర్' ఎంపిక మీద నొక్కండి. తరువాత 'సిమ్ & నెట్‌వర్క్' ఎంపికపై నొక్కండి. ఇందులో మీరు 'ప్రిఫర్డ్ నెట్‌వర్క్ టైప్' ఎంపిక క్రింద అన్ని టెక్నాలిజీల జాబితాను చూడగలరు. మీ ఫోన్ 5G కి మద్దతు ఇస్తే కనుక అది 2G / 3G / 4G / 5G గా జాబితా చేయబడుతుంది. అంతేకాకుండా మీరు కష్టపడి సంపాదించిన డబ్బును 5G స్మార్ట్‌ఫోన్‌ కోసం ఖర్చు చేయడానికి ముందు మీ యొక్క ఫోన్ 5G నెట్‌వర్క్‌ యొక్క సేవలను అందిస్తున్నట్లు ధృవీకరించడం చాలా మంచిది.

మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు మద్దతును ఇస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా?

1. భారతదేశంలో మొదట 5G నెట్‌వర్క్‌ను ఎవరు విడుదల చేస్తారు?

5G నెట్‌వర్క్‌ను ఎవరు విడుదల చేస్తారు అన్న దాని మీద ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. గత ఏడాది రిలయన్స్ సీఈఓ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ జియో 2021 రెండవ భాగంలో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 2021 రెండవ భాగంలో భారతదేశంలో 5G విప్లవానికి జియో మార్గదర్శకత్వం వహిస్తుందని భావించవచ్చు.

2. 5G అందుబాటులోకి వచ్చినప్పుడు 4G ఫోన్‌లకు ఏమి జరుగుతుంది?

5G నెట్‌వర్క్‌ను అమలు చేయడానికి స్మార్ట్‌ఫోన్‌ను మొదటగా 5G ఎనేబుల్ చేయాలి. 5G డివైస్లు 4G మరియు 3Gకి కూడా మద్దతును ఇస్తాయి.

3. భారతదేశంలో 5G కి మద్దతును ఇచ్చే ఫోన్లు ఏవి?

OPPO రెనో 5 ప్రో 5G, వివో V20 ప్రో, వన్‌ప్లస్ 8T, షియోమి Mi 10i వంటివే కాకుండా మరికొన్ని ఫోన్లు భారతదేశంలో 5Gకి మద్దతును ఇస్తున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to know if Your Phone Supports 5G Network?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X