Home
How to

మీ ఫోన్‌తో తీసిన ఫోటోకు సంబంధించి లొకేషన్‌ను తెలుసుకోవటం ఎలా..?

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు, వాటి ద్వారా క్యాప్చుర్ చేస్తోన్న ఫోటోలకు సంబంధించి మోడ్, షట్టర్ స్పీడ్, లొకేషన్ వంటి బేసిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేవ్ చేసేస్తున్నాయి.

By Bommu Sivanjaneyulu

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు, వాటి ద్వారా క్యాప్చుర్ చేస్తోన్న ఫోటోలకు సంబంధించి మోడ్, షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ, అపెర్చుర్, లొకేషన్ వంటి బేసిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేవ్ చేసేస్తున్నాయి. జీపీఎస్ టెక్నాలజీ సహాయంతో స్మార్ట్‌ఫోన్ కెమేరాలు లొకేషన్ ట్యాగ్‌ను ఆయా ఫోటోలకు యాడ్ చేయగలుగుతున్నాయి.

లొకేషన్ ట్యాగ్ తప్పనిసరిగా ఎనేబుల్ అయి ఉండాలి..

లొకేషన్ ట్యాగ్ తప్పనిసరిగా ఎనేబుల్ అయి ఉండాలి..

ఈ విషయం తెలియని చాలా మంది యూజర్లు ఫోటోకు సంబంధించి లొకేషన్‌ను తెలుసుకునేందుకు తెగతంటాలు పడిపోతుంటారు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మీ ఫోన్‌తో తీసిన ఫోటోకు సంబంధించి లొకేషన్‌ను ఏ విధంగా తెలుసుకోవాలనే దాని పై స్టెప్ బై స్టెప్ స్టోరీ గైడ్‌ను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది. స్టోరీలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలను మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఫోటోకు సంబంధించిన లొకేషన్ సేవ్ అవ్వాలంటే మీ కెమెరాలోని లొకేషన్ ట్యాగ్ లేదా జీపీఎస్ ట్యాగ్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది.

ఆండ్రాయిడ్ యూజర్లు..

ఆండ్రాయిడ్ యూజర్లు..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు లొకేషన్ ట్యాబ్‌ను ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ముందుగా ఫోన్ కెమెరా యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత ‘Location tag' లేదా ‘Save location' పేరుతో ఆప్షన్ ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ ఫోన్‌తో ఫోటో తీసిన ప్రతిసారి ఆ ఫోటోకు సంబంధించిన లొకేషన్ ట్యాగ్ సేవ్ కాబడుతుంది.

 

 

యాపిల్ ఐఫోన్ యూజర్లు..

యాపిల్ ఐఫోన్ యూజర్లు..

యాపిల్ ఐఫోన్ యూజర్లు లొకేషన్ ట్యాబ్‌ను ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ప్రైవసీ విభాగంలోకి వెళ్లిన తరువాత ‘Location services' అనే ఆప్షన్‌ను ఆన్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత కెమేరా ఆప్షన్‌లోకి వెళ్లి ‘While Using the App' అనే ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్‌తో ఫోటో తీసిన ప్రతిసారి ఆ ఫోటోకు సంబంధించిన లొకేషన్ ట్యాగ్ సేవ్ కాబడుతుంది.

 

 

 

లొకేషన్‌ను ఏ విధంగా తెలుసుకోవాలంటే..?

లొకేషన్‌ను ఏ విధంగా తెలుసుకోవాలంటే..?

ఫోటోకు సంబంధించిన లొకేషన్‌ను ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నట్లయితే ముందుగా మీ ఫోన్‌లోని డీఫాల్ట్ గ్యాలరీని ఓపెన్ చేసి అందులోని ఓ ఫోటోను సెలక్ట్ చేసుకోండి. ఫోటో ఓపెన్ అయిన తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడు హారిజెంటల్ డాట్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ‘Info' లేదా ‘details' పేరుతో ఓ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఇమేజ్‌కు సంబంధించిన లొకేషన్‌తో పాటు సైజ్, షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ వంటి డిటెయిల్స్ కనిపిస్తాయి.

 

 

ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ను వినియోగిస్తున్నట్లయితే...

ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ను వినియోగిస్తున్నట్లయితే...

మీరు ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ను వినియోగిస్తున్నట్లయితే ముందుగా ఫోటోస్ యాప్‌ను లాంచ్ చేసి ‘Albums' టాబ్‌లోకి స్విచ్ అవ్వండి. ఇక్కడ ‘Places' పై టాప్ చేసినట్లయితే అన్ని ఫోటోలకు సంబంధించిన లొకేషన్స్ మ్యాప్స్ రూపంలో స్ర్కీన్ పై కనిపిస్తాయి. అందులో మీకు కావల్సిన ఇమేజ్ పై క్లిక్ చేసినట్లయితే ఖచ్చితమైన లొకేషన్ వివరాలు కనిపిస్తాయి.

 

 


Best Mobiles in India

English summary
How to know the location of the photo taken using from our smartphone.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X