Home
How to

Phone Tapping మీ ఫోన్‌ను ఎవరైనా ట్యాపింగ్ లేదా ట్రాకింగ్‌ చేస్తున్నారా.. ఎలా తెలుసుకోవాలి..?

ఫోన్‌ ట్యాపింగ్‌ ఈ పదం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే సాధారణంగా అసాంఘిక శక్తుల ఫోన్లను పోలీసులు ట్యాపింగ్‌ చేస్తుంటారు. అయితే కొన్ని ప్రైవేటు సంస్థలు తయారు చేసిన ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ ద్వారా కూడా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఇటీవల కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.

అయితే ఫోన్‌ ట్యాపింగ్‌కు (Phone Tapping) గురైతే కొన్ని అంశాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. మరియు ట్యాపింగ్‌ గురికాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే మీ ఫోన్‌ ట్యాపింగ్‌ అయిందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అనే అంశాలపై పూర్తి వివరాలతో కూడిన కథనం.

Phone Tapping how to check if your phone tapped

ఎటువంటి శబ్దాలు వినిపించినా లేదా ... :
కాల్స్‌ మాట్లాడుతున్న సమయంలో ఎటువంటి శబ్దాలు వినిపించినా.. లేదా మరే ఇతర సౌండ్‌లు వినిపించినా ఫోన్‌ ట్రాకింగ్‌ లేదా ట్యాపింగ్‌ జరుగుతుందని అనుమానించవచ్చు. దీంతోపాటు ఫోన్‌ వినియోగించకపోయినా.. వేడెక్కుతుందంటే.. బ్యాక్‌ గ్రౌండ్‌లో డేటా ట్రాన్సిమిషన్‌ జరుగుతుందని భావించవచ్చు.

డేటా వినియోగం పెరిగినా :
స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగం పెరిగినా కొంత అనుమానం వ్యక్తం చేయవచ్చు. కొన్ని స్పై యాప్‌లు ఫోన్‌ నుంచి సేకరించిన డేటాను బదిలీ చేసేందుకు డేటాను వినియోగిస్తాయి. ఫలితంగా అధిక డేటా వినియోగం అవుతుంది. మరియు ట్రాకింగ్‌ లేదా ట్యాపింగ్‌ సమయంలో ఫోన్‌ కాస్త నెమ్మదిగా పనిచేస్తుంది.

మాల్వ్‌వేర్‌ ఇన్‌ స్టాల్‌ :
ఫోన్‌ను వినియోగించని సమయాల్లో కూడా ఫోన్ డిస్‌ప్లే ఆన్‌ కావడం మరియు నోటిఫికేషన్‌ సౌండ్‌ వినిపించడాన్ని గమనిస్తే కొత్త అవగాహనకు రావచ్చు. ఫోన్‌ను ఇతర మార్గాల ద్వారా వినియోగిస్తేనే ఇలా జరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీ ఫోన్లలో మాల్వ్‌ వేర్‌ ఇన్‌ స్టాల్‌ చేయబడి ఉంటే ఫోన్‌లో కొన్ని మార్పులను గమనించవచ్చు.

ఫోన్‌ కెమెరా, మైక్రో ఫోన్‌ :
దీంతోపాటు ముఖ్యంగా మీ అనుమతి లేకుండా ఫోన్‌ కెమెరా మరియు మైక్రో ఫోన్‌ యాక్టివేట్ అయింది అంటే మీ ఫోన్‌ను అనధికారికంగా ఎవరో యాక్సెస్‌ చేస్తున్నారని భావించవచ్చు. అయితే ఇలా చాలా రకాలుగా ఫోన్‌ ట్యాపింగ్‌ లేదా ట్రాకింగ్‌ను గుర్తించవచ్చు.

ఇలాంటి ట్యాపింగ్‌ బారిన పడకుండా ఉండాలంటే తరచుగా ఫోన్‌ సాఫ్ట్‌ వేర్‌ను అప్‌ డేట్‌ చేయాలి. మరియు అధికారిక ప్లాట్‌ఫాంల ద్వారా మాత్రమే యాప్‌లను డౌన్‌ లోడ్‌ చేయాలి. ఎటువంటి అనుమానం వచ్చినా.. యాప్‌లకు ఇచ్చిన అనుమతులను తనిఖీ చేసి, అవసరం లేని అనుమతులను తొలగించాలి. దీంతోపాటు పబ్లిక్‌ వైఫై నెట్‌ వర్క్‌ను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to know your phone is in tapping or tracking here are the tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X